యాప్నగరం

Pot water : కుండలో నీరు తాగితే ఈ 7 సమస్యలు దూరం..

Pot water : సమ్మర్‌లో మట్టి కుండలోని నీరు తాగడం చాలా మంచిది. ఎండాకాలంలో కుండ నీరు తాగితే ఏమేం లాభాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.

Produced byరావుల అమల | Samayam Telugu 19 May 2023, 1:15 pm
ఎండలు పెరగడం వల్ల చాలా మంది నీటిని ఎక్కువగా తాగుతున్నారు. ఈ నీటిని తాగడం వల్ల శరీరానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే, ఫ్రిజ్‌లోని చల్లని నీరు కాకుండా కుండ నీరు తాగడం మంచిది. మరి కుండలోని నీరు తాగడం వల్ల ఏమేం లాభాలు ఉన్నాయో చూద్దాం.
Samayam Telugu 7 health benefits of drinking water from a clay pot
Pot water : కుండలో నీరు తాగితే ఈ 7 సమస్యలు దూరం..


ఖనిజాలు..

మట్టి పాత్రల్లోని నీటిలో ఖనిజాలు, ట్రేస్ ఎలిమెంట్స్ సహజంగా ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది. కాబట్టి, రెగ్యులర్‌గా ఈ నీటిని తీసుకోవడం మంచిది.

రోజుకి ఎన్ని నీళ్ళు తాగాలి..

సహజంగానే చల్లగా..

ఈ కుండల్లో నీరు సహజంగానే చల్లగా ఉంటుంది. ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల లేనిపోని సమస్యలొస్తాయి. కాబట్టి, కుండలోని నీరు తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.
Also Read : Cluster Beans : గోరుచిక్కుడు తింటే బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గుతాయా..

వేడిని..

ఫ్రిజ్‌లో నీరు తాగడం వల్ల ఒంట్లో వేడి పెరుగుతుంది. కాబట్టి, కుండలో నీరు తాగడం మంచిది. దీనిని తాగడం వల్ల వేడి తగ్గుతుంది.

జీర్ణ సమస్యలు దూరం..

ఈ నీటిని తాగడం వల్ల జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా కుండలో నీరు తాగడం మంచిదని చెబుతున్నారు నిపుణులు. దీని వల్ల జీర్ణ సమస్యలు చాలా వరకూ దూరమవుతాయి.

మెటబాలిజం పెరగడం..

మెటబాలిజం సరిగ్గా లేకపోవడం వల్లే చాలా మంది బరువు పెరుగుతారు. జీవక్రియ సరిగ్గా ఉంటే జీర్ణ సమస్యలు దూరమై బరువు కూడా తగ్గుతారు.
Also Read : Shoulder Arthritis : భుజం నొప్పి తగ్గాలంటే ఇలా చేయాలి..

గాయాలు దూరం..

కుండలోని నీటిలో సహజ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తాగడం వల్ల గాయలు దెబ్బలు తగ్గుతాయి. కాబట్టి, రెగ్యులర్‌గా ఇలా నీటిని తాగడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి.

గొంతునొప్పి..

ఈ నీటిని తాగడం వల్ల గొంతు సమస్యలు రావు. వచ్చినా సమస్య తగ్గుతుంది. కాబట్టి, ఏ కాలంలో అయినా, వర్షాకాలం, చలికాలంలోనూ ఈ నీటిని తాగొచ్చు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
​Read More : Health News and Telugu News

రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.