యాప్నగరం

Dark Circles: ఈ టిప్స్‌ ఫాలో అయితే.. 3 రోజుల్లో డార్క్‌ సర్కిల్స్‌ మాయం అవుతాయ్‌..!

Dark Circles: డార్క్‌ సర్కిల్స్‌.. చాలా మంది ఎదుర్కొనే సమస్య. వీటి కారణంగా ముఖం డల్‌గా, నిర్జీవంగా ఉంటుంది. కొన్ని సులభమైన చిట్కాలతో డార్క్‌ సర్కిల్స్‌ను సులభంగా తొలగించవచ్చు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 31 Mar 2023, 5:26 pm
Dark Circles: ప్రస్తుతం గాడ్జెట్‌ జనరేషన్‌లో ఎక్కువమంది ఎదుర్కొనే సమస్య.. డార్క్‌ సర్కిల్స్‌. కళ్ల కింద వలయాల కారణంగా.. ముఖం కాంతివిహీనంగా మారుతుంది, డల్‌గా కనిపిస్తారు. డార్క్‌ సర్కిల్స్‌ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. నిద్రలేమి, అలసట, కంప్యూటర్‌/మొబైల్ ఎక్కువసేపు వాడడం, ఒత్తిడి, పోషకాహారం, తగినన్ని నీళ్లు తాగకపోవడం, మానసిక ఆందోళన, రక్తహీనత, హార్మోన్ల సమస్య, అధిక బరువు, పీసీఓడీ కారణంగానూ వచ్చే అవకాశం ఉంది. కంటి కింద వలయాలు పోగొట్టకోవడానికి కొంతమంది మందులు వాడుతూ ఉంటారు, ట్రీట్మెంట్స్‌ తీసుకుంటూ ఉంటారు. అలా కాకుండా, మన ఇంట్లో దొరికే వస్తువులతో డార్క్‌ సర్కిల్స్‌ సమస్యను ఈజీగా పరిష్కరించవచ్చు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Samayam Telugu dark circles

కలబంద గుజ్జు..

మీరు డార్క్‌సర్కిల్స్‌ సమస్యతో బాధపడుతుంటే.. అలోవెరా జెల్‌ అద్భుతంగా సహాయపడుతుంది. కలబంద గుజ్జులో కాటన్‌ ముంచి కళ్ల కింద ఉంచండి. దీన్ని 10-15 నిమిషాల పాటు ఉంచి.. తడి టవల్‌ లేదా టిష్యూ పేపర్‌తో తుడవండి. ఇలా వరసగా మూడు రోజులు చేస్తే.. రిజల్ట్‌ మీకే కనిపిస్తుంది.
పెరుగు, పసుపు..

పసుపులో ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. పెరుగు చర్మ ఆరోగ్యానికి సహాయపడుతుంది. పెరుగులో పసుపు కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ పేస్ట్‌ని కళ్ల కింద నల్లగా ఉన్న ప్రదేశాలలో అప్లే చేసి ఆరనివ్వండి. 15 నుంచి 20 నిమిషాల తర్వాత.. గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. మూడు రోజుల పాటు... రోజుకు రెండు సార్లు చేస్తే, మంచి రిజల్ట్స్‌ ఉంటాయి. ఇది చర్మానికి కావలసిన పోషణ అందిస్తుంది.
గ్రీన్‌ టీ..


ముందుగా ఒక గిన్నెలో గోరువెచ్చని నీటిని తీసుకోవాలి. దానిలో పదినిమిషాల పాటు గ్రీన్‌టీ బ్యాగ్‌ ఉంచండి. ఆ తర్వాత దాన్ని బయటకు తీసి 20 నిమిషాల పాటు ఫ్రీజర్‌లో ఉంచాలి. ఈ టీ బ్యాగ్‌ చల్లబడిన తర్వాత.. వాటిని కళ్లపై ఉంచండి. చల్లదనం పోయే వరకు మీ కళ్లపై ఉంచండి. ఇది కంటి వేడిని తగ్గిస్తుంది, స్ట్రెస్‌ నుంచి రిలీఫ్‌ ఇస్తుంది. తద్వారా డార్క్‌ సర్కిల్స్‌ సమస్య పరిష్కారం అవుతుంది.
కీరదోస..

కీరదోసకాయ ముక్కలు కళ్లకు మేలు చేస్తాయి. తాజాగా ఉండే కీరాను చక్రాలులా కట్‌ చేయండి. వీటిని కళ్ల మీద ఉంచుకోండి. దీన్ని పదినిమిషాల పాటు కళ్లపై ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.. డార్క్‌ సర్కిల్స్‌ సమస్య మూడు రోజుల్లో పరిష్కారం అవుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.