యాప్నగరం

సంతానం కలగడం లేదా...ఈ వ్యాధి కారణం కావచ్చు!

సంతానలేమికి చికిత్స తీసుకుంటున్న వారిలో సుమారు 40 శాతం మందికి ఈ వ్యాధి లక్షణాలున్నట్లు వైద్య నిపుణులు తెలియజేస్తారు. హైదరాబాదీలు ముఖ్యంగా దీంతో సతమతమవుతున్నారట.

TNN 23 Mar 2017, 1:29 pm
సంతానం కోసం ప్రయత్నిస్తూ చికిత్స తీసుకుంటోన్న హైదరాబాద్‌లోని 40 శాతం మంది జననేంద్రియ లేదా పెల్విక్ టీబీతో సతమతవుతున్నారని తేలింది. గత దశాబ్ద కాలంగా సంతానోత్పత్తి కోసం చికిత్స తీసుకుంటున్న సరిత అనే 32 ఏళ్ల మహిళ ఈ టీబీ ఉన్నట్లు తేలడంతో నిర్ఘాంతపోయారు. వివిధ రకాలు చికిత్సలు, సాధారణ పరీక్షల్లో బయటపడలేదని, హిస్టెరోస్కోపీ లేదా గర్భాశయ పరిశీలన వల్ల మాత్రమే దీన్ని గుర్తించారని ఆమె తెలిపారు. బయాప్సీ తర్వాత అసలు విషయాన్ని గుర్తించగలిగారు.
Samayam Telugu 40 of infertility patients in city suffer from pelvic tb
సంతానం కలగడం లేదా...ఈ వ్యాధి కారణం కావచ్చు!


సంతానం సాఫల్యత కేంద్రాలకు వైద్యం కోసం వస్తోన్న దేశంలోని 5 నుంచి 13 శాతం మహిళలు జననేంద్రియ క్షయతో బాధపడుతున్నట్లు ఇండియా జర్నల్ ఆఫ్ ట్యుబర్‌క్యులోసిస్ నివేదిక తేటతెల్లం చేసింది. హైదరాబాద్ కూడా దీనికి మినహాయింపు కాదని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో వీరి సంఖ్య 40 శాతంగా ఉండటమే కాదు, గత మూడేళ్లలో 15 శాతం పెరిగిందని జుహీ ఫెర్టిలిటీ సెంటర్ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ నిర్మలా అగర్వాల్ తెలిపారు.

రెండేళ్ల కిందట దీనిపై ఎవరికీ అవగాహాన లేదు, ఈ రకమైన క్షయ సంతానలేమిపై తీవ్ర ప్రభావం చూపుతోందని, శరీరంలోని ఏ అవయవానికైనా సోకే ప్రమాదం ఉందని కిమ్స్ హాస్పిటల్‌కు చెందిన ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రమణ ప్రసాద్ తెలిపారు. దీని స్థాయిలు గురించి ఇప్పటి వరకు ఎలాంటి అవగాహన లేదని ఆయన అన్నారు. వ్యాధి లక్షణాలను గుర్తించడం సవాల్‌తో కూడుకున్నదని వైద్యులు అంటున్నారు.

కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు చెందిన సెంట్రల్ టీబీ విభాగం మార్గదర్శకాల ప్రకారం కొంత మంది రోగుల అనుభవం ప్రకారం ఇతరులతో పోలిస్తే ఎలాంటి లక్షణాలు బహిర్గతం కావని, దీన్ని చాలా జాగ్రత్తగా మూల్యాకంనం చేయాల్సిన అవసరం ఉందని తెలిపింది.చాలా కేసుల్లో రోగులు టీబీతో బాధపడుతున్నట్లు ప్రారంభ దశలో తెలియదని వైద్య నిపుణులు పేర్కొన్నారు.

ఇలాంటి వాళ్లు లాప్రోస్కొపీ, జననేంద్రియాల స్కానింగ్ చేయించుకోవాలని సలహా ఇస్తున్నారు. ప్రారంభం దశలోనే దీన్ని నిర్ధరించడం చాలా ముఖ్యమని, లేకపోతే పునురుత్పాదక అవయవాలు దెబ్బతినే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీని వల్ల సహజ లేదా కృత్రిమ‌ పద్ధతిలో సంతానోత్పతి జరగడం కష్టమవుతుందని నిర్మలా అగర్వాల్ అంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.