యాప్నగరం

తొడల్లో కొవ్వు తగ్గించే పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజెస్ ఇవే..

కొంతమందికి తొడల్లో కొవ్వు పెరిగిపోతుంది. అలాంటి వారు ఏయే ఎక్సర్‌సైజెస్ చేస్తే మంచిదో తెలుసుకోండి.

Samayam Telugu 18 Jan 2021, 12:10 pm
పొట్ట వద్ద కొవ్వు కరిగించడం అన్నింటి కంటే కష్టం అని అనుకుంటాం. తొడల వద్ద కొవ్వు కూడా అలాంటిదే. అక్కడ కూడా కొవ్వు తేలికగా పేరుకుంటుంది, కరగడానికి మాత్రం చాలా సమయం తీసుకుంటుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటూ, రెగ్యులర్ గా ఎక్సర్సైజులు చేస్తూ ఉంటే చక్కని చెక్కిన శిల్పం లాంటి శరీరం మీ స్వంతమవుతుంది. లెగ్స్ టోన్‌డ్ గా ఉండడం కోసం ఇక్కడ ఐదు ఎక్సర్‌సైజెస్లు ఉన్నాయి చూడండి.
Samayam Telugu ways and exercises to lose thigh fat fast know here all details
తొడల్లో కొవ్వు తగ్గించే పవర్‌ఫుల్ ఎక్సర్‌సైజెస్ ఇవే..



​ఫ్రాగ్ జంప్స్..

1. పాదాలు భుజాల వెడల్పులో ఉంచి నిటారుగా నిలబడండి.

2. గొంతుకు కూర్చుని మీ ముందు నేల మీద చేతులు ఉంచండి.

3. ఇప్పుడు కప్ప లాగా ఎగిరి ముందుకు దూకండి.

4. మీరు దూకినప్పుడు మోకాళ్ళు వంచి హిప్స్ మీద కూర్చోండి.

5. తొడల వద్ద బర్నింగ్ ఫీలింగ్ కలిగేంత వరకూ చేయండి.

Also Read : బరువు ఎక్కువగా ఉంటే పిల్లలు పుట్టరా..

​కర్ట్సీ లంజ్..

1. మీ పాదాలు హిప్స్ దూరంలో ఉండేలా నిటారుగా నిలబడండి.

2. నెమ్మదిగా మీ ఎడమ కాలుని కుడికాలు వెనక్కి పెట్టండి. మీ కాళ్ళు ఇంటూ షేప్ లో ఉంటాయి.

3. మీ అరచేతులు కలుపుతూ మీ రెండు మోకాళ్ళనీ వంచండి.

4. ఇలాగే కుడికాలితో కూడా చేయండి.

Also Read : చిలగడ దుంపలు తింటే ఈ భయంకరమైన సమస్య దూరమవుతుందట..

​సైడ్ లైయింగ్ డబుల్ లెగ్ లిఫ్ట్స్..

1. ఒక పక్కకి తిరిగి స్ట్రైట్ గా పడుకోండి.

2. మీ బొటనవేళ్ళు రెండిటినీ కలిపి అవి బయట వైపు పాయింట్ చేసేలా ఉంచండి.

3. నెమ్మదిగా రెండు కాళ్ళూ పైకి లేపండి. బొటన వేళ్ళు మాత్రం కలిపే ఉంచాలి.

4. ఇలా రెండు సెకన్లు ఉంచి స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేయండి.

​గ్లూట్ కిక్‌బ్యాక్స్..

1. మీ మోకాళ్ళు, అర చేతుల మీద బరువు మోపి నించోండి.

2. మీ చేతులు మీ భుజాల కిందుగా ఉండాలి.

3. ఒక కాలు పైకి లేపి మడమ తో బలంగా కిక్ చేయండి.

4. ఇలా కొన్ని సెకన్ల పాటూ ఉండండి.

5. స్టార్టింగ్ పొజిషన్ కి వచ్చేసి రెండవ కాలితో చేయండి.

Also Read : చలికాలంలో ఈ సూప్‌ తాగితే చాలట.. అన్ని సమస్యలు దూరం..

​ఇన్నర్ థై సర్కిల్స్..

1. ఒక పక్కకి తిరిగి కూర్చోండి. మీ చేతితో మీ తల కి సపోర్ట్ ఉండాలి.

2. పై కాలిని రెండవ కాలి ముందు పెట్టండి.

3. నెమ్మదిగా కింద కాలిని పైకి లేపండి.

4. పైకి లేపిన కాలితో పది నుండి ఇరవై సార్లు గుండ్రంగా తిప్పండి.

5. రెండవ వైపు కూడా ఇలాగే చేయండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.