యాప్నగరం

Glaucoma : గ్లాకోమా ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మొదటికే మోసం..

Glaucoma : గ్లాకోమా..కంటి లోపల ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు వస్తుంది. దీని వల్ల చూపు సరిగ్గా కనిపించదు. ఈ సమస్య ఉన్నప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కొన్ని యోగాసనాలు చేయొద్దొని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.

Produced byరావుల అమల | Samayam Telugu 17 Feb 2023, 10:50 am
యోగా.. చాలా మంది ఎక్కువగా ఇంట్లోనే యోగా చేస్తుంటారు. బరువు తగ్గటం నుంచి ఒత్తిడి దూరం చేసేవరకూ చాలా బెనిఫిట్స్ ఉంటాయి యోగాతో. అయితే, వీటిని చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా మన హెల్త్ కండీషన్‌ని బట్టి యోగాసనాలు చేయాలి. అందులో గ్లాకోమా ఉన్నవారు కొన్ని యోగాసనాలకు దూరంగా ఉండడమే మంచిదని చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం.
Samayam Telugu what should glaucoma patients avoid in yoga
Glaucoma : గ్లాకోమా ఉన్నవారు ఈ ఆసనాలు వేస్తే మొదటికే మోసం..


గ్లాకోమా ఉన్నవారు యోగా చేయొచ్చా..

గ్లాకోమా సమస్య నుండి బయటపడేందుకు. యోగా బెస్ట్ ఆప్షన్. అయితే, కంటిలోపల ఒతతిడిని పెంచే కొన్ని పొజిషన్స్ చేయకపోవడమే మంచిది. దీని వల్ల కళ్ళ సమస్యలు పెరుగుతాయి. ఏదైనా కొత్త ఆసనాలు చేయాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ముందుగా డాక్టర్,యోగా శిక్షకుడిని సంప్రదించడం ముఖ్యమని గుర్తుపెట్టుకోండి.
Also Read : Mouth Cancer : నోటి క్యాన్సర్ ఉంటే ఈ 3 లక్షణాలు ఉంటాయట..

కొన్ని ఆసనాలతో కళ్ళపై ఒత్తిడి..

ప్రపంచంలో చాలా మంది బాధపడే సమస్య గ్లాకోమా. ఇది కంటి లోపల ఒత్తిడి పెరిగి కంటి చూపుని దెబ్బతీస్తుంది. గ్లాకోమాకి సరైన ట్రీట్‌మెంట్ లేదు. అయితే, వీరు యోగాలో కొన్ని ఆసనాలు చేయడం వల్ల లాభం ఉంటుంది. ఇలా చేయడంలో ఒత్తిడి రక్తప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అదే విధంగా ఇంట్రాకోక్యులర్ ఒత్తిడి తగ్గుతుంది. అయితే, కొన్ని యోగాసనాలు చేయడం వల్ల ఎంత లాభం ఉంటుందో... కొన్ని ఆసనాలు కంటిలోపల ఒత్తిడి అంతే పెంచుతాయి. అవేంటో మీరూ చూడండి.

సర్వాంగాసన..

ఈ ఆసనంలో భుజాలు, తల నేలపై ఉంటుంది. కాళ్ళు, తుంటి ఆకాశం వైపుకి ఎత్తుతారు. ఈ పొజిషన్ థైరాయిడ్ ఉన్నవారికి చాలా మంచిది. కానీ, ఇది కంటి లోపల ఒత్తిడిని పెంచుతుంది. కాబట్టి గ్లాకోమా ఉన్నవారు దీనిని చేయకపోవడమే మంచిది.

Also Read : Shampoo Disadvantages : ఈ షాంపూలతో షుగర్ వస్తుందట జాగ్రత్త..

మత్స్యాసన..

ఈ పొజిషన్‌లో తల వెనుకకి వంచి, తల పై నుంచి కాళ్ళు పైకి వచ్చి ముందువైపులో ఉంటాయి. ఈ పొజిషన్ ఇంట్రాకోక్యులర్ ఒత్తిడిని పెంచుతుంది. అందుకే గ్లాకోమా ఉన్నవారు దీనిని చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు నిపుణులు.

హాలాసన..

ఈ పొజిషన్‌లో వెల్లకిలా పడుకుని కాళ్ళు, తుంటిని తలపైకి ఎత్తతుంటారు. ఈ పొజిషన్ చాలా సమస్యల్ని దూరం చేస్తుంది. కానీ, అదే విధంగా కంటిపై ఒత్తిడి పెరిగేలా చేస్తుంది. గ్లాకోమా సమస్య ఉన్నవారు దీనికి దూరంగా ఉండడమే మంచిది.

శీర్షాసన..

ఈ పొజిషన్‌లో పాదాలను పైకి ఉంచి తలపై నిలబడాలి. దీనిని కింగ్ ఆఫ్ యోగా అని కూడా అంటారు. దీనిని చేయడం వల్ల కంటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఇలాంటివి చేయడం వల్ల కంటి సమస్యలు పెరుగుతాయి.
Also Read : Mahashivaratri 2023 : శివరాత్రి ఉపవాసం రోజున వీటిని తినొచ్చు..

వీటితో పాటు..

గ్లాకోమా ఉన్నవారు.. యోగా చేయాలనుకుంటే ముందుగా వారికి ఏయే ఆసనాలు మంచివో వైద్యుడిని, యోగా శిక్షకుడిని కలిసి మాట్లాడాకే చేయడం మంచిది. లేకపోతే సమస్య మరింత పెద్దగా మారుతుందని గుర్తుపెట్టుకోండి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.