యాప్నగరం

సమ్మర్ కూల్ ప్రసాదాలు

శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ప్రసాదాలు కూడా శరీరంలో వేడిని తగ్గించి చలువచేసేవే ఉంటాయి.

TNN 14 Apr 2016, 3:45 pm
శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది కాబట్టి ప్రసాదాలు కూడా శరీరంలో వేడిని తగ్గించి చలువచేసేవే ఉంటాయి. శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. దీని వెనుక ఆరోగ్య, వైద్య సూత్రాలు ఎన్నో ఉన్నాయి.
Samayam Telugu srirama navami prasadalu
సమ్మర్ కూల్ ప్రసాదాలు

ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. శరద్ ఋతువు, వసంత ఋతువు యముడి కోరలు లాంటివే అని దేవీ భాగవతం చెబుతోంది. పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత ఋతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయి అని ఆయుర్వేదం చెబుతోంది.

అలాగే పెసరపప్ప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తి అభివృద్ధి పరుస్తుంది, దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక .పెసరపప్పునే వడపప్పు అంటారు. ఇది మండుతున్న ఎండలలో 'వడదెబ్బ' కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.