యాప్నగరం

stomach health: ఇవి నమిలితే.. కడుపు సమస్యలన్నీ దూరం అవుతాయ్‌..!

కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే.. మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌, పైల్స్‌, డయేరియా, బరువు తగ్గడం, బరువు పెరగడం, ఎసిడిటీ, హీట్‌బర్న్, పేగుల్లో సమస్యలు వంటి హెల్త్‌ ఇష్యూస్‌ వచ్చే అవకాశం ఉంది. పొట్టకు సంబంధించిన సమస్యలు.. చిన్నగా అనిపించినా, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతక మయ్యే ప్రమాదం ఉంది. ఆయుర్వేద చిట్కాలతో కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్‌ దీక్షా భావ్సర్‌ అన్నారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 7 Oct 2022, 4:26 pm
చాలా వరకు ఆరోగ్య సమస్యలు పొట్ట నుంచే మొదలవుతాయని నిపుణులు చెబుతుంటారు. పొట్ట ఆరోగ్యంగా ఉంటే మనం ఆరోగ్యంగా ఉంటాం. కడుపు ఆరోగ్యాన్ని కాపాడుకోకపోతే.. మలబద్ధకం, గ్యాస్ట్రిక్‌, పైల్స్‌, డయేరియా, బరువు తగ్గడం, బరువు పెరగడం, ఎసిడిటీ, హీట్‌బర్న్, పేగుల్లో సమస్యలు వంటి హెల్త్‌ ఇష్యూస్‌ వచ్చే అవకాశం ఉంది. కడుపును ఎప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవాలని నిపుణుల సలహా ఇస్తూ ఉంటారు. పొట్టకు సంబంధించిన సమస్యలు.. చిన్నగా అనిపించినా, సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే ప్రాణాంతక మయ్యే ప్రమాదం ఉంది. కడుపు సమస్యలు నిర్లక్ష్యం చేస్తే పెద్దప్రేగు క్యాన్సర్, హెమోరాయిడ్స్, పాలిప్స్, ఇన్ఫెక్షన్, ఉదరకుహర వ్యాధి (celiac disease), క్రోన్'స్ సమస్య అల్సరేటివ్ కొలిటిస్, ఇస్కీమియా, గ్యాస్ట్రోఎసోఫాగియల్ రిఫ్లక్స్ వ్యాధి, పెప్టిక్ అల్సర్లు వంటి తీవ్రమైన సమస్యలకు దారి తీస్తాయి.
Samayam Telugu ayurveda doctor suggests herbs to treat gut related issues and stomach health
stomach health: ఇవి నమిలితే.. కడుపు సమస్యలన్నీ దూరం అవుతాయ్‌..!

కడుపును క్లీన్‌గా, హెల్తీగా ఉంచుకోవాడానికి చాలా మార్గాలు ఉన్నాయి. ఆయుర్వేద చిట్కాలతో కడుపును ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆయుర్వేద డాక్టర్‌ దీక్షా భావ్సర్‌ అన్నారు.


ఆయుర్వద చిట్కాలు

View this post on Instagram A post shared by Dr Dixa Bhavsar Savaliya (@drdixa_healingsouls)

​సోంపు..

సోంపు మౌత్‌ ఫ్రెషనర్‌గా పనిచేస్తుందని డాక్టర్‌ దీక్షా అన్నారు. తీవ్రమైన పొట్ట సమస్యలను దూరం చేయడానికి సోంపు సహాయపడుతుందని స్పష్టం చేశారు. 100 గ్రాముల సోంపులో 40 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది. ఇది ఆహారం జీర్ణ కావడానికి సహాయపడుతుంది. జీర్ణ సంబంధ సమస్యలతో బాధపడేవారు ఆహారం తీసుకున్న తర్వాత దీన్ని తింటే ఉపశమనం లభిస్తుంది. మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. సోంపి తింటే.. బెల్లీ ఫ్యాట్‌ కరుగుతుంది, జీవక్రియ మెరుగుపడుతుంది. సోంపు టీ తయారు చేసుకుని కూడా తాగొచ్చు. కాసిన్ని సోంపు గింజలు తీసుకోని, నీరు పోసి 5 నిమిషాల పాటు మరిగించాలి. తరవాత ఈ సోంపు వాటర్‌ని వడగట్టుకోవాలి. ఈ నీటిని ఉదయం పూట తాగితే మంచిది. నచ్చిన వారు ఇందులో నిమ్మరసం కలిపి తాగవచ్చు.

