యాప్నగరం

రంగు వేసుకునేటప్పుడు జాగ్రత్తలు ఇవి

చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు.

TNN 28 Nov 2016, 3:00 pm
చాలామంది ఇంట్లోనే తలకు రంగు (హెయిర్‌డై) వేసుకుంటూ ఉంటారు. కానీ సరైన జాగ్రత్తలు పాటించకపోతే చర్మసమస్యలు ఎదురవ్వవచ్చు. అందుకని... జుట్టుకు రంగు వేసుకునేటప్పుడు చర్మానికి తగలకూడదు.ముందుగా ముఖానికి, చెవులకు మాయిశ్చరైజర్, లేదంటే నూనె రాసుకొని తర్వాత డై వేసుకోవాలి. తలంటుకునేటప్పుడు కూడా డై చర్మానికి తగలకుండా జాగ్రత్తపడాలి. అలాగే డై ఎంపికలో నాణ్యత విషయంలో రాజీ పడకూడదు. ఇక జుట్టు మంచి స్మెల్‌ రావాలంటే హెయిర్‌ సీరమ్, లేదంటే హెయిర్‌ స్ప్రేలు వాడాలి. అయితే ఈ సీరమ్స్, స్ప్రేలు మాడుకు, జుట్టు కుదుళ్లకు తగలకుండా జాగ్రత్తపడాలి. లేదంటే వీటిలో ఉండే గాఢ రసాయనాలు వెంట్రుక కుదురును దెబ్బతీసే అవకాశాలు ఉంటాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.