యాప్నగరం

Oil for Joint Pains: కీళ్ల నొప్పులు తగ్గించే.. మ్యాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిల్స్‌ ఇవే..!

Oil for Joint Pains:  కండరాలు, కీళ్ల నొప్పులు వేధిస్తుంటే.. సరిగ్గా నడవలేం, కూర్చోలేం, లేచి నిలబడటానికి కూడా కష్టంగా ఉంటుంది.  ఆయుర్వేద డాక్టర్‌ కపిల్‌ త్యాగి కీళ్ల నొప్పులు తగ్గించే మ్యాజికల్‌ ఆయిల్స్‌ గురించి మనకు వివరించారు. 

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 28 Mar 2023, 9:01 am
Oil for Joint Pains: నొప్పుల కారణంగా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. శీతాకాలం ముగుస్తోంది.. వేసవి కాలం ప్రారంభం కానుంది. ఈ సీజన్‌లో చాలా మంది కండరాలు, కీళ్ల నొప్పుల గురించి ఎక్కువగా కంప్లైంట్‌ చేస్తూ ఉంటారు. కండరాల నొప్పి తరచుగా ఛాతీ, ఉదరం, వీపు, అంత్య భాగాలను ప్రభావితం చేస్తుంది. ఈ కాలంలో తరచుగా భుజాలు, మోచేతులు, మణికట్టు, వేళ్లు, మోకాలు, చీలమండల దగ్గర కీళ్లు నొప్పి ఎక్కువగా ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి.. ఫిజియోథెరపీ, నొప్పి నివారణలు, హాట్ ప్యాక్‌లు వంటి అనేక వైద్య చికిత్సలు ఉన్నాయి. కానీ కొన్నిసార్లు ఇవి కూడా అంతగా ఉపశమనం ఇవ్వవు. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇచ్చే ఆయిల్స్‌ గురించి ఆయుర్వేద డాక్టర్‌ కపిల్‌ త్యాగి మనకు వివరించారు. (Dr. Kapil Tyagi, director of 'Kapil Tyagi Ayurveda Clinic', located at E-260 Sector 27, Noida).
Samayam Telugu ayurvedic doctor dr kapil tyagi suggests oils to give relive from joint and muscles pain
Oil for Joint Pains: కీళ్ల నొప్పులు తగ్గించే.. మ్యాజికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయిల్స్‌ ఇవే..!

కీళ్లు కండరాల నొప్పులతో వృద్ధులే కాకుండా పిల్లలు, యువకులు కూడా బాధపడుతున్నారని డాక్టర్‌ కపిల్‌ త్యాగి అన్నారు. లైఫ్‌స్టైల్‌ మార్పులు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక శ్రమలేకపోవడం, ఎక్కువసేపు కూర్చోవడం, పాత గాయం, వాతావరణ మార్పుల కారణంగా ఈ సమస్యలు ఎదురువుతాని అన్నారు. కీళ్లు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి ఆయుర్వేదంలో కొన్ని నూనెలు సహాయపడతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.

నువ్వుల నూనె..

కీళ్ల నొప్పులను తగ్గించడానికి మార్కెట్‌లో లభించే బామ్‌లు, నూనెలు, మందులు చాలా ఖరీదు ఉంటాయని, వాటిని ఎక్కువగా వాడితే సైడ్‌ఎఫెక్ట్స్‌ ఎదుర్కోవలసి ఉంటుందని డాక్టర్‌ కపిల్‌ త్యాగి‌ అన్నారు. మీరు కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులతో బాధపడుతుంటే.. నువ్వుల నూనె అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. నువ్వుల నూనెను వేడి చేసి.. గురవెచ్చగా అయిన తర్వాత.. రోజుకు రెండు సార్లు నొప్పిగా ఉన్న ప్రాంతంలో ఈ నూనెను రాయండి. రాత్రి నిద్రపోయేముందు.. ఈ నూనె రాసుకున్నా మీకు నొప్పుల నుంచి ఉపశమనం పొందండి.

నారాయణ్ ఆయిల్‌..

నారాయణ్ ఆయిల్‌ కీళ్ల , కండరాల నొప్పులకు దివ్యౌషధంలా పనిచేస్తుంది. మీరు నొప్పి నుంచి చౌకగా ఉపశమనం పొందాలనుకుంటే, ఈ నూనె చాలా బాగా పనిచేస్తుంది. నారాయణ్ తైలం, బాలా తైలం సమపాళ్లలో తీసుకుని కొంచెం వేడి చేయండి. రాత్రి నిద్రపోయే ముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న చోట.. ఈ నూనెను మసాజ్‌ చేస్తే నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.


Also Read: ఇవి తీసుకుంటే.. కీళ్ల నొప్పులు వెంటనే తగ్గుతాయ్‌..!

ఆముదం..

ఆముదాన్ని ఆయుర్వేదంలో గొప్ప ఔషధంగా పరిగణిస్తారు. మీరు నొప్పి నుంచి ఉపశమనం పొందడానికి, 14 మి.లీ ఆముదంలో ఒక గ్రాము రావి వేరు వేసి చిన్న మంట మీద పెట్టండి. రాత్రి నిద్రపోయే ముందు ఈ మిశ్రమాన్ని నొప్పి ఉన్న చోట రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

అల్లం, వెల్లుల్లి వేసిన నూనె..

నువ్వుల నూనె ఎలాంటి నొప్పినైనా మాయం చేసే గొప్ప ఔషధం. నూవ్వుల నూనెలో శొంఠి, వెల్లుల్లి వేసి బాగా మరిగించాలి. వీటి సారం నూనెలోకి దిగిన తర్వాత మంట ఆఫ్ చేయండి. రాత్రి నిద్రపోయేముందు గోరువెచ్చని నూనెను నొప్పిగా ఉన్న ప్రాంతంలో మసాజ్‌ చేయండి. మీకు కచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.

Also Read: సింపుల్‌ టిప్స్‌తో.. కీళ్ల నొప్పులు మాయం..!

ఆముదం ఆకులు..

ఆముదం నూనె వలె.. ఆముదం ఆకు కూడా పెయిన్‌ కిల్లర్‌లా పనిచేస్తుంది. మీకు కీళ్ల నొప్పు వేధిస్తుంటే.. ఆకుకు ఆముదం నూనె రాసి.. చిన్న మంటపై వేడి చేసి నొప్పి ఉన్న పాంతంలో కట్టండి. ఆ తర్వాత కొంత సమయం నడవండి. ఉదయానికి మీ నొప్పి మాయం అవుతుంది. (image source - pixabay)

కొబ్బరి నూనె..

కీళ్ల నొప్పులు, కండరాల నొప్పుల నుంచి ఉపశమనం ఇవ్వడానికి కొబ్బరి నూనె సహాయపడుతుంది. మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతుంటే.. కొబ్బరి నూనెను కొద్దిగా వేడి చేసి, దానిలో కొద్దిగా కర్పూరం పొడి, శొంఠి పొడి వేయండి. ఈ నూనెను మోకాళ్లకు పట్టించి మసాజ్‌ చేస్తే.. నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.