యాప్నగరం

జుట్టు రాలుతోందా... ఇలా చేయండి!

జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది.

TNN 10 Apr 2017, 2:37 pm
జుట్టు రాలే సమస్య చాలా ఎక్కువ మందిలో కనిపిస్తోంది. దానికి కారణాలు తెలుసుకుంటే... ఆ సమస్యను అదుపులోకి తేవచ్చు. వైద్యుల దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేకుండానే ఇంట్లోనే చిన్న చిట్కాలతో జుట్టు రాలడాన్ని అరికట్టొచ్చు
Samayam Telugu lifestyle changes to reduce hair fall
జుట్టు రాలుతోందా... ఇలా చేయండి!


షాంపూ...


అందరికీ ఒకేలాంటి మాడు (స్కాల్ప్) ఉండదు. కొందరికి పొడి చర్మం ఉంటే, మరికొందరికి జిడ్డు చర్మం ఉంటుంది. మాడుపై ఉన్న చర్మలక్షణాన్ని బట్టి షాంపూని ఎంపికచేసుకోవాలి. పొడి చర్మం ఉన్న వారు వారానికోసారి తలకు స్నానం చేస్తే సరిపోతుంది. ఇక జిడ్డు చర్మం ఉన్నవారు వారానికి మూడు సార్లు చేస్తే మంచిది. రసాయనాలు లేని షాంపూనే ఎంచుకోవడం మంచిది.

కండిషనర్

షాంపూ చేసుకున్నాక... కండిషనర్ పెట్టడం కచ్చితంగా అలవాటు చేసుకోవాలి. కండిషనర్లో ఉండే అమినో యాసిడ్లు జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. డ్యామేజ్ అయిన జుట్టుని రిపేర్ చేస్తాయి.

ఆహారం...

షాంపూ, కండిషనర్ల కన్నా కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అంశం ఆహారం. మంచి ఆహారం తీసుకుంటే జుట్టు దానికదే రిపేర్ చేసుకునే శక్తిని పొందుతుంది. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, ఇనుము ఎక్కువగా ఉండే పదార్థాలని తింటే మంచిది. అలాగే

ఒత్తిడి....

ఆధునిక కాలంలో జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణం ఒత్తిడి కూడా. ఒత్తిడి వివిధ శారీరక రుగ్మతలకు, జుట్టు రాలడానికి కారణమవుతోంది. కనుక ముందుగా ఒత్తిడిని తగ్గించుకుని ప్రశాంతంగా ఉండాలి. వ్యాయామం, యోగం, ధ్యాననం రోజూ చేయడం అలవాటు చేసుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.