యాప్నగరం

చెరకు రసంతో సన్నగా మారొచ్చు...

సహజ సిద్ధంగా దొరికే తీయని రసం చెరకు రసం.

TNN 8 May 2017, 4:09 pm
తీయని చెరకు రసాన్ని ఇష్టపడని వారెవరు?.. అందులోనూ వేసవిలో మరీ ఇష్టంగా తాగేస్తారు. సహజ సిద్ధంగా దొరికే తీయని రసం చెరకు రసం. ఇందులో ఉండే సుగుణాలు ఇన్నీ అన్నీ కావు. బరువును అదుపులో ఉంచాలనుకునేవారికి చెరకు రసం చాలా మంచిది. శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో ఇది ముందుంటుంది. వ్యర్థాలు బయటికి పోకపోతే... అవి చెడు కొలెస్ట్రాల్ గా మారి శరీరంలోనే తిష్టవేస్తాయి. దీనిని బరువు పెరుగుతారు. అందుకే వాటిని ఎప్పటికప్పుడు బయటికి పంపించడం చాలా ముఖ్యం. లేకుంటే అనేక రకాల అనారోగ్య సమస్యలు కూడా చుట్టుముడతాయి. రోజూ చెరకు రసాన్ని ఎంతో కొంత తాగితే మంచిది. చెరకు రసంలో నిమ్మరసం కలుపుకుని తాగితే మరీ మంచిది.
Samayam Telugu benefits with sugarcane juice
చెరకు రసంతో సన్నగా మారొచ్చు...


వేసవిలో ఎండలు బాగా మండిపోతున్నాయ్. బయటికి వెళ్లొచ్చాక ఓ గ్లాసు చెరకు రసం తాగితే వెంటనే శక్తి అందుతుంది. ప్రాణానికి కూడా హాయిగా ఉంటుంది. ఎండలో తిరిగొచ్చిన అలసట కూడా వెంటనే తగ్గుతుంది. మూత్రనాళ ఇన్ఫక్షన్ కూడా తగ్గుతుంది. వ్యాధినిరోధక శక్తి కూడా బాగా పెరుగుతుంది. క్రోమియం, జింక్, మెగ్నీషియం వంటి ఖనిజాలు ఇందులో పుష్కలంగా లభిస్తాయి. చెరకు రసంలో ఐరన్ శాతం, ఫోలిక్ ఆమ్లం అధికంగా ఉంటుంది. గర్భిణులు చెరకు రసాన్ని తరచూ తాగుతుంటే శిశువుకు చాలా మంచిది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.