యాప్నగరం

త్వరలో వయసును వెనక్కు మళ్లించే మందు!

ఒక్కో ఏడాది గడుస్తున్న కొద్దీ వయసు పైబడుతుందనే చింత ఇక అవసరం లేదు. ఇది మీ దిగులను తొలిగించే శుభవార్త. వయసును వెనక్కి మళ్లించే మందును మరో మూడేళ్లలో అందుబాటులోకి రానుంది.

TNN 25 Mar 2017, 3:03 pm
ఒక్కో ఏడాది గడుస్తున్న కొద్దీ వయసు పైబడుతుందనే చింత ఇక అవసరం లేదు. ఇది మీ దిగులను తొలిగించే శుభవార్త. వయసును వెనక్కి మళ్లించే మందును మరో మూడేళ్లలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు న్యూ సౌతవేల్స్‌ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. ఇది కేన్సర్‌ చికిత్సకూ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. వయసు పెరిగే కొద్దీ శరీరంలో కణాల డీఎన్‌ఏ దెబ్బతిని వృద్ధాప్యానికి మళ్లడానికి కారణమవుతుందని పరిశోధకులు వివరించారు.
Samayam Telugu unsw scientists unveil a giant leap for anti aging
త్వరలో వయసును వెనక్కు మళ్లించే మందు!


ప్రయోగ దశలో ఉన్న ఈ ఔషధం కణాల్లోని డీఎన్ఏను మరమ్మత్తు చేస్తుందని, అంగారక గ్రహంపైకి నాసా పంపించే వ్యోమగాములకు సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ పరిశోధన వివరాలను సైన్స్ టుడే అనే జర్నల్‌లో ప్రచురించారు. దెబ్బతిన్న కణాల్లోని డీఎన్ఏ‌ను మరమ్మత్తు చేయడం పరమాణు ప్రక్రియలో కీలకమైన ముందడుగని పరిశోధకులు ప్రకటించారు.

నాసా చేపట్టిన మార్స్ మిషన్‌కు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలియజేశారు. కణాల్లోని దెబ్బతిన్న డీఎన్ఏ అంతర్గత సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని అన్నారు. శరీరంలోని ప్రతి కణంలో సహజంగా ఉండే పాజిటివ్ మెటబోలైట్ నికోటమైడ్ అడినైన్ డినూక్లియోటిడ్‌ను పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రొటీన్ల మధ్య సంధానకర్తగా వ్యవహరించి డీఎన్ఏ రిపెయిర్‌లో కీలకపాత్ర పోషిస్తున్నట్టు తెలుకున్నారు.

పరిశోధనలో భాగంగా ఈ పాజిటివ్ ఎన్ఏడీని ఎలుకలకు అందజేసినప్పుడు రేడియోధార్మికతకు గురికావడం లేదా దెబ్బతిన్న డీఎన్ఏ కణాలు మరమ్మత్తు జరిగినట్లు తేలింది. వారం రోజుల చికిత్స తర్వాత వయసు మళ్లిన ఎలుక వయసులో ఉన్న ఎలుకలా రూపాంతరం చెందిందని యూనివర్సిటీ ఆఫ్ న్యూ‌సౌత్ వేల్ స్కూల్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ప్రొఫెసర్ డేవిడ్ సింక్లియర్ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.