యాప్నగరం

120 ఏళ్ల తాతకు తొలిసారి తలనొప్పి

ప్రపంచంలోనే వయోధిక వృద్ధుడు మన భారతీయుడే. అతనికి తొలిసారిగా తలనొప్పి వచ్చింది.

TNN 31 Jul 2016, 12:36 pm
120ఏళ్ల తాతకు..కాదు..కాదు నవయవ్వనుడికి తొలిసారి తలనొప్పి వచ్చింది. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా రోగం, నొప్పి ఎరుగని అతడు మొదటిసారిగా తలనొప్పితో బాధపడ్డాడు. అదికూడా ఒక్కరోజులో చిటికెలో మాయమైంది. అంతే మళ్లీ ఎప్పటిలాగే హుషారుగా గడుపుతున్నాడు అతడు. ఇంతకీ ఇదంతా ఎవరి గురించి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నామండీ..ఇతను భారతీయుడే...పేరు స్వామి శివానంద బాబా. ఊరు బెహలా (పుట్టింది వారణాసిలో) వయసు అక్షరాల 120. ఆధ్యాత్మిక చింతనలో ఉండే శివానంద, అదే పనిలో ఊర్లు పట్టుకొని తిరుగుతుంటాడు. ఆధ్యాత్మిక అంశాలు బోధించే ఇతనికి సడెన్ గా తలనొప్పి వచ్చింది. అయితే ఇన్నెళ్లలో తన ఆరోగ్యంపై తనకు ఏలాంటి ఫిర్యాదులు లేని శివానంద...తొలిసారిగా తలనొప్పిగతా బాధపడటం, తనకే ఆశ్చర్యం వేసింది. అయినా దాన్ని తేలికగా తీసుకున్నాడు. కానీ వచ్చిబోయే భక్తులు, శిష్యుల ఒత్తిడితో ఆస్పత్రిలో వైద్యపరీక్షలు చేయించుకున్నాడు. అన్ని పరీక్షలు చేసిన ఆస్పత్ని వైద్యులు..ఒత్తిడి వల్లే తలనొప్పి వచ్చిందని, దానికి మించి మరే జబ్బు లేదని నిర్ధారించారు. అంతేగాక, అతడి పుట్టిన రోజు, ఆగస్టు 8, 1896 చూసి ఆస్పత్రి వర్గాలు షాక్ తిన్నాయి. ఎందుకంటే 120ఏళ్ల వచ్చినా ముఖం మీద చిన్నపాటి ముడతలులాంటివేం లేకపోవడం, ఇంకా 50ఏళ్ల వయసులోనే ఉన్నట్లు కనిపించడం వారిని ఆశ్చర్చపరిచింది. అనుమానం వచ్చిన ఆస్పత్రి సిబ్బంది తాత సారీ, ముసలియువకుడి వయస్సుపై ఆరా తీశారు. దాంతో తాను ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు ఎక్స్ రే పరికరం కనిపెట్టారని శివానంద చెప్పడం..ప్రతిరోజు క్రమంతప్పకుండా వ్యాయామం, పచ్చిమిర్చితో ఆహారంగా తీసుకోవడమే తన ఆరోగ్యం వెనుకున్న రహస్యం అన్నాడు. ‘శివానంద నవయువకుడు. అతని గుండె యువకుడిలానే పనిచేస్తోంది. బాబా పరిపూర్ణ ఆరోగ్యవంతుడ’ అతనికి వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ పీసీ మండల్ కితాబిచ్చారు.
Samayam Telugu 120 years old no complaints about health
120 ఏళ్ల తాతకు తొలిసారి తలనొప్పి

బాబా నాలుగేళ్ల వయసున్నప్పుడే తల్లిదండ్రులు, సోదరి చనిపోగా తన బంధువులు ఓ గురుజీకి అప్పగించారు. ఆ గురూజీ సాంగత్యంలో పెరిగిన బాబా ‘ఎప్పుడూ మంచి ఆహారం తీసుకోవడం, జీవితపట్ల సానుకూల దృక్పథం, ఏ చీకూచింత లేకుండా బతకడమే నా ఆరోగ్యానికి అసలు సూత్రం’ అంటారు బాబా. ఒత్తిడికి గురైనప్పుడల్లా మంచి విషయాలే ఆలోచిస్తానని ఆంగ్లంలో స్పష్టంగా సమాధానమిస్తాడు ఎప్పుడూ బడికెళ్లని బాబా. తన జీవితంలో ఎన్నో తిండిలేని రోజులు గడిపానని బాబా అంటారు.
ఉడకబెట్టిన బియ్యం, తృణధాన్యాలు, కూరగాయాలు బాబా రోజువారి మెను. ప్రతిరోజు రెండు గంటల పాటు యోగా చేసే బాబా...కేవలం 6గజాల ఆశ్రమమే ఆయన నివాసం. ప్రతిశనివారం తన భక్తులు, శిష్యులతో కలిసి పేదలు ఆహారం పంచిపెడ్తారు. వచ్చే డిసెంబర్ లో పూరిలోని కుష్ఠురోగులకు తనవంతు సేవలు అందిచేందుకు వెళ్లనున్నారు.
50ఏళ్లు నిండాయంటేనే రోగాలు నొప్పులతో ములిగుతూ కాలం గడిపే ఈ కాలంలో 120ఏళ్లు వయసు వచ్చినా ఏనొప్పి లేకుండా హాయీగా బాబా కాలం గడుపుతున్నాడంటే ఆయన జీవనవిధానమే కారణం. అన్నట్లు ప్రపంచంలో వయోధిక వృద్ధుడిగా గిన్నీస్ బుక్ లో పేరు నమోదు చేసుకున్న జపాన్ వాసి జీరోమన్ కిమూర కన్నా శివానంద బాబా ఐదేళ్లు పెద్దవాడు కావడం గమనార్హం.తలనొప్పి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.