యాప్నగరం

Thyroid cure: అశ్వగంధతో థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంటుందా..?

థైరాయిడ్‌తో బాధపడేవారి సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. జీవనశైలిలో మార్పులు, చెడు ఆహార అలవాట్లు, ఒత్తిడి, నిద్రలేమి కారణంగా.. థైరాయిడ్‌ సమస్య పెరిగిపోతుంది. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. జోష్ యాక్స్.. థైరాయిడ్ పనితీరు మెరుగుపరిచే కొన్ని సూచనలు చేశారు. ఇవి థైరాయిడ్‌ కంట్రోల్‌ చేయడానికి ప్రభావంతంగా పని చేస్తాయని అన్నారు.

Edited byరాజీవ్ శరణ్య | Samayam Telugu 1 Jul 2022, 4:43 pm
ఇటీవల థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య బాగా పెరిగిపోయింది. అంచనా ప్రకారం, భారతదేశంలో దాదాపు 42 మిలియన్ల మంది ప్రజలు థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. పురుషుల కంటే స్త్రీలలో థైరాయిడ్‌ సమస్య ఎక్కువగా ఉంటుంది. శరీర జీవక్రియల్ని నియంత్రించే అతి ముఖ్యమైన గ్రంథి థైరాయిడ్‌. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ... ఇలా చాలా వాటిపై థైరాయిడ్ హార్మోన్‌ ప్రభావం ఉంటుంది. హైపోథలామస్, పిట్యూటరీ, థైరాయిడ్ వ్యవస్థలలో మార్పులు రావడం వల్ల థైరాయిడ్ గ్రంథి పనితీరులో మార్పులు వచ్చి.. హైపర్ థైరాయిడిజమ్, హైపోథైరాయిడిజం వంటి సమస్యలు వస్తాయి.
Samayam Telugu ashwagandha


హైపోథైరాయిడిజమ్..

శరీరానికి కావాల్సిన దానికంటే తక్కువ మోతాదులో థైరాయిడ్ గ్రంథి థైరాక్సిన్‌ను ఉత్పత్తి చేయడం వల్ల ఈ సమస్య వస్తుంది. టి3, టి4 హార్మోన్లు తగ్గుతాయి. టీఎస్‌హెచ్ పెరుగుతుంది. కొన్నిసార్లు ఈ సమస్య వంశపారంపర్యంగా రావచ్చు. ఈ మార్పులతో జీవక్రియ పనితీరు మందగిస్తుంది. శరీరంలో చురుకుదనం తగ్గుతుంది. బరువు పెరిగిపోతారు. చుట్టూ ఉన్న వారికి చెమటలు పడుతుంటే, ఈ సమస్య ఉన్నవారికి మాత్రం చలిగా అనిపిస్తుంది. వీటన్నింటితో పాటు మలబద్ధకం, గుండె కొట్టుకునే వేగం తగ్గడం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, గోళ్లు విరిగిపోయినట్లు కనిపించడం, డిప్రెషన్.. పిల్లలు కలగకపోవడం, రక్తహీనత, నెలసరి సమయంలో రక్తస్రావం ఎక్కువ కావడం లాంటి మార్పులు కనిపిస్తాయి.
హైపర్‌ థైరాయిడిజం..
థైరాయిడ్ హార్మోను ఎక్కువగా విడుదల అవుతుంది. టి3, టి4 హార్మోన్లు ఎక్కువగా విడుదలై టీఎస్‌హెచ్ తగ్గిపోతుంది. దాంతో జీవక్రియల పనితీరు వేగం పెరుగుతుంది. గుండెదడ, బరువు తగ్గిపోవడం, అకారణంగా చెమటలు పట్టడం, పేగుల కదలిక ఎక్కువ జరిగి విరేచనాలు కావడం, కనుగుడ్లు బయటకు వచ్చినట్లు కనిపించడం లాంటి సమస్యలు ఎదురవుతాయి. నిద్ర పట్టక పోవడం, చేతులు వణకడం, మానసిక ఒత్తిడి, చల్లగా ఉన్న వేళల్లోనూ వేడిగా అనిపించడం, ఎక్కువగా చెమటపోయడం, నెలసరి క్రమం తప్పడం, ఎక్కువసార్లు మలవిసర్జనకు వెళ్లవలసి రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
అమెరికాకు చెందిన ప్రముఖ వైద్యుడు డా. జోష్ యాక్స్.. థైరాయిడ్ పనితీరు మెరుగుపరిచే కొన్ని సూచనలు చేశారు. ఇవి థైరాయిడ్‌ కంట్రోల్‌ చేయడానికి ప్రభావంతంగా పని చేస్తాయని అన్నారు.
View this post on Instagram A post shared by Dr. Josh Axe, DC, DNM, CNS (@drjoshaxe)


