యాప్నగరం

beauty benefits of jaggery: బెల్లంతో.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండి..!

beauty benefits of jaggery: బెల్లం.. కేవలం మన ఆరోగ్య సంరక్షణకే కాదు.. చర్మం, జుట్టును సంరక్షించుకోవడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షిస్తుంది. డల్‌గా ఉన్న హెయిర్‌ను మెరిపిస్తుంది. బెల్లం సహాయంతో మీ అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 4 Jan 2023, 3:09 pm
beauty benefits of jaggery: బెల్లం తీసుకుంటే ఆరోగ్యానికి మంచిదని మనకు తెలుసు. బెల్లంలో కాల్షియం, మెగ్నిషియం, పొటాషియం, బి కాంప్లెక్సు, విటమిన్‌ సి, బి2, ఈ వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. రోజూ కొంచెం బెల్లం తింటే అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది. శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. అజీర్తి, మలబద్దకం, నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులు, రక్తహీనత వంటి సమస్యలకు బెల్లం చెక్‌ పెడుతుంది. బెల్లం.. కేవలం మన ఆరోగ్య సంరక్షణకే కాదు.. చర్మం, జుట్టును సంరక్షించుకోవడానికి సహాయపడుతుంది. బెల్లంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. చిన్న వయసులో వృద్ధాప్య ఛాయలు రాకుండా రక్షిస్తుంది. డల్‌గా ఉన్న హెయిర్‌ను మెరిపిస్తుంది. బెల్లం మన డైట్‌లో చేర్చుకున్నా, హోంరెమిడీస్‌లో వాడినా.. అనేక సౌందర్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు అంటున్నారు. బెల్లం సహాయంతో మీ అందాన్ని ఎలా రెట్టింపు చేసుకోవాలో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Samayam Telugu know the benefits of jaggery for hair and skin
beauty benefits of jaggery: బెల్లంతో.. స్పాట్‌ లెస్‌ బ్యూటీని సొంతం చేసుకోండి..!


మొటిమల మచ్చలు మాయం..

రోజూ కొంచెం బెల్లం తింటే అందులో ఉండే ఐరన్, క్యాల్షియం వల్ల చర్మంలోని మలినాలు, బ్లాక్ హెడ్స్ తొలగిపోయి మొటిమలు ఏర్పడకుండా చేస్తాయి. అర చెంచా బెల్లం పొడిని తీసుకుని అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలిపి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ను మొటిమల వల్ల ఏర్పడే బ్లాక్ హెడ్స్, మచ్చలపై అప్లై చేసి.. 20 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా చేస్తే బ్లాక్‌హెడ్స్‌, మొటిమల మచ్చలు త్వరగా మాయం అవుతాయి.

ముడతలకు చెక్‌..

బెల్లంలో సెలీనియంతో సహా శక్తివంతమైన మినరల్స్‌ ఉంటాయి. దీనిలో యాంటీ ఏజింగ్‌ లక్షణాలు ఉన్నాయి. నవ్వుల నూనెలో కొంచెం బెల్లం పొడి, కాస్త అలోవెరా జెల్‌ వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ ముఖానికి అప్లై చేసుకోండి. ఆరిన తర్వతా ముఖాన్ని నీళ్లతో శుభ్రం చేసుకోండి. వారానికి రెండు సార్లు ఈ ప్యాక్‌ వేసుకుంటే.. చర్మంపై ముడతలు, ఫైన్‌ లైన్స్‌ తగ్గి.. యవ్వనంగా కనిపిస్తారు.

చర్మానికి తేమనందిస్తుంది..

బెల్లంలో గ్లైకోలిక్ యాసిడ్ ఉంటుంది. గ్లైకోలిక్ యాసిడ్‌ను బ్యూటీ ప్రొడెక్స్‌లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. రెండు స్పూన్ల బెల్లం పొడి తీసుకుని దానిలో కొద్దిగా నిమ్మరసం, తేనె కలిపి పేస్ట్‌లా చేసుకోండి. ఈ పేస్ట్‌ను ముఖంపై అప్లై చేయండి. ఆరిన తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. బెల్లం మన చర్మంలోని మలినాలను తొలగిస్తుంది, చర్మానికి అద్భుతమైన మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌తో ముఖానికి సరికొత్త గ్లో వస్తుంది.


క్లెన్సర్‌లా పనిచేస్తుంది..

బెల్లంలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది న్యాచురల్‌ క్లెన్సర్‌లా పని చేస్తుంది. చర్మం నుంచి టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. బెల్లంలోని యాంటీఆక్సిడెంట్లు తేలికపాటి డిటాక్స్‌గా పనిచేస్తాయి. ప్రీ-రాడికల్స్‌తో పోరాడుతాయి. ఇవి చర్మంలోని మలినాలను తొలగిస్తాయి. చర్మానికి రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది.

జుట్టు రాలడం తగ్గుతుంది..

ఐరన్ లోపం వల్ల జుట్టు రాలడం పెరుగుతుంది. బెల్లంలో ఐరన్ కంటెంట్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచి.. శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది తలకు కూడా రక్త ప్రసరణను పెంచుతుంది. జుట్టు కుదుళ్లను స్ట్రాంగ్‌ చేస్తుంది. మన డైట్‌లో బెల్లం తరచుగా తీసుకుంటే.. జుట్టు రాలడం తగ్గుతుంది, జుట్టు ఫాస్ట్‌గా పెరుగుతుంది, బెల్లం జుట్టుకు మంచి మెరుపును కూడా ఇస్తుంది.

బెల్లం రెండు టీ స్పీన్లు, ముల్తానీ మట్టి రెండు టేబుల్‌ స్పూన్లు, పెరుగు కొద్దిగా తీసుకుని.. ఈ మూడింటినీ మిక్స్‌ చేసి పేస్ట్‌లా చేయండి. ఈ పేస్ట్‌ మీ తలకు, జుట్టుకు పట్టించండి. 20 నిమిషాలు ఆరనిచ్చి, మైల్డ్‌ షాంపుతో తలను శుభ్రం చేసుకోండి. ఇలా వారానికి ఒక సారి చేస్తే.. మెరిసే జుట్టు పొందవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.