జీలక్రర..

జీలకర్రను రాత్రిపూట నీటిలో నానబెట్టి ఆ నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల పొట్ట సమస్యలు పరిష్కారం అవుతాయి. జీలకర్ర నీరు తీసుకుంటే మలబద్ధకం, వికారం వంటి వ్యాధులను దూరం చేసుకోవచ్చని డాక్టర్ దీక్షా అంటన్నారు. ఇందులో ఉండే మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడుతుంది. మీరు జీర్ణ సమస్యలతో బాధపడుతుంటే తప్పకుండా ఉదయం ఈ డ్రింక్‌ను తీసుకోవాలి. ఇందులో కార్బోహైడ్రేట్లు, గ్లూకోజ్, కొవ్వును విచ్ఛిన్నం చేసే ఎంజైమ్స్ ఉంటాయి. ఇవి పొట్ట సమస్యలను సులభంగా నియంత్రిస్తాయి.

వాము, ఉప్పు

ఆహారం సరిగా జీర్ణం కాని వారు.. అన్నంలో కొద్దిగా ఉప్పు, కొద్దిగా వాము కలిపి తినవచ్చు. వాము కడుపులో యాసిడ్స్‌ ఉత్పత్తి అయ్యేలా చేస్తుంది. అజీర్తి, కడుపు ఉబ్బరం, గ్యాస్, అల్సర్ సమస్యలను పరిష్కరిస్తుంది. వాములో ఉండే థైమోల్, కార్వాక్రోల్.. బ్యాక్టీరియా, ఫంగస్‌లతో పోరాడతాయి. వాము జీర్ణశక్తిని మెరుగుపరిచి ఆకలిని పెంచుతుంది. కడుపు నొప్పిని తగ్గిస్తుంది. వాములో ఔషధ గుణాలెక్కువ. విరోచనాలతో బాధపడుతున్నవారు వాము నీళ్లను తాగితే ఉపశమనం లభిస్తుంది.

ఇంగువ..

పులిహోరలో, పప్పులో చిటికెడు ఇంగువ వేస్తే చాలు.. వాటి టేస్ట్‌ నెక్ట్స్‌ లెవల్‌ ఉంటుంది. ఇంగువ జీర్ణ రసాలు ఉత్పత్తి అవడానికి తోడ్పడుతుంది. ఎంజైమ్‌ల చర్యను ప్రభావితం చేస్తుంది. దీంట్లో ఔషధాల గుణాలూ ఎక్కువే.అజీర్తి, కడుపులో మంట, అన్నం సరిగా జీర్ణమవకపోవడం లాంటి సమస్యల నుంచి దూరంగా ఉండాలంటే కూరల్లో చిటికెడు ఇంగువ చేర్చుకుంటే సరి. గ్లాసు మజ్జిగలో దీన్ని వేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. ఆకలి లేకపోవడం లాంటి సమస్యలతోపాటు జీర్ణ సంబంధ వ్యాధులను తగ్గిస్తుంది.

యాలకులు..

యాలకులు సువాసనా, రుచీ కోసం స్వీట్స్‌, మరి కొన్ని వంటల్లో వేస్తూ ఉంటాం. యాలకలు కడుపు ఆరోగ్యానికీ మేలు చేస్తాయి. అన్నం తిన్నాక రెండు యాలకుల్ని నోట్లో వేసుకుంటే చాలు.. ఆహారం పూర్తిగా జీర్ణమవుతుంది. వీటిలోని ఔషధ గుణాలు బ్యాక్టీరియాతో పోరాడతాయి. మెటబాలిజం రేటుని మెరుగు పరుస్తాయి. యాలకులు అల్సర్స్‌ను నయం చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.