యాప్నగరం

Eyelashes: ఒత్తైన, అందమైన కనురెప్పలు కావాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!

Eyelashes:  చాలా మంది అమ్మాయిలు.. కనురెప్పలు అందంగా, ఒత్తుగా కనిపించడానికి ఆర్టిఫిషియల్‌ కనురెప్పలు వాడుతూ ఉంటారు. అయితే, కొన్ని న్యాచురల్‌ టిప్స్‌తోనే..  అందమైన కనుబొమ్మలు సొంతం చేసుకోవచ్చు. 

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 6 Mar 2023, 3:52 pm
Eyelashes: అందమైన కళ్లు.. ముఖానికి ప్రత్యేకమైన కళ తీసుకొస్తాయి. ఆ కళ్లకే అందాన్ని తీసుకొచ్చేవి.. కనురెప్పలు. కనురెప్పలు అందంగా, ఒత్తుగా కనిపించడానికి చాలా మంది అమ్మాయిలు, ఐలాషెస్‌ వాడుతూ ఉంటారు. ఆర్టిఫిషియల్‌ ఐలాషెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వాడకుండానే.. న్యాచురల్‌ టిప్స్‌తో మీ కంటిరెప్పలను అందంగా, ఒత్తుగా మార్చుకోవచ్చు. ఆ సింపుల్‌ టిప్స్‌ ఏమిటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Samayam Telugu simple and natural tips to grow thick and beautiful eye lashes
Eyelashes: ఒత్తైన, అందమైన కనురెప్పలు కావాలంటే.. ఈ టిప్స్‌ ఫాలో అవ్వండి..!


గ్రీన్‌ టీతో అందమైన కనురెప్పలు పొందండి..

మీ కనురెప్పలు ఒత్తుగా, అందంగా మార్చడానికి గ్రీన్‌ టీ సహాయపడుతుంది. గ్రీన్‌ టీలోని ఫ్లేవనాయిడ్స్ కనురెప్పలు ఒత్తుగా పెరిగేలా సహాయపడతాయి. వేడి నీటిలో గ్రీన్‌టీ బ్యాగ్‌ ముంచి.. అవి చల్లారిన తర్వాత, టీ బ్యాగ్‌ను నీటిలో నుంచి బయటకు తీయండి. ఈ నీటిలో దూది ముంచి.. దాన్ని బాగా పిండాలి. ఈ దూదితో.. కనురెప్పలపై రాయాలి. 10 నిమిషాల తర్వాత.. చల్లటి నీళ్లతో శుభ్రం చేసుకోండి. ఇలా రోజుకు రెండు సార్లు చేస్తే.. కొన్ని నెలల తర్వాత మంచి రిజల్ట్స్‌ కనిపిస్తాయి. ఈ టిప్‌ ఫాలో అయ్యేప్పుడు.. గ్రీన్‌ టీ కంటిలోకి వెళ్లకుండా జాగ్రత్త పడండి.

కొబ్బరి పాలతో..

కొబ్బరిపాలలోని ఫ్యాట్స్‌‌, ప్రొటీన్లు, లారిక్ ఆమ్లం, విటమిన్ ఇ, ఐరన్ ఐలాషెస్‌ ఒత్తుగా పెరిగేలా సహాయపడతాయి. మీకు అందమైన, ఒత్తైన కనురెప్పలు కావాలంటే.. కొబ్బరి పాలలో దూదిని ముంచి.. రెప్పలపై రాయండి. పది నిమిషాల పాటు ఆరనివ్వండి. ఇలా రోజూ చేస్తే మంచి రిజల్ట్స్‌ వస్తాయి.

అముదంతో..

మీకు ఒత్తైన కనురెప్పలు కావాలంటే.. ఆముదం అద్భుతంగా పని చేస్తుంది. మీరు నిద్రపోయే ముందు అముదంలో దూదిని ముంచి నిద్రపోయే ముందు కనురెప్పలకు రాసుకోవాలి. ఆ తర్వత రోజు ఉదయం.. గోరువెచ్చని నీటితో కళ్లు శుభ్రం చేసుకోండి. ఇలా రోజూ చేస్తే.. మీ కనురెప్పులు ఒత్తుగా పెరుగుతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. అందం, ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.