యాప్నగరం

coffee beauty tips: కాఫీ ప్యాక్‌తో.. యంగ్‌ లుక్‌ మీ సొంతం చేసుకోండి..!

coffee beauty tips: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే.. బాడీ మొత్తం యాక్టివ్‌ అవుతుంది. శరీరాన్ని ఉత్తేజపరచి.. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాఫీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 23 Dec 2022, 12:37 pm
coffee beauty tips: ఉదయం లేవగానే ఒక కప్పు కాఫీ తాగితే.. బాడీ మొత్తం యాక్టివ్‌ అవుతుంది. శరీరాన్ని ఉత్తేజపరచి.. రోజు మొత్తం ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది. కాఫీ అందాన్ని రెట్టింపు చేసుకోవడానికీ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు మొటిమలు, దద్దుర్లను దూరంగా ఉంచుతాయి. యాంటీ ఏజెనింగ్‌గా పనిచేయడంతోపాటు ముఖంపై మచ్చలు, నల్లని వలయాలనూ తొలగిస్తాయి. కాఫీతో.. మీ సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయండి.
Samayam Telugu know the beauty tips of coffee face pack to improve beauty
coffee beauty tips: కాఫీ ప్యాక్‌తో.. యంగ్‌ లుక్‌ మీ సొంతం చేసుకోండి..!


డెడ్‌ సెల్స్‌ తొలగుతాయి..

కాఫీ పొడి చర్మానికి మంచి స్క్రబ్‌గా పనిచేస్తుంది. స్నానం చేసే సమయంలో కాఫీపొడిని నేరుగా చర్మంపై రుద్దుకోండి. ఇలా చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలు తొలగుతాయి. స్క్రబింగ్ కోసం కాఫీ గింజలను కూడా వాడొచ్చు. కాఫీ పొడిలో.. చిన్న పలుకుల పంచదార, రోజ్‌ వాటర్‌ వేసి కూడా ముఖాన్ని స్క్రబ్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ముఖం తాజాగా మారుతుంది.

ముడతలు మాయం..

కాఫీ పొడిలో యాంటీఏజింగ్‌ గుణాలు మెండుగా ఉంటాయి. మీ ముఖంపై ముడతలను పోగొట్టుకోవాలంటే.. కాఫీ పొడిలో టీట్రీ ఆయిల్, కొన్ని చుక్కల నీరు వేసి పేస్ట్‌లా తయారు చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా అప్లై చేసుకోండి. ఈ ప్యాక్‌తో చర్మం బిగుతుగా మారడంతో పాటు, చర్మంపై పేరుకున్న డెడ్‌ సెల్స్‌ తొలగుతాయి.

డార్క్‌ సర్కిల్స్‌కు చెక్‌ పెట్టండి..

ఈ రోజుల్లో.. డిజిటల్స్‌ స్క్రీన్స్‌ ఎక్కువగా వాడటం, నిద్రలేమి, బిజీ లైఫ్‌స్టైల్‌ కారణంగా.. కంటి కింద డార్క్‌ సర్కిల్స్‌ సమస్యతో ఎక్కువమంది బాధపడుతున్నారు. ఈ సమస్యకు చెక్‌ పెట్టడానికి.. కాఫీ ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. కళ్ల చుట్టూ.. కాఫీ డికాక్షన్‌ను రుద్దితే మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. కాఫీలోని విటమిన్‌ 'కె' కళ్లను రిలాక్స్‌ చేస్తాయి. దీనిలో ఉండే కెఫిన్‌ కళ్ల కింద చర్మాన్ని బిగుతుగా, గ్లోగా చేస్తాయి.

ముఖాన్ని మెరిపించండి..

జిడ్డు చర్మం ఉన్నవారు... కాఫీ డికాక్షన్లో కొద్దిగా పెరుగు , శెనగపిండి కలిపి ముఖానికి అప్లై చేసి.. పది నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోండి. దీనివల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగిపోయి చర్మం బిగుతుగా తయారవుతుంది. పిగ్మెంటేషన్ సమస్య కూడా దూరమవుతుంది.

coffe face pack3

కాఫీకి ఆలివ్ ఆయిల్ ని జోడించి ఆ మిశ్రమంతో ముఖాన్ని శుభ్రపరిస్తే మొటిమల బాధ తగ్గుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.