అశ్వగంధ..

థైరాయిడ్ చికిత్సలో అశ్వగంధ చాలా ప్రభావవంతంగా పని చేస్తుందని డా. జోష్ యాక్స్‌ అన్నారు. ఇది హైపోథైరాయిడిజం సమస్య ఉన్నవారిలో థైరాయిడ్ స్థాయిలను మెరుగుపరుచడంలో సహాయపడుతుందని అన్నారు. అశ్వగంధ ఒత్తిడిని తగ్గిస్తుంది. థైరాయిడ్‌ సమస్య రావడానికి ఒత్తిడి కూడా ఓ కారణం.
ప్రొబయోటిక్స్‌..

మీరు థైరాయిడ్‌ సమస్యకు దూరంగా ఉండటానికి, థైరాయిడ్‌ కంట్రోల్‌లో ఉంచుకోవాలనుకుంటే.. ప్రొబయెటిక్స్‌ ఉన్న ఆహారం తీసుకోవడం మంచిదని డా. జోష్‌ యాక్స్‌ సూచించారు. ఇవి పాల ఉత్పత్తులలో దొరుకుతాయని అన్నారు. ప్రొబయోటిక్స్‌తో డిప్రెషన్‌, మానసిక ఒత్తిడి సమస్యలకు చెక్‌ పెట్టవచ్చు. ఆనందంగా ఉండడానికి ప్రోబయోటిక్స్‌ ఆహారం కీలక పాత్ర పోషిస్తుందని పోషకారహార నిపుణులు అంటున్నారు.
థయామిన్, విటమిన్ బి..

థైరాయిడ్‌ సమస్యతో బాధపడుతున్నవారు.. వారి డైట్‌లో థయామిన్, విటమిన్ B12 అధికంగా ఉండే ఆహారం తీసుకోమని డా. జోష్‌ యాక్స్‌ సూచించారు. థయామిన్‌, విటమిన్‌ బి 12 హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయ పడుతుంది. ఈ పోషకాలు.. మీ థైరాయిడ్ పనితీరును మెరుగుపరచడంలో సహాయపడతాయి. పాలు, పెరుగు, చేపలు, చిరుధాన్యాలు,తృణధాన్యాలు, చికెన్, న్యూట్రిషియన్ ఈస్ట్ ఫ్లేక్స్ వంటి ఆహారాలు తీసుకుంటే మంచిది.
సెలీనియం

సెలీనియం ఎక్కువగా ఉండే ఎల్లోఫిన్ ట్యూనా, బీఫ్ లివర్, గుడ్లు మొదలైన వాటిని ఆహారంలో చేర్చుకోవాలని డా. జోష్ యాక్స్‌ సూచించారు. సెలీనియం T4ని శరీరంలోని హార్మోన్లతో సమతుల్యం చేయడంలో సహాయపడుతుంది.
ఆస్ట్రాగాలస్

అస్ట్రాగాలస్‌‌ ఒక రకమైన కూరగాయ, ఇది థైరాయిడ్ వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. అస్ట్రాగాలస్‌ తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడుతుంది. థైరాయిడ్‌ను అదుపులో ఉంచుకోవడానికి అస్ట్రాగాలస్ తీసుకుంటే మంచిదని డా. జోష్‌ యాక్స్‌ సూచించారు.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.