యాప్నగరం

Rajma for Weight Loss : రాజ్మాని ఇలా వండి తింటే ఈజీగా బరువు తగ్గుతారట..

Rajma for Weight Loss : రాజ్మా చావల్.. దీనిని మనం ఎక్కువగా ప్రిపేర్ చేయం. కానీ, ఇందులోని పోషకాలు.. దీనని చేసుకుని తినడం వల్ల కలిగే లాభాలు చూస్తే తినకుండా ఉండలేం. అవేంటంటే..

Produced byరావుల అమల | Samayam Telugu 7 Jul 2023, 11:04 am
రాజ్మా.. ఓ బీన్స్ రకం. ఎర్రగా కిడ్నీ ఆకారంలా ఉండే ఈ బీన్స్‌ని రైస్ కాంబోతో తింటారు. దీనిని చాజ్మా చావల్ అనేది ఎన్నో శతాబ్దాలుగా ఉంది. నిజానికీ ఈ టేస్టీ వంటకం ప్రపంచవ్యాప్తంగా ప్రజాదరణ పొందింది. అయితే, దీని చుట్టూ కొన్ని అపోహలు ఉన్నాయి. అవి ఏంటంటే..ఈ ఫుడ్‌ని తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని.. అందులో నిజం ఎంతో తెలుసుకుందాం.
Samayam Telugu why rajma chawal is one of the best weight loss foods
Rajma for Weight Loss : రాజ్మాని ఇలా వండి తింటే ఈజీగా బరువు తగ్గుతారట..


రాజ్మాలోని పోషకాలు..

రాజ్మాలో చాలా పోషకాలు ఉ్నాయి. ముఖ్యంగా మాలిబ్డినం, ఐరన్, కాపర్ ఫోలేట్‌తో పాటు ఎక్కువగా ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్పరస్, విటమిన్ బి1లు ఉన్నాయి. ఇవి మన బాడీకి ఎక్కువగా ప్రోటీన్ అందిస్తాయి. ఎంత అంటే ఓ స్పోర్ట్స్ మెన్‌కి అవసరమైనంత పోషకాలన్నీ కూడా ఈ రాజ్మా తినడం వల్ల అందుతాయి. డైటీషియన్స్ ప్రకారం.. రాజ్మా చావల్‌ని ఎప్పట్నుంచో తింటున్నారు. ఆధునిక కాలంలో మాంసకృత్తులు ఎక్కువగా ఉండే భోజనం తీసుకోవడం జరుగుతుంది. రాజ్మా సరైస్ గురించి చూస్తే వాటిలో ప్రతి ఒక్కటి కూడా వేర్వేరు అమోనో ఆమ్లాలు కలిగి ఉంటాయి. విటమిన్ల కొరతతో బాధపడే వారు వీటిని తినొచ్చు. దీనిని తినడం వల్ల బరువు ఈజీగా తగ్గుతారు.

​ఫైబర్..

రాజ్మా చావల్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మీరు దీనిని తీసుకున్న ఎక్కువ సమయం వరకూ కడుపు నిండిన ఫీలింగ్‌ ఉంటుంది. దీంతో రోజంతా కేలరీలు తీసుకోవాలనే కోరిక తగ్గుతుంది. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంటుంది.
Also Read : Weight Loss : బరువు తగ్గాలంటే ఏం తినాలి.. ఏం తినకూడదు..

తక్కువగా గ్లైసెమిక్ ఇండెక్స్..

గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఆహారంలో చక్కెర స్థాయిలను ఎంత త్వరగా త్వరగా పెంచుతుందో చెబుతుంది. ఎక్కువ GI ఉన్న ఆహారాలు రక్తంలో చక్కెర పెరుగుదలకి కారణమవుతాయి. ఇది ఫుడ్ క్రేవింగ్స్‌ని కలిగిస్తుంది. అంటే ఇది రక్తంలో చక్కెర స్థాయిలను త్వరగా పెంచుతుంది. ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్‌ని కలిగేలా చేస్తుంది.

​బరువు తగ్గడం..​

కిడ్నీ బీన్స్‌లో ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది. బరువు తగ్గడానికి ఇది ముఖ్య పోషకం. కండర కణజాలాన్ని పెంచి, రిపేర్ చేయడానికి ప్రోటీన్ హెల్ప్ చేస్తుంది. దీనిని తినడం వల్ల ఎక్కువ సమయం కడుపు నిండిన ఫీలింగ్ ఉంటుంది. దీని వల్ల బరువు తగ్గడం వీలవుతుంది.

​వెజిటేరియన్స్‌కి బెస్ట్..

వెజిటేరియన్స్ సరైన పోషకాలు అందాలంటే ఈ రాజ్మా చావల్ తినాల్సిందే. ఈ రాజ్మా చావల్‌లో కరిగే, కరగని ఫైబర్ రెండూ ఉంటాయి. ఇవి గ్యాస్, ఉబ్బరం, రక్తంలో చక్కెర స్థాయిలను కొనసాగిస్తూ మలబద్దకాన్ని దూరం చేస్తుంది.
Also Read : Weight loss Workout : ఇంట్లోనే ఈ వర్కౌట్స్ చేస్తే ఈజీగా బరువు తగ్గుతారు..

​చాలాసేపు కడుపునిండుగా..​

రాజ్మా చావల్‌లోని ఐరన్, మెగ్నీషియం, ఫొలేట్ వంటి పోషకాలు ఆరోగ్యాన్ని కాపాడతాయి. దీనిని తీసుకోవడం వల్ల చాలా వరకూ ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి. పోషకాలు ఎక్కువగా ఉన్న ఫుడ్‌ని తీసుకున్నప్పుడు కడుపు నిండుగా ఉండడంతో ఎక్కువగా తినలేరు.

​ఇవి మరువొద్దు..

రాజ్మా చావల్ బరువు తగ్గించే ఫుడ్ అని చెప్పొచ్చు. అయితే, ఇది మీరు ఎంత తింటున్నారనే దానపై ఆధారపడి ఉంటుంది. తక్కువ పరిమాణంలో తినాలి. ఏదైనా ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి, రాజ్మా చావల్‌‌ని తక్కువగా తినడం మంచిది. వైట్‌రైస్‌కి బదులు బ్రౌన్‌రైస్‌తో చేయడం, తక్కువ నూనెతో వండుకోవడం వల్ల రాజ్మా చావల్‌ బరువు తగ్గేందుకు హెల్ప్ అవుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

Read More : Relationship News and Telugu New

బబ్బెర్ల మసాలా

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.