యాప్నగరం

ఖర్జూరాలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?

ఖర్జూర పండ్లంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. అయితే, వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూసేయండి మరి.

Samayam Telugu 23 Jul 2020, 6:27 pm
కరోనా కాలంలో రోగ నిరోధక శక్తి(ఇమ్యునిటీ) పెంచుకోవడం ఎంతో ముఖ్యం. మంచి ఆరోగ్యం, ఇమ్యునిటీ పెరగాలంటే.. మీరు తప్పకుండా ఖర్చూరాలను తీసుకోండి. ఈ పండు.. ఇన్ఫెక్షన్లను తట్టుకునే వ్యాధి నిరోధక శక్తిని అందిస్తుంది. విటమిన్ C, B 5, ఐరన్, ఫ్లేవనాయిడ్లు, యాంటీఆక్సిడెంట్లు తదితర పోషకాలు ఖర్జూరాల్లో ఉన్నాయి. చర్మం, మెదడు, ఎముకలు, జుట్టు ఆరోగ్యానికి ఖర్జూరాలు చాలా మంచివి. పలు ఔషదాల్లో కూడా వీటిని ఉపయోగిస్తున్నారు. ఖర్జూరాలతో మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు శరీరానికి అందుతాయి. అవేంటో చూసేద్దామా మరి.
Samayam Telugu ఖర్జూరాలు తింటే రోగ నిరోధక శక్తి పెరుగుతుందా?


✺ ఖర్జూరం శరీరంలోని కొవ్వును తగ్గించి గుండె ఆరోగ్యంగా ఉండేందుకు సహకరిస్తుంది.
✺ రక్తపోటు సమస్య ఉండదు.
✺ ఎముకలలో పటుత్వాన్ని పెంచుతుంది.
✺ ఉదర సంబంధ వ్యాధులను ఈ పండ్లు అరికడతాయి.
✺ గర్భిణీలకు ఖర్జూరం చాలా మంచిది.
✺ గర్భిణీలు ప్రసవానికి ముందు నాలుగు వారాలు రోజుకు 4 ఖర్జూరాల చొప్పున తింటే ప్రసవం సులువుగా అవుతుంది.
✺ ఖర్జురాలు తింటే కంటి చూపు మెరుగవుతుంది.
✺ వేసవిలో ఖర్జూరాలను నీటిలో నానబెట్టి, ఉదయాన్నే ఆ నీటిని తాగితే వడదెబ్బ తగలదు.
✺ ఖర్చూరాల్లోని టానిన్ పెద్ద పేగు సమస్యలను పరిష్కరిస్తుంది.
✺ ఖర్జూరాల గుజ్జుతో జలుబు, శ్లేష్మం, గొంతునొప్పి త్వరగా తగ్గిపోతాయి.

Read Also: చైనా ఫుడ్.. మనిషిని తప్ప అన్నీ తింటారు, ఎందుకో తెలిస్తే షాకవుతారు!

✺ కిడ్నీలోని రాళ్ళను కరిగించే శక్తి ఖర్జూరాలకు ఉంది.
✺ ఖర్చూరం యూరినల్ ఇన్ఫెక్షన్లలను నియంత్రిస్తుంది.
✺ మలబద్ధకం, ఉదర క్యాన్సర్, విరేచన సమస్యలు ఉంటే ఖర్జూరం తీసుకోండి.
✺ ఖాళీ కడుపుతో ఖర్జూరాలు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.
✺ పరగడపున ఖర్జూరాలు తినడం వల్ల పేగుల్లోని పరాన్నజీవులను నాశనమవుతాయి.
✺ ఖర్జూరాలు కాలేయాన్ని శుభ్రం చేస్తాయి.
✺ ముఖం మీద ముడతలు ఏర్పడే అవకాశాలను తగ్గిస్తాయి.

Read Also: కుక్కలను బతికుండగానే ఉడికించి సూప్ తయారీ.. చైనాలో కాదు!

✺ ఖర్జురాలు తలలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. దీని వల్ల చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.
✺ లైంగిక సమస్యలు ఉన్నవారు రోజూ ఉదయం వేళల్లో ఖర్జూరం తినడం మంచిది.
✺ ఖర్జూరాలు రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా నిరోధిస్తాయి.
✺ ఖర్జూరాలు విటమిన్లు, అమైనో ఆమ్లాలు, ఖనిజాలతో నిండి ఉంటాయి
✺ ఖర్జూరాలను తినడం వల్ల మెదడు కణాలు ఆరోగ్యకరంగా ఉంటాయి.
✺ ఖర్జూరాల్లోని పొటాషియం కాంపోనెంట్స్ నాడీ వ్యవస్థను బలోపేతం చేస్తాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.