యాప్నగరం

ఆలుతో అందం

ఆలుగడ్డను వంటకాల్లోనే కాదూ అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఒకసారి చూద్దామా. కళ్ల కింద నల్లమచ్చలను తొలగించేందుకు ఆలు బాగా ఉపయోగపడుతుంది.

TNN 27 Nov 2016, 8:54 pm
ఆలుగడ్డను వంటకాల్లోనే కాదూ అందానికి కూడా ఉపయోగించుకోవచ్చు. అదెలాగో ఒకసారి చూద్దామా. కళ్ల కింద నల్లమచ్చలను తొలగించేందుకు ఆలు బాగా ఉపయోగపడుతుంది. ముందుగా ఆలుగడ్డను ముక్కల్లా తరగాలి. కాసేపు ఫ్రిజ్ లో పెట్టాలి. తరువాత వాటిరి తీసుకుని కళ్ల కింద పెట్టుకోవాలి. ఇలా ప్రతి రోజు చేస్తే నల్లమచ్చలు తొలిగిపోయే అవకాశం ఉంది.
Samayam Telugu best benefits of potato for skin hair
ఆలుతో అందం


అలాగే ముల్తాని మట్టిలో చెంచా ఆలుగడ్డ గుజ్జు, నాలుగు చుక్కల రోజ్ వాటర్ కలపాలి. పావుగంట అనంతరం గోరువెచ్చటి నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. అదేవిధంగా ఒక ఆలుగడ్డను తురిమి రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక గిన్నెలో వేసి, దానిలో కోడిగుడ్డు, పెరుగు వేసి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి మొత్తానికి అప్లై చేయండి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చటి నీటితో కడిగి, మామూలుగా షాంపూ చేసుకోండి. ఇలా 20 రోజులకోసారి చేసి చూడండి.

మూడు టేబుల్ స్పూన్ల ఆలుగడ్డ రసం, 3 స్పూన్ల కలబంద రసం, 2 స్పూన్ల తేనె తీసుకోండి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించి రెండు గంటల తర్వాత తలస్నానం చేయండి. వారంలో రెండుసార్లు ఇలా చేసి చూడండి. మంచి జుట్టు మీ సొంతం అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.