యాప్నగరం

Sabja seeds : సబ్జా నీరు తాగితే బరువు తగ్గుతారా..

Sabja seeds : ఎండాకాలంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఈజీగా బరువు తగ్గుతారు. అందులో కొన్ని టిప్స్ గురించి తెలుసుకుందాం. చిన్న చిట్కాతో చాలా వరకూ బరువు తగ్గించుకోవచ్చని చెబుతున్నారు. మరి అదేంటో తెలుసుకోండి.

Produced byరావుల అమల | Samayam Telugu 20 May 2023, 7:00 am
బరువు ఎక్కువగా ఉండడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలొస్తాయి. అందుకే చాలా మంది ఫిట్‌గా మారాలనుకుంటారు. దీని కారణంగా హ్యాపీగా ఉండడమే కాకుండా అందంగా కనిపిస్తారు కూడా. కేవలం చూడ్డానికి మాత్రమే కాకుండా ఆరోగ్య సమస్యలు రాకుండా కూడా ఉంటాయి. అందుకే బరువుని తగ్గించుకోవడం చాలా ముఖ్యం. అందుకోసం బరువు తగ్గేందుకు ఉండే చిట్కాల్లో సబ్జా కూడా బాగా పనిచేస్తుందని చెబుతున్నారు. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకోండి.
Samayam Telugu will sabja seeds reduce weight
Sabja seeds : సబ్జా నీరు తాగితే బరువు తగ్గుతారా..


సబ్జా నీరు..

ఎండాకాలంలో సబ్జా నీటిని చాలా మంది తీసుకుంటారు. దీని వల్ల దాహం తీరడమే కాదు. ఇది వెయిట్ లాస్ డ్రింక్ అని కూడా చెప్పొచ్చు. ఈ నీటిని తాగితే బెల్లీ తగ్గుతుంది. బరువు తగ్గాలనుకుంటే ఉదయాన్ని సబ్జానీటిని పరగడపున తాగాలి.

వెయిట్ లాస్ డ్రింక్..

కావాల్సిన పదార్థాలు..

ఓ గ్లాసు మంచినీరు
టేబుల్ స్పూన్ సబ్జా
నీటిలో సబ్జా గింజల్ని వేసి 15 నిమిషాల పాటు నానబెట్టి తాగొచ్చు.
Also Read : High Cholesterol : ఈ 4 ఎక్సర్‌సైజెస్‌తో బాడీలోని కొలెస్ట్రాల్ మాయం..

బరువు తగ్గేందుకు..

సమ్మర్‌లో డీహైడ్రేట్ అవ్వకుండా ఉండాలంటే ఈ నీటిని తీసుకోవాలి. దీని వల్ల బరువు తగ్గుతారని జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ చెబుతోంది. దీని వల్ల జీవక్రియ పెరిగి హైడ్రేషన్ తగ్గుతుంది. ఆకలి కూడా తగ్గుతుందని పరిశోధనలో తేలింది.
Also Read : Weight Loss Journey : ఈ మూడు అలవాట్లని మార్చి 15 కిలోల బరువు తగ్గాడు..

ఫైబర్..

సబ్జా సీడ్స్‌లో ఎక్కువగా ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియి చాలా మంచిది. వీటిని తీసుకోవడం కేలరీలు బర్న్ అవుతాయి. దీంతో ఈజీగా బరువు తగ్గుతారని నిపుణులు చెబుతున్నారు.

షుగర్ పేషెంట్స్‌కి మేలు..

షుగర్ పేషెంట్స్‌ సాధారణంగా బరువు ఉంటారు. అలాంటి వారు సబ్జాని తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయి. దీంతో బరువు కూడా పెరగరు.

ఆకలి దూరం..

పీచు పదార్థం ఎక్కువగా ఉన్న సబ్జాని తీసుకోవడం వల్ల పొట్ట నిండుగా ఉంటుంది. దీంతో మీరు ఎక్కువగా ఫుడ్ తినకుండా ఉంటారు. కేలరీల తక్కువగా తీసుకుంటారు. దీంతో ఈజీగా బరువు తగ్గుతారు.
​​​​​గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​​​​​​​​​​​​​​​​​​​​Read More :Fitness Newsand Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.