యాప్నగరం

ఇలా చేస్తే గుండె నొప్పులు వస్తాయట.. జాగ్రత్త..

ఆరోగ్యకరమైన జీవనం విషయానికి వస్తే, మనం చూడ్డానికి ఎలా ఉన్నామో మాట్లాడతాం. కానీ, నిపుణుల అభిప్రాయం ప్రకారం, అంతర్గతంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి.

Samayam Telugu 25 Feb 2022, 10:02 am
అధ్యయనాల ప్రకారం, