యాప్నగరం

joint lubrication: ఇవి తింటే.. మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది..!

joint lubrication: గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత మోకాళ్ల నొప్పుల సమస్యలు వచ్చేవి.. కానీ, ఈ రోజుల్లో 30, 40 ఏళ్ల వయస్సులోనే మోకాళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఎముకలు బలహీన పడటం, కీళ్లలో జిగురు తగ్గినప్పుడు కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని వస్తుంది. మోకాళ్లలో జిగురు పెంపొందించే.. ఆహారం తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 17 Dec 2022, 2:27 pm
joint lubrication: ఈ రోజుల్లో మోకాళ్ల నొప్పుల సమస్యలు ఎక్కువ అయ్యాయి. కూర్చుంటే నొప్పి. నిల్చుంటే నొప్పి. మెట్లు ఎక్కితే నొప్పి, దిగితే నొప్పి.. జీవితమే నరకప్రాయం అవుతుంది. ఏ పనీ చేయాలన్నా ఇబ్బందే. గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత మోకాళ్ల నొప్పుల సమస్యలు వచ్చేవి.. కానీ, ఈ రోజుల్లో 30, 40 ఏళ్ల వయస్సులోనే మోకాళ్ల సమస్యలు ఇబ్బంది పెడుతున్నాయి. ఎముకలు బలహీన పడటం, కీళ్లలో జిగురు తగ్గినప్పుడు కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది. మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని వస్తుంది.
Samayam Telugu according to several research eat this vegetables to increase joint lubrication naturally
joint lubrication: ఇవి తింటే.. మోకాళ్ల మధ్య జిగురు పెరుగుతుంది..!

మోకాళ్ల కీళ్లలో ద్రవ పదార్థం ఉంటుంది. ఇది కీళ్లలో జిగురులా పనిచేస్తుంది, దీంతో ఎముకులు ఒకదానికి ఒకటి తగలవు. దీన్ని మృదులాస్థి (cartilage ), సైనోవియం అని కూడా అంటారు. దీన్ని జాయింట్‌ గ్రీజ్‌‌ అని కూడా అంటారు.
నిశ్చల జీవనశైలి, చెడు ఆహార అలవాట్లు, ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, ఆల్కహాల్‌ ఎక్కువగా తీసుకోవడం, గాయాలు, బరువులు ఎక్కువగా మోయడం కారణంగా మోకాళ్లలో జిగురు క్షిణించే అవకాశం ఉంది. దీంతో మోకాళ్లు అరిగి అర్థరైటిస్‌కు దారి తీసే అవకాశం ఉంది. మోకాళ్లలో జిగురు పెంపొందించే.. ఆహారం తీసుకుంటే ఈ సమస్యను నివారించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

రెడ్‌ క్యాప్సికమ్‌..

రెడ్‌ క్యాప్సికమ్‌ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. రెడ్ క్యాప్సికమ్‌లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్ సి మీ శరీరం కొల్లాజెన్‌ను తయారు చేయడంలో సహాయపడుతుంది. కొల్లాజెన్‌‌ మృదులాస్థి (cartilage), టెన్డన్స్‌, లిగమెంట్స్‌‌‌‌లో ఓ భాగం. ఇది మోకాళ్లు బలంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండటానికి సహాయపడుతుంది.

కాలే..

కాలే క్రూసిఫెరస్‌ కుటుంబానికి చెందిన కూరగాయ. దీనిని ఎక్కువగా సలాడ్‌‌లో ఉపయోగిస్తారు. కాలేలో అరోగ్యానికి మేలు చేసే అనేక పోషకాలు ఉన్నాయి. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, బీటా-కెరోటిన్ , విటమిన్‌ సీ పుష్కలంగా ఉంటాయి. కాలేలో ఎముకలు, కీళ్ల ఆరోగ్యానికి అవసరమైన కాల్షియం పుష్కలంగా ఉంటుంది. మీ డైట్‌లో తరచుగా కాలే తీసుకుంటే.. ఎముకలు బలంగా ఉంటాయి. మోకాళ్ల సమస్య నుంచి రక్షణ లభిస్తుంది.

ఉల్లి, వెల్లుల్లి..

భారతీయ వంటకాలలో ఉల్లి, వెల్లుల్లి ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఉల్లి, వెల్లుల్లిలో సల్ఫర్‌ మెండుగా ఉంటుంది. సల్ఫర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇన్ఫ్లమేషన్‌, నొప్పులతో పోరాడుతుంది. మీ కీళ్లను దృఢంగా, ఫ్లెక్సిబుల్‌గా ఉండాలంటే.. ఉల్లి, వెల్లుల్లి పచ్చిగా తింటే మోకాళ్లకు మంచిదని నిపుణులు చెబుతున్నారు.

అల్లం..

అల్లంలో అనేక ఔషద గుణాలు ఉన్నాయి. అల్లంలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, నొప్పులు తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి మీ డైట్‌లో అల్లాన్ని చేర్చుకుంటే మంచిది.

బీన్స్‌

బీన్స్‌లో ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో పోషక విలువలు ఉన్నాయి. దీనిలో ప్రోటిన్‌, మినరల్స్‌, ఫైబర్‌ పుష్కలంగా ఉంటాయి. బీన్స్‌లో ఉండే మ్యాజికల్ ఫ్లేవనాయిడ్స్‌‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.