యాప్నగరం

మోనోక్రోమ్ కలర్స్ దుస్తులతో పెళ్లిలో మెరిసిపోండి!

ఒకప్పుడు శుభకార్యాల్లో బ్లాక్ కలర్ దుస్తులు ధరించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లు. కానీ..

TNN & Agencies 6 Feb 2017, 4:59 pm
ఒకప్పుడు శుభకార్యాల్లో బ్లాక్ కలర్ దుస్తులు ధరించాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడలా కాదు. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్‌లో మోనోక్రోమ్ కలర్ల దుస్తులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది నేటితరం యువత. ఈ మోనోక్రోమ్ రంగుల దుస్తుల్లోనే ఏదో తెలియని అందం, మెరుపు ఉట్టిపడుతున్నాయా అన్నట్టుగా వుందీ కొత్త బ్రైడల్ కలెక్షన్. ఒకవేళ ఇప్పటివరకు మీకు ఈ మోనోక్రోమ్ కలర్స్ పట్ల అంత ఆసక్తి లేకున్నా... లాక్మే ఫ్యాషన్ వీక్‌లో 4వ రోజు షో చేసిన బ్రైడల్ కలెక్షన్స్ చూస్తే, వాటిపై మనసు పారేసుకోవడం మాత్రం గ్యారంటీ అంటున్నారు ఫ్యాషన్ ఎక్స్‌పర్ట్స్!
Samayam Telugu lfw summer resort 2017 monochrome way for brides in weddings
మోనోక్రోమ్ కలర్స్ దుస్తులతో పెళ్లిలో మెరిసిపోండి!


అమిత్ జీటీ :

వెడ్డింగ్ రిసెప్షన్‌లో రాయల్ లుక్ కోసం అమిత్ జీటీ కలెక్షన్స్ అదుర్స్. 3D ఫ్లవర్స్, ఫెదర్స్ వంటి వాటితో అలంకరించిన ఈ ఫ్యాన్సీ డిజైనర్‌వేర్ మిమ్మల్ని ఆకట్టుకోవడం ఖాయం.

నిష్కా లుల్లా :

నిష్కా లుల్లా డిజైన్ చేసిన ఈ సరికొత్త కలెక్షన్స్ కూడా లాక్మె ఫ్యాషన్ వీక్‌లో బాగా ఆకట్టుకున్నాయి.

హౌజ్ ఆఫ్ కొత్వారా :


అందమైన దుస్తుల్లో స్టన్నింగ్ బ్యూటీలా కనిపించాలనుకుంటున్నారా ? అయితే, ఇంకెక్కడికో ఎందుకు వెళ్లడం..! ఇదిగో కొత్వారా అందిస్తున్న ఈ సరికొత్త కలెక్షన్స్‌పై ఓ లుక్కేయండి!

పినాకిన్ :

సంగీత్ సెరెమనీ లాంటి పెళ్లి వేడుకల్లో మిమ్మల్ని మీరు ఓ యువరాణిలా చూసుకోవాలంటే ఈ పినాకిన్ డిజైన్స్‌ని ఓసారి ట్రయల్ వేయాల్సిందే!

తరుణ్ తహిల్యానీ :



ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ తరుణ్ తహిల్యాని రూపొందించిన ఈ కలెక్షన్ కూడా లాక్మె ఫ్యాషన్ వీక్‌లో ఆహుతులని అమితంగా ఆకట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.