యాప్నగరం

చిన్న వయస్సులోనే జుట్టు తెల్లబడుతోందా? ఈ టిప్స్‌‌ పాటించండి

చిన్న వయస్సులోనే తెల్లజుట్టు సమస్య వేదిస్తోందా? అయితే, మీరు తప్పకుండా ఈ చిట్కాలు పాటించి చూడండి.

Samayam Telugu 16 Jun 2021, 10:21 pm
రోజుల్లో తెల్ల వెంటుకలు వచ్చేస్తున్నాయి. సాధారణంగా వయస్సు పెరిగిన తర్వాత కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా వెంటుకలు తెల్లగా మారతాయి. కానీ, ఈ సమస్య ముందుగానే పలకరిస్తే.. చిన్న వయస్సులోనే తెల్ల వెంటుకలు వస్తాయి. అయితే, ఈ సమస్యను మీరు ముందుగా గుర్తించినప్పుడే పరిష్కరించడం సాధ్యమవుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు పూజా మఖిజా తెల్ల వెంటుకల నివారణకు కొన్ని చిట్కాలు చెప్పారు. అవేంటో చూసేయండి మరి.
Samayam Telugu Representational Image


జుట్టు కుదుళ్లు సహజ వర్ణద్రవ్యమైన మెలానిన్ ఉత్పత్తిని నిలిపివేసినప్పుడు తెల్ల జుట్టు సమస్య మొదలవుతుంది. వయస్సు పెరిగే కొద్ది మెలానిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. అయితే, కొందరిలో ముందుగానే మెలనిన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. ఫలితంగా వారి జుట్టు బూడిద రంగులోకి మారుతుంది. చిన్న వయస్సులోనే జుట్టు తెల్లగా మారడానికి రెండు ప్రధాన కారణాలు ఉన్నాయి. ఒకటి ఒత్తిడి, రెండోది పోషకాహార లోపం. ఇవి రెండిటిని అధిగమిస్తే మీరు తప్పకుండా తెల్ల జుట్టు సమస్య నుంచి బయటపడొచ్చు.

గోళ్ల తరహాలోనే జుట్టు కూడా శరీరంలో అనవసరమైన అవయవం. కాబట్టి.. అన్ని అవయవాలు కంటే చిట్టచివరి పోషకాలు అందేది జుట్టుకే. అందుకే, ఆహారం విషయంలో నిర్లక్ష్యం చేయకుండా తగిన పోషకాలను తీసుకోవాలి. అప్పుడే కుదుళ్లలో మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. కొన్ని సప్లిమెంట్లను తీసుకోవడం ద్వారా కూడా ఈ సమస్య నుంచి బయటపడొచ్చు. పాంటోథెనిక్ ఆమ్లం అని కూడా పిలువబడే విటమిన్ B 5 జుట్టు తెల్లబడే ప్రక్రియను ఆలస్యం చేసే అవకాశం ఉంది. వైద్యుల సూచన తీసుకుని.. రోజూ 100-200 మిల్లీగ్రాముల కాల్షియం పాంతోథెనిక్ ఆమ్లం తీసుకోవడం ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. అయితే, ఈ సప్లిమెంట్లను ఇష్టానుసారం తీసుకోరాదని, వైద్యులు సూచించే బ్రాండ్లు, మోతాదుల ప్రకారమే తీసుకోవాలని పూజా స్పష్టం చేశారు.
ఈ లక్షణాలు కనిపిస్తే.. మీలో రోగనిరోధక శక్తి తగ్గినట్లే!
విటమిన్ B 12, జింక్, కాపర్, విటమిన్ C అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కూడా తెల్లజుట్టు సమస్య నుంచి బయటపడొచ్చని పేర్కొన్నారు. స్మోకింగ్ అతిగా చేసినా మెలనిన్‌కు నష్టం కలుగుతుందని, దూమపానం జుట్టను త్వరగా తెల్లగా మార్చేందుకు సహకరిస్తుందని తెలిపారు. కాబట్టి స్మోకింగ్‌కు కూడా దూరంగా ఉండండాలన్నారు. అయితే, పైన పేర్కొన్న ఏ ఔషదాన్ని తీసుకోవాలన్నా.. ముందుగా వైద్య నిపుణులను సంప్రదించాలని, సొంత వైద్యం పనికిరాదని ఆమె తెలిపారు.
ఈ ఆయుర్వేద మందులతో రోగనిరోధక శక్తి.. ఆయుష్ సీఎంవో కామేశ్వరరావు
ముఖ్య గమనిక: ఈ సమాచారాన్ని కేవలం మీ అవగాహన కోసమే అందించాం. ఇది అర్హత కలిగిన వైద్యుల అభిప్రాయానికి ప్రత్యామ్నాయం కాదు. మరింత సమాచారం కోసం వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ సమాచారానికి ‘సమయం తెలుగు’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఎలాంటి బాధ్యత వహించదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.