యాప్నగరం

Joint pains tips: సింపుల్‌ టిప్స్‌తో.. కీళ్ల నొప్పులు మాయం..!

అసమతుల్య జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. వర్షాకాలంలో కీళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద డాక్టర్‌ ఐశ్వర్య సంతోష్ కొన్ని సూచనలు చేశారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను ప్రయత్నించవచ్చని అంటున్నారు. (Joint pains tips)

Authored byరాజీవ్ శరణ్య | TOI.in 29 Jul 2022, 1:32 pm
గతంలో 60 ఏళ్లు దాటిన తర్వాత కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈరోజుల్లో చిన్న వయసు వారు ఈ సమస్యలు స్టార్ట్‌ అవుతున్నాయి. ఈ సమస్య ఉంటే.. లేస్తే కూర్చోలేరు, కూర్చుంటే లేవలేరు. అసమతుల్య జీవనశైలి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చిన్నవయసులోనే కీళ్లనొప్పుల సమస్యలు ఎదురవుతున్నాయి. వర్షాకాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువగా ఉంటాయి. ఆర్థరైటిస్ సమస్య ఉంటే, ఈ నొప్పి మరింత తీవ్రంగా ఉంటుంది. ఈ సీజన్‌లో తేమ వల్ల కీళ్ల నొప్పులు మొదలవుతాయి. చల్లని వాతావరణం కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ స్థాయిలు, వాతావరణ పీడనం, ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పుల కారణంగా.. వర్షాలు ప్రారంభమైన వెంటనే చాలా మందికి కీళ్ల నొప్పులు బాధిస్తాయి. కండరాలు గట్టిపడటం వల్ల.. ఈ నొప్పులు మరింత ఎక్కువవుతాయి. మారుతున్న వాతావరణం.. కీళ్ల నొప్పులకు మధ్య సంబంధం ఉంటుందని వైద్యులు అంటున్నారు. చల్లని వాతావరణం మీ కీళ్లపై చాలా ఒత్తిడిని కలిగిస్తుంది. తేమ ఎక్కువగా ఉంటే రక్తం చిక్కగా అవుతుంది. ధమనులలో రక్తపోటు పెరుగుతుంది. రక్తాన్ని పంపిణీ చేయడానికి శరీరం కష్టపడాల్సి ఉంటుంది. కీల్ల చుట్టూ ద్రవం సాంద్రత తగ్గుతుంది. దీని వల్ల నొప్పి మరింత ఎక్కువగా ఉంటుంది. (Joint pains tips)
Samayam Telugu joint pains


వర్షాకాలంలో కీళ్లు ఆరోగ్యంగా, దృఢంగా ఉంచుకోవడానికి ఆయుర్వేద డాక్టర్‌ ఐశ్వర్య సంతోష్ కొన్ని సూచనలు చేశారు. కీళ్ల నొప్పులు తగ్గించే కొన్ని చిట్కాలను ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో షేర్‌ చేసుకున్నారు. వర్షాకాలంలో వాత దోషం పెరుగుతుందని, దీనివల్ల కీళ్ల నిప్పులు పెరుగుతాయని డా. ఐశ్వర్య వివరించారు. కీళ్ల నొప్పులను తగ్గించడానికి కొన్ని ఆయుర్వేద పద్ధతులను ప్రయత్నించవచ్చని అంటున్నారు.
View this post on Instagram A post shared by Dr.Aiswarya Santhosh, Ayurveda doctor (@ayurvedic_healing)

మీ ఆహారంలో ఇవి తీసుకోండి..

వర్షాకాలంలో కీళ్ల నొప్పులు ఇబ్బంది పెడుతుంటే.. మన ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవాలని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఆహారంలో మెంతులు, అల్లం, పసుపును చేర్చుకోవాలని డా. ఐశ్వర్య సంతోష్‌ అన్నారు. తీపి, పులుపు, ఉప్పు రుచులను ఎక్కువగా తీసుకోవాలని సూచించారు. పొడిగా ఉన్నవి, చల్లని ఆహారానికి దూరంగా ఉండండి.
మాసాజ్‌ చేయండి..

వర్షాకాలంలో కీళ్ల నొప్పులు నుంచి ఉపశనమం పొందాలంటే.. రోజూ గోరువెచ్చని నువ్వుల నూనెతో మాసాజ్‌ చేసుకోండి. దీనితో పాటు, రోజూ వేడి నీటితో స్నానం చేయండి. వేడి నీటి స్నానం నొప్పుల నుంచి ఉపశమనం ఇస్తుంది.
ఆహారం వేడిగా తినండి..

వర్షాకాలంలో తేమ ఎక్కువగా ఉండటం, చల్లగా ఉండడం వల్ల కీళ్ల నొప్పులు ఎక్కువగా వస్తాయి. మీరు చల్లని ఆహారం తీసుకుంటే.. శరీరంలో వాత దోషం పెరుగుతుంది. వర్షాకాలంలో వేడి వేడి ఆహారం తీసుకోవాలని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ఈ కాలంలో వేడి నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదని అంటున్నారు. మీ ఆహారాన్ని నెయ్యి, నువ్వుల నూనెతో తయారు చేసుకుంటే ఆరోగ్యానికి మేలు జరుగుతుందని డా. ఐశ్వర్య సంతోష్‌ అన్నారు.
వ్యాయామం చేయండి..

తేలికపాటి వ్యాయామం, కీళ్ల నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుందని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. మీరు మెట్లను ఎక్కడం కూడా.. ఓ వ్యాయామంలా ఉంటుంది. కానీ ఎక్కువ సార్లు మెట్లు ఎక్కకుండా జాగ్రత్తపడండి. అధిక శ్రమ వల్ల కూడా కీళ్ల నొప్పులు వచ్చే అవకాశం ఉంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.