యాప్నగరం

ఏటీఎం ప్రింటౌట్లతో అంగస్తంభన సమస్యలు!

ఏటీఎం ప్రింటౌట్లు, లాటరీ టికెట్లు, సూపర్ మార్కెట్లలో ఇచ్చే రిసీప్ట్‌లతో అంగస్తంభన సమస్యలు తలెత్తుతున్నాయ్..

TNN 4 May 2017, 6:49 pm
ఏటీఎం ప్రింటౌట్లతో అంగస్తంభన సమస్యలు రావడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? వినడానికి విడ్డూరంగా ఉన్నప్పటికీ ఇది నిజమే. సాధారణంగా 40 ఏళ్లు దాటిన మగవారిలో లైంగిక సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. ఒత్తిడి, నిద్రలేమి కారణంగానూ శృంగారం పట్ల ఆసక్తి కొరవడుతుంది. కానీ ఏటీఎంల నుంచి డబ్బులు డ్రా చేసుకునేప్పుడు వచ్చే ప్రింటౌట్లు, లాటరీ టికెట్లతో మగవాళ్లకు సమస్యలు వస్తుండటం విచిత్రంగా అనిపించినా వాస్తవమే.
Samayam Telugu atm printouts and lottery tickets cause erectile dysfunction
ఏటీఎం ప్రింటౌట్లతో అంగస్తంభన సమస్యలు!


ఏటీఎం ప్రింటౌట్లు ఒక్కటే కాదు, లాటరీ టికెట్లు, సూపర్ మార్కెట్లలో ఇచ్చే బిల్లు రశీదుల కారణంగా అంగ స్తంభన సమస్యలు తలెత్తుతున్నాయి. రిసీప్ట్‌ల కోసం వాడే కాగితం, ఇంకు కారణంగానే ఈ సమస్యలు వస్తున్నాయట. ఏటీఎం ప్రింటౌట్లలో బిస్ఫెనాల్-ఎ అనే రసాయనం ఎక్కువగా ఉంటుంది. ఇది స్త్రీల హర్మోన్ అయిన ఇస్ట్రోజన్ ఉత్పత్తిని పెంపొందిస్తుంది. ఫలితంగా మగాళ్లలో హార్మోన్ల అసమతుల్యత ఏర్పడి దాని ప్రభావం అంగస్తంభనలపై పడుతోంది.

వీటిల్లోనే కాకుండా క్యాన్డ్ ఫుడ్‌లోనూ బిస్పెనాల్-ఎ అధిక మోతాదులో ఉంటుంది. కాబట్టి వీటన్నింటికి దూరంగా ఉండటం ఉత్తమం. ఏటీఎం ప్రింటౌట్లు, సూపర్ మార్కెట్లు ఇచ్చే బిల్లులను జేబులో ఉంచుకునే బదులు పర్సులో ఉంచుకోవడం మంచిది. అలాగే వాటిని తాకిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. లేదంటే ఏమవుతుందో మీకు అర్థమైందిగా.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.