యాప్నగరం

Eye Health: కళ్లు బాగా కనిపించాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!


Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 29 Mar 2023, 10:59 am
​Eye Health: మన శరీరంలోని జ్ఞానేంద్రియాల్లో అతి ముఖ్యమైనవి కళ్లు. కళ్లు సరిగ్గా పనిచేయకపోతే.. ఏ పని సరిగ్గా చేయలేం. చదవడానికి, రాయడానికి, సాధారణ పనులు చేయడానికీ కష్టంగా మారుతుంది. ప్రస్తుతం ఉన్న వాతావరణ పరిస్థితులు, కాలుష్యం, ఆహారపు అలవాట్లు, లైఫ్‌స్టైల్‌, మొబైల్‌ ఫోన్ల వాడకం కారణంగా.. దృష్టి సమస్యలతో భాదపడేవారి సంఖ్య రోజురోజుకూ ఎక్కువవుతోంది. చిన్నవయస్సులోనే కళ్లకు అద్దాలు వచ్చేస్తున్నాయి. కంటి చూపును కాపాడుకోవడానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటా.. మీ డైట్‌లో కొన్ని పోషకాలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. న్యూయార్క్ స్టేట్‌ వెబ్‌ సైట్‌లోని ఓ నివేదిక ప్రకారం కొన్ని విటమిన్లు, మినరల్స్‌ కంటి చూపును కాపాడటానికి ఇవి యాంటీఆక్సిడెంట్స్‌గా పనిచేస్తాయి. ఇవి కణాలు, కణజాలాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. కంటి సమస్యలను నెమ్మదిగా తగ్గించడానికి తోడ్పడతాయి. దృష్టి సమస్యలతో బాధపడేవారు, కంటి చూపును రక్షించుకోవాలనుకునేవారు.. వారి డైట్‌ ఏ పోషకాలు చేర్చుకోవాలో ఈ స్టోరీలో చూద్దాం.
Samayam Telugu according to a research include this nutrients in your diet to keep your eye health
Eye Health: కళ్లు బాగా కనిపించాలంటే.. ఇవి కచ్చితంగా తినాలి..!


లుటిన్, జియాక్సంతిన్..

లుటిన్‌, జియాక్సంతిన్‌ మన కంటిలో ఉండే.. కెరోటినాయిడ్లు. ఇవి సూర్యరశ్మి నుంచి కంటిని రక్షిస్తాయి. ఇవి లైట్‌ ఫిల్టర్‌గా పనిచేస్తాయి, యూవీ కిరణాల వల్ల కంటి కణజాలాలు దెబ్బతినకుండా కాపాడతాయి. అరోగ్యకరమైన కంటి కణాలకు హాని చేసే ఫ్రీ రాడికల్స్‌, అన్‌స్టేబుల్‌ మాలిక్యూల్స్‌ నుంచి జియాక్సంతిన్‌ రక్షిస్తుంది. లుటిన్‌ జియాక్సంతిన్‌ పొందడానికి.. మీ డైట్‌లో ముదరు ఆకుపచ్చ కూరలు, గుడ్లు, పసుపు, ఆరెంజ్‌ రంగు పండ్లు, బ్రోకలీ, మొక్కజొన్న, బఠానీ, కాలే వంటి ఆహార పదార్థాలు తీసుకోండి. (image source - pixabay)

Also Read: మీ కళ్లకు అద్దాలు రాకుండా ఉండాలంటే.. కచ్చితంగా ఈ కేర్‌ తీసుకోవాలి..!

విటమిన్‌ సీ..

విటమిన్ c ని ఆస్కార్బిక్ యాసిడ్‌ అని కూడా అంటారు. విటమిన్ సి ఆక్సిజన్ తీసుకోవడం, కంటి లోపల ఆక్సిజన్ తక్కువ స్థాయిని నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. లెన్స్, విట్రస్‌లో ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి, కంటి శుక్లాలం ప్రమాదాన్ని తగ్గించడానికి విటమిన్‌ సి సహాయపడుతుంది. విటిమిన్‌ సి అధికంగా ఉండే... కివి, క్యాప్సికమ్‌, టమాటా, బ్రోకలీ, పాలకూర, జామ కాయ, సిట్రస్‌ పండ్లు, ద్రాక్ష పండ్లు మీ ఆహారంలో చేర్చుకోండి.

విటమిన్‌ ఇ..

విటమిన్‌ ఇ ఫ్రీ-రాడికల్స్ నుంచి కళ్లను రక్షిస్తుంది. యూవీ కిరణాల నుంచి కంటిని కాపాడుతుంది. విటమిన్ ఇ పొందడానికి మీ ఆహారంలో వెజిటబుల్ ఆయిల్, నట్స్, గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, చిలగడదుంప, అవకాడో, తృణధాన్యాలు తీసుకోండి. (Image source - pixabay)

విటమిన్‌ ఏ..

మన శరీరంలో బీటా కెరోటిన్‌ విటమిన్‌ A గా మారుతుంది. ఇది కంటిచూపునకు తోడ్పడే విటమిన్. రక్తనాళాల్లో మ్యూకస్ అనే పొరను రక్షిస్తుంది. రెటీనాలో వర్ణద్రవ్యాల్ని ఏర్పరచడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ ఏ పొందడానికి బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, పసుపు పచ్చని పండ్లు,కూరగాయలు (గుమ్మడి పండు, జామ పండు), వెన్న, టొమాటో మీ ఆహారంలో చేర్చుకోండి.

ఫ్యాటీ యాసిడ్స్‌..

ఫ్యాటీ యాసిడ్స్ కళ్లకు, మెదడుకు మేలు చేస్తాయి. మీరు ఫ్యాటీ యాసిడ్స్‌ పొందాలనుకుంటే.. సాల్మన్, సార్డినెస్, అవిసె గింజలు, సోయాబీన్స్, చియా సీడ్స్‌, అక్రోట్లు, సోయాబీన్స్‌, గుడ్లు, పాల ఉత్పత్తులు, వాల్‌నట్‌లను మీ డైట్‌లో చేర్చుకోండి.

జింక్‌..

జింక్ కంటిలో ఎక్కువగా ఉంటుంది. ఎక్కువగా రెటీనా, కోరోయిడ్, రెటీనా కింద ఉన్న వాస్కులర్ టిష్యూ పొరలో ఉంటుంది. ఇది లివర్‌ నుంచి రెటీనాకు విటమిన్‌ ఏ తీసుకురావడానికి సహాయపడుతుంది. రెడ్ మీట్, చికెన్, షేల్స్‌, సాల్మన్‌ చేపలు, గుడ్లు, సీ ఫుడ్, చిలగడ దుంప, శనగలు, నట్స్‌, బీన్స్, సోయా, పాలు, పాల ఉత్పత్తులు, తృణధాన్యాలలో జింక్‌ సమృద్ధిగా లభిస్తుంది.

Also Read: జింక్‌ లోపిస్తే ఈ సమస్యలు వస్తాయంట.. జాగ్రత్త..!

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.