యాప్నగరం

డయాబెటీస్? ఈ నాలుగూ అపోహలే!

మధుమేహం ఉందా? ఆహార నియమాలు పాటించడంలో గందరగోళానికి గురవ్వుతున్నారా? అయితే, ఈ నాలుగు అంశాల్లో ఉన్న అపోహలేమిటో తెలుసుకుని డైట్ ప్లాన్ చేసుకోంది.

TNN 30 Mar 2017, 5:14 pm
మధుమేహం అంటే.. రక్తంలో చక్కెర శాతం పెరగడం. దీనివల్ల ఇన్సులిన్ ఉత్పత్తి కాదు. ఈ నేపథ్యంలో చక్కెర లేని ఆహారం తీసుకోమని వైద్యులు సూచిస్తుంటారు. అయితే, కొందరు డైట్, వ్యాయమం విషయంలో గందరగోళానికి గురవ్వుతూ ఉంటారు. ముఖ్యంగా, ఈ నాలుగు అంశాల్లో వివిధ అపోహలు ఉన్నాయి.
Samayam Telugu 4 of the dumbest myths about diabetes that are still prevalent in india
డయాబెటీస్? ఈ నాలుగూ అపోహలే!


1. టీ, కాఫీల్లో సుగర్ వద్దు. మరి, బిస్కెట్‌లో?

చాలా మంది టీ, కాఫీల్లో సుగర్ కలుపుకోరు. అయితే, ఫైబర్ బిస్కట్ల ద్వారా వీటిని తీసుకునేవారు చాలా మంది ఉన్నారు. అయితే, దీనివల్ల శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు శరీరానికి అందుతాయనేది వారి ఉద్దేశం. అయితే, ఈ కార్బోహైడ్రేట్లు చివరిగా సుగర్‌గా మారి రక్తంలో కలుస్తాయి. ఈ నేపథ్యంలో.. చాయ్ బిస్కట్లను మానుకోవడమే మంచింది.

2. కొవ్వు పదార్థాలు తీసుకోకూడదా?

కొవ్వు శరీరానికి శత్రువు కాదు. హార్మోన్లు కొవ్వుపైనే ఆధారపడి ఉంటాయి. గుండె, మెదడులకు కూడా కొవ్వు ఇంధనంలా పని చేస్తుంది. ఇది ఇన్సులిన్‌పై కూడా ప్రభావం చూపదు. ఈ నేపథ్యంలో తగినంత కొవ్వు పదార్థాలు తీసుకోవచ్చు. అలాగని, అదేపనిగా మోతాదు పెంచినా ఇబ్బందే.

3. మధుమేహానికి ‘కార్డియో’ మంచి వ్యాయమమా?

కార్డియో వ్యాయమం ద్వారా కండలను బలోపేతం చేసుకోవచ్చని, దీనివల్ల శరీరంలోని కొవ్వును తగ్గించుకోవచ్చని భావిస్తారు. ఇది గుండె, ఊపిరి తీత్తులకు మంచి వ్యాయమే. కానీ, బ్లడ్‌ సుగర్ లెవల్‌ను తగ్గించేందుకు ఉపయోగపడదు. కండల్లో పేరుకునే కొవ్వులో గ్లూకోజ్ ఎక్కువ నిలువ ఉంటుంది.

4. ఒక్కసారి మధుమేహానికి గురైతే.. జీవితం అంతేనా?

రైన పౌష్టికాహారం తీసుకుంటూ, వ్యాయమం, జాగ్రత్తలు పాటిస్తే టైప్ -2 మధుమేహాన్ని నియంత్రించవచ్చని శాస్త్రీయంగా నిరూపించబడింది. కాబట్టి, మీరు జీవితాంతం మధుమేహ వ్యాధి గ్రస్తులనే ఆందోళనతో గడపొద్దు. వైద్యుల సూచనలు తీసుకుని, ఆహార వేళలు పాటిస్తే తప్పకుండా మీరు తిరిగి ఆరోగ్యవంతులవుతారు.

Written by: Rachit Dua, Advanced K11 Certified fitness Coach

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.