యాప్నగరం

చెప్పుల్లేకుండా... ఉత్త పాదాలతో నడవండి...

నడక ఆరోగ్యానికి చాలా మంచిదని మనకి తెలుసు. మార్నింగ్ వాకింగ్ పేరుతో షూ వేసుకుని నడుస్తారంతా...

TNN 15 Jul 2016, 12:35 pm
నడక ఆరోగ్యానికి చాలా మంచిదని మనకి తెలుసు. మార్నింగ్ వాకింగ్ పేరుతో షూ వేసుకుని నడుస్తారంతా... కానీ షూ, చెప్పులు వేసుకోకుండా కూడా అప్పుడప్పుడు నడవండి... మీ శరీరానికి ఇదెంతో ఆరోగ్యాన్నిస్తుంది. ఇక్కడా... అక్కడా అని తేడాలేదు... పచ్చని పచ్చికపై, మెత్తని ఇసుకపై, మట్టిపై ఇలా అన్ని చోట్లా ఉత్తపాదాలతో అప్పుడప్పుడూ నడుస్తూ ఉండాలి. ఆ నడక నేరుగా మెదడుపై ప్రభావాన్ని చూపిస్తుందట. ఒక అధ్యయనం ద్వారా ఈ విషయం తెలిసింది. భూమిలో ఉండే ఎలక్ట్రాన్స్ మన శరీరంలోని యాంటీ ఆక్సిడెంట్లను ప్రభావితం చేస్తాయట. అందుకే ఒత్తిడి తగ్గించుకోవడానికి, హాయిగా నిద్ర పోవడానికి నేల మీద నడక ఉపయోగపడుతుంది. నేలపై అంటే ఇంట్లో సిమెంటు రోడ్లపైనా, పాలరాతి ఫ్లోర్లపైనా కాదు... చక్కటి ప్రకృతిలో మట్టిలో, గడ్డిపైనా నడవండి. మీకు కూడా చాలా హాయిగా అనిపిస్తుంది.
Samayam Telugu benefits of bare foot walk
చెప్పుల్లేకుండా... ఉత్త పాదాలతో నడవండి...


సిటీ జీవితంలో మట్టి, గడ్డి నేలని వెతుక్కోవడం కష్టమే. కనుక రోజూ అలా నడవలేకపోతే... వారానికోసారైనా పార్కులకి వెళ్లి నడవండి. పార్కల్లో ఇంకా మట్టినేలలు ఉంటున్నాయి. అరికాలు మంటలు తగ్గడం, మోకాళ్ల నొప్పులు తగ్గడం వంటి లాభాలు కలుగుతాయి. అయితే కండరాల బలహీనత, మధుమేహం ఉన్న వారు మాత్రం ఈ నడకకు దూరంగా ఉంటే మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.