యాప్నగరం

Monsoon Hair care : ఈ షాంపూతో తలస్నానం చేస్తే చుండ్రు తగ్గుతుందట..

Monsoon Hair care: జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాకాలంలో అందాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. కేవలం చర్మమే కాదు. వెంట్రుకల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమే. వర్షాలు, కాలుష్యానికి మన శిరోజాలు గురవుతాయి. ఈ సమయంలో చెమట పోస్తే శిరోజాలు పాడవుతాయి. దుమ్ము, కలుషిత మూలకాలని తడి జుట్టు ఆకర్షిస్తుంది. దీంతో వర్షాకాలంలో జుట్టు సమస్యలని దూరం చేసేందుకు కొన్ని జాగ్రత్తలు పాటించాలి అవి ఏంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకోండి.

Authored byరావుల అమల | Samayam Telugu 12 Jul 2022, 10:23 pm

ప్రధానాంశాలు:

  • వర్షాకాలంలో శిరోజాల సంరక్షణ ముఖ్యం
  • కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్న నిపుణులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu వర్షాకాలంలో జుట్టు సంరక్షణ
ఆయిల్ మసాజ్..
వర్షాకాలంలో జుట్టు తడిగా ఉంటుంది. అందుకే జాగ్రత్తలు(Monsoon Hair care) తీసుకోవడం ముఖ్యం. సరైన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల జుట్టు చిట్లిపోవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయిల్ మసాజ్ చాలా ఉపయోగపడుతుంది. మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగవుతుంది. అయితే ఇలా చేయడం వల్ల స్కాల్ప్‌ ఆరోగ్యంగా మారుతుంది. రెగ్యులర్‌గా తలస్నానం చేయడం వల్ల జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది. అయితే, రెగ్యులర్‌గా యాంటీ ఫ్రీజ్ సీరమ్‌ ఉపయోగించడం వల్ల సమస్య దూరమవుతుంది.

బయటికి వెళ్ళినప్పుడు..

బయటికి వెళ్ళినప్పుడు వర్షం కారణంగా జుట్టు స్కాల్ఫ్ దెబ్బతింటుంది. ఈ కారణంగా సహజ రంగు, ఆకృతి పాడవుతుంది. ఇక జుట్టుకి రంగు వేసుకున్న వారు మరింత జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే జుట్టు మరింత పాడవుతుంది. కాబట్టి జుట్టు రంగు పాడవ్వకుండా ఉంచే షాంపూని వాడండి. అదే విధంగా గొడుగు వాడడం మంచిది.

చుండ్రు..

చాలామంది చుండ్రు సమస్యని ఎదుర్కొంటారు. రెగ్యులర్‌గా షాంపూ చేయడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది. కెటోకానజోల్, సెలీనియం సల్ఫైడ్, జింక్ పైరిథియోన్ వంటి షాంపూలని రెగ్యులర్‌గా వాడడం వల్ల చుండ్రు సమస్య దూరమవుతుంది.

జిడ్డు..

వర్షం కారణంగా స్కాల్ప్‌ జిడ్డుగా మారుతుంది. ఇలా అవ్వకుండా ఉండాలంటే తక్కువ గాఢత ఉన్న షాంపూ వాడడం మంచిది. జుట్టు చివర్లకి కండీషనర్‌ రాయండి. షాంపూ, కండీషనర్ వాడిన తర్వాత మీ జుట్టుని శుభ్రంగా నీటితో కడగడం ముఖ్యమని తెలుసుకోండి. చల్లని నీరు వాడడం మంచిది. ఎందుకంటే చల్లని నీటితో తలస్నానం చేస్తే కుదుళ్ళు తెర్చుకుని నూనె ఉత్పత్తి తగ్గుతుంది.



లోషన్..

జుట్టు స్కాల్ఫ్‌ని శుభ్రంగా ఉంచడం చాలా ముఖ్యం. ఎందుకంటే జిడ్డుగా ఉంటే ఎక్కువగా ఇన్ఫెక్షన్ వస్తుంది. వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ వంటి సమస్యలు దూరమవ్వాలంటే స్కాల్ఫ్‌ని ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తుండాలి. దీంతో పాటు యాంటీ ఫంగల్ లోషన్ వాడడం కూడా ముఖ్యమే.

జుట్టు మెరిసేందుకు..

జుట్టు పొడిబారడం, చిట్లడం కారణంగా జుట్టు మెరుపు తగ్గుతుంది. దీనికోసం యాపిల్ సైడర్ వెనిగర్ ఓ కప్పు నీటిలో పోసి బాగా కలపండి. షాంపూతో తలస్నానం చేశాక ఈ మిశ్రమంతో జుట్టుని కడిగితే జుట్టు మెరవడం ఖాయం.

జుట్టు పెరగాలంటే..

జుట్టు ఎక్కువగా సూర్యకిరణాలకి ఎక్స్‌పోజ్ అయినప్పుడు అది పెళుసుగా మారుతుంది. అయితే ప్రోటీన్ ఫుడ్ తీసుకోవడం, బయోటిన్ సప్లిమెంట్స్ తీసుకోవడం వల్ల జుట్టు సమస్యలు దూరమవుతాయి. జుట్టు పెరుగుదలకు బయోటిన్ అనే విటమిన్ హెల్ప్ చేస్తుంది. వీటిని వాడడం వల్ల జుట్టు రాలడం, పెళుసుగా ఉన్న జుట్టు బలంగా మారుతుంది. అయితే వీటిని వాడే ముందు వైద్యుల సలహా తప్పనిసరిగా తీసుకోవాలి.

గమనిక: నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.