యాప్నగరం

Weight loss Drink : ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ని తాగితే ఒంట్లోని కొవ్వు తగ్గుతుందట..

Weight loss Drink : సమ్మర్‌లో కొన్ని టిప్స్ పాటిస్తే ఈజీగా బరువు తగ్గుతారు. అందులో కొన్ని వెయిట్ లాస్ డ్రింక్స్‌ ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 19 Jun 2023, 10:27 am
వెయిట్ లాస్ అవ్వాలని చాలా మంది ట్రై చేస్తుంటారు. అలాంటి వారు కొన్ని ఈజీగా పాటించే టిప్స్‌ని ఫాలో అవ్వాలని చూస్తుంటారు. వాటిలో వెయిట్ లాస్ డ్రింక్స్ కూడా ఉన్నాయి. అల్లం, దాల్చిన చెక్క, జీలకర్ర, నిమ్మ వంటి పదార్థాలతో తయారు చేసే ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల కొవ్వు కరిగిపోతుంది. ఈ డ్రింక్స్ తీసుకోవడం వల్ల త్వరగా వెయిట్ లాస్ అవుతారు. మరి అవేంటి.. వాటిని ఎలా తయారు చేయాలో తెలుసుకోండి.
Samayam Telugu best weight loss drink burns the most belly fat
Weight loss Drink : ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ని తాగితే ఒంట్లోని కొవ్వు తగ్గుతుందట..


​కావాల్సిన పదార్థాలు..

1 లీటర్ నీరు
2 నిమ్మకాయలు
1 అంగుళం అల్లం తురుము
అరస్పూన్ మిరియాలు
1 స్పూన్ తేనె
1 స్పూన్ నిమ్మరసం

​తయారీ విధానం..

ఓ పెద్ద సాస్‌పాన్‌లో 1 లీటర్ నీరు పోయండి. ఇప్పుడు నిమ్మ రసం పిండి రెడీ పెట్టుకోండి.
నీటిలో నిమ్మరసం వేసి మిరియాలు, 1 అంగుళం అల్లం వేయాలి. 5 నిమిషాల పాటు ఉడికించండి. నిమ్మకాయని కొద్దిసేపటి వరకూ ఉడికించండి.
కొద్దిగా చల్లారక నీటిని ఫిల్టర్ చేయండి
ఈ నీటిని పెద్ద గ్లాసులో పోయాలి.
1 టీ స్పూన్ తేనె, నిమ్మరసం వేసి పూర్తిగా కలపండి.
నిమ్మకాయ, అల్లం రెండు కూడా కొవ్వుని కరిగించే డ్రింక్‌ తయారైనట్లే. దీనిని ఉదయాన్నే తాగండి.
Also Read : Workout and Cancer : రెగ్యులర్‌గా వర్కౌట్స్ చేస్తే ఈ క్యాన్సర్స్ దూరమవుతాయట..

​కావాల్సిన పదార్థాలు..

1 లీటర్ నీరు
3 టీస్పూన్ జీలకర్ర
3 అంగుళాల దాల్చిన చెక్క
1 స్పూన్ తేనె
1 స్పూన్ నిమ్మకాయ
Also Read : Breast Exercises : ఆడవారి బ్రెస్ట్ పర్ఫెక్ట్ షేప్‌లో ఉండాలంటే ఈ ఎక్సర్‌సైజెస్ చేయాల్సిందే..

​తయారీ విధానం..

తర్వాత ఓ పెద్ద సాస్‌పాన్‌లో 1 లీటర్ నీరు పోయండి. 3 టీ స్పూన్ జీలకర్ర, 3 అంగుళాల దాల్చిన చెక్క వేయాలి.
కనీసం ఐదు నిమిషాలు ఉడకబెట్టండి.
రుచులు పూర్తిగా కలిసేవరకూ ఉడికించండి.
వేడెక్కిన డీటాక్స్ నీటిని తీసుకుని పెద్ద గ్లాసులో పోయాలి.
1 టీస్పూన్ తేనె, నిమ్మకాయలను కలపండి.
జీలకర్ర, దాల్చిన చెక్క కొవ్వుని కరిగించే డ్రింక్‌ని మార్నింగ్ తీసుకోండి.

​చియా లెమన్ డ్రింక్..

కావాల్సిన పదార్థాలు..

2 టీస్పూన్ చియా గింజలు
2 కప్పుల నీరు
1 టీస్పూన్ తేనె
1 టీస్పూన్ నిమ్మరసం

ఎలా తయారు చేయాలంటే..

ఓ పెద్ద సాస్‌పాన్‌లో 1 లీటర్ నీరు పోయండి
3 టీస్పూన్ల జీలకర్ర, 3 అంగుళాల దాల్చిన చెక్క వేయండి.
కనీసం ఐదు నిమిషాల పాటు ఉడికించండి.
రుచులు కలిసేవరకూ కాసేపు ఉడికించండి.
కొద్దిగా చల్లారిన తర్వాత నీటిని ఫిల్టర్ చేయండి.
వేడెక్కిన డిటాక్స్ నీటిని తీసుకుని పెద్ద గ్లాసులో పోయాలి.
1 టీస్పూన్ తేనె, నిమ్మకాయలను జోడించండి.
పూర్తిగా కలపండి.
మీ జీలకర్ర, దాల్చిన చెక్క కొవ్వుని కరిగిస్తుంది. దీనిని ఉదయాన్నే తాగండి.

బాడీలోని కొవ్వుని కరిగించే డ్రింక్..

​కొవ్వుని కరిగించే చియా నిమ్మకాయ డ్రింక్‌ని ఎలా తయారు చేయాలి..

2 టేబుల్ స్పూన్ల చియా సీడ్స్‌ని 1 కప్పు నీటిలో 10నిమిషాలు నాననివ్వండి.
పొడవైన గాజులో నానబెట్టిన చియా సీడ్స్‌ని ఉంచండి.
2 కప్పుల నీరు, 1 టీ స్పూన్ తేనె, నిమ్మరసం పూర్తిగా కలపండి.
చివరగా, చియా నిమ్మకాయ కొవ్వుని కరిగించే డ్రింక్‌ని ఉదయాన్నే తీసుకోండి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​​​​Read More :Fitness Newsand Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.