యాప్నగరం

దోమలు ఎలాంటివారిని కుడతాయంటే..!

ఈ పాడు దోమలు నన్నే ఎందుకు కుడతాయి అని చాలా మంది ప్రశ్నిస్తారు.

TNN 14 Mar 2017, 4:39 pm
ఈ పాడు దోమలు నన్నే ఎందుకు కుడతాయి అని చాలా మంది ప్రశ్నిస్తారు. దీనికి సరైన సమాధానం చెప్పకపోయినా.. దోమలు మాత్రం అలా పక్షపాత వైఖరితో ఆలోచించే జీవులు మాత్రం కావంటారు కొంత మంది. కానీ, సైన్సు మాత్రం దీనికి సరైన జవాబును అన్వేషించే ప్రయత్నం చేస్తోంది. మన శరీర తత్వం ఆధారంగా.. మనవైపు దోమలు ఆకర్షితమవుతాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు. ‘దోమలను ఆకర్షించే అంశాలేవీ..’ అనే విషయంపై లోతైన పరిశోధనే జరుగుతోంది. ఇప్పటి వరకూ వచ్చిన 5 ఫలితాలు.. మీ కోసం..
Samayam Telugu 5 reasons mosquitoes bite you more than others
దోమలు ఎలాంటివారిని కుడతాయంటే..!


1) నా రక్తమంటే దోమలకు భలే ఇష్టమేమో.. అని తరచూ కొంత మంది వాపోవడాన్ని గమనించే ఉంటారు. ఇది నిజమేనట. దోమలకు ‘O’ వర్గానికి చెందిన రక్తమంటే ఇష్టమట. ‘A’ రక్తవర్గం వారితో పోలిస్తే ‘O’ రక్తవర్గం వారివైపు రెండింతలు ఆకర్షితమవుతున్నాయని పరిశోధనల్లో తేలింది. ‘B’ రక్తవర్గం వారు.. ఈ రెండు రక్త వర్గాలకు మధ్యస్థంగా ఉన్నారు. అయితే ఏ రక్తవర్గం అనేదాని కంటే.. ఎలాంటి రక్తం అనే అంశంపైనే దోమలు ఎక్కువగా ఫోకస్ చేస్తున్నాయట.

2) అన్ని రకాల కార్బన్ డై ఆక్సైడ్‌కు దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నాయి. చిన్నపిల్లలతో పోలిస్తే.. వయసులో పెద్దవారు కార్బన్ డై ఆక్సైడ్‌ను అధికంగా వదలడం మూలాన.. పెద్దవారినే దోమలు ఎక్కువగా కుడుతున్నాయి. ఈ కారణంగానే సాధారణ మహిళలతో పోల్చినప్పుడు.. గర్భిణిలను ఎక్కువగా కుడుతున్నాయట.

3) శరీర వేడి, కదలికలు, చెమట లాంటివి దోమలను ఆకర్షించే అంశాన్ని ప్రభావితం చేస్తున్నాయి. అవి.. చెమటలో ఉండే లాక్టిక్ ఆమ్లం, యూరిక్ ఆమ్లం, అమ్మోనియా లాంటి ఉత్పన్నాల వాసనను ఇట్టే పట్టేస్తాయట.

4) మీ చర్మంలో ఎక్కువ మోతాదులో స్టెరాయిడ్లు, కొలెస్ట్రాల్.. ఉన్నట్లైతే ఇక దోమలకు పండగేనట. అయితే చర్మంలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నంత మాత్రాన.. శరీరంలోనూ అది ఎక్కువగా ఉందని చెప్పలేమట. కొంత మందికి కొవ్వు పదార్థాలను జీర్ణం చేసుకునే శక్తి ఎక్కువగా ఉండటంతో.. ఆ ప్రక్రియకు సంబంధించిన ఉత్పన్నాలు చెమట ద్వారా అధికంగా బయటికి వెళ్లిపోతాయట. ఇలాంటివారిని దోమలు వెతుక్కుంటూ వస్తాయన్నమాట.

5) ఇకపోతే.. మద్యం అంటే దోమలకూ మహా ఇష్టమట. అలాగని బాటిళ్లకు.. బాటిళ్లే బీరును లేపేస్తాయేమోనని.. ‘తాగుబోతు సచ్చిన దోమలు’ అని తిట్టేయకండి. ఆల్కహాల్ సేవించేవారి చెమటకు.. ఇథనాల్ వాసన ఎక్కువగా ఉండటం వల్ల దోమలు వారివైపు ఆకర్షితమవుతున్నాయని రీసెర్చ్‌లో తేలింది. అన్నట్టూ.. దోమలు 50 మీటర్ల దూరం నుంచే వాసన పసిగడతాయట.

అమెరికన్ మస్కిటో కంట్రోల్ అసోసియేషన్.. ఇంకా ఇలాంటి 400 రకాల అంశాలపై పరిశోధనలు కొనసాగిస్తోంది. మరి ఇవన్నీ చదివాక.. ఆ దొంగ దోమలకు దొరకకుండా ఉండటానికి.. వాటికి ఇంపైన కంపును వదిలించుకోవడంపై దృష్టి సారిస్తారు కదూ..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.