యాప్నగరం

కృత్రిమ చక్కెరతో బరువు తగ్గరు సరికదా...

అధిక బరువు, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారు చక్కెరకు బదులుగా తక్కువ కేలరీలు ఉండే కృత్రిమ చక్కెరలను వినియోగించినా ప్రయోజనం ఉండదని ఓ అధ్యయనంలో తేలింది.

TNN 17 Jul 2017, 4:41 pm
అధిక బరువు, అనారోగ్య సమస్యలతో సతమతమయ్యే వారు చక్కెరకు బదులుగా తక్కువ కేలరీలు ఉండే కృత్రిమ చక్కెరలను వినియోగించినా ప్రయోజనం ఉండదని ఓ అధ్యయనంలో తేలింది. పరిశోధనలో భాగంగా కొంతమందిని ఎంపికచేసి రెండు గ్రూపులుగా విభజించారు. కృత్రిమ చక్కెరలు ఒక గ్రూప్‌నకు, సాధారణ చక్కెరలను ఒక గ్రూప్‌ను అందించారు. అయితే కృత్రిమ చక్కెర తీసుకున్నవారిలో ఎలాంటి మార్పులు చోటుచేసుకోలేదని పరిశోధకులు గుర్తించారు. వీటిని తరుచూ తీసుకునే వారికి అనారోగ్య సమస్యలు కూడా చోటుచేసుకున్నట్లు గుర్తించారు. అయితే ఈ సమస్యలకు కారణం ఈ పదార్థాలేనని స్పష్టంగా చెప్పలేదు. కృత్రిమ చక్కెర వినియోగం- ఆరోగ్యంపై ప్రభావం పేరుతో ఈ పరిశోధన నిర్వహించారు.
Samayam Telugu artificial sweeteners dont help people lose weight review finds
కృత్రిమ చక్కెరతో బరువు తగ్గరు సరికదా...


అమెరికాలోని పిల్లలు, 41 శాతం మంది యువత రోజులో ఒకసారి దీన్ని వినియోగిస్తున్నట్లు ఇటీవల పరిశోధనలో తేలింది. దీని వల్ల అధిక బరువు తగ్గి, ఆరోగ్యంగా ఉంటారనే నమ్మకంతోనే తీసుకుంటున్నారని పరిశోధనకు నాయకత్వం వహించిన యూనివర్సిటీ ఆఫ్ మోనిటోబాకు చెందిన శాస్త్రవేత్త మేఘన్ అజాద్ తెలిపారు. ఈ వివరాలను కెనడియన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురించారు. సుమారు 40 లక్షల మంది వ్యక్తులను పరిశీలించి, వారి ఆహారపు అలవాట్లను గుర్తించినట్లు తెలియజేశారు. అధిక బరువు తగ్గించుకోడానికి ఆర్టిఫిషియల్ స్వీట్నర్ వాడకం గణనీయమైన ప్రభావం చూపలేదు. అయితే దీని వల్ల బీఎంఐలో చిన్న పెరుగుదల కనిపించింది. తక్కువగా వినియోగించిన వారితో పోలిస్తే ఎక్కువ మొత్తం తీసుకున్నవారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం 14 శాతం అధికమని తేలింది. అలాగే గుండె సంబంధ వ్యాధులు కూడా వచ్చే ప్రమాదం 32 శాతం అధికమని వెల్లడయ్యింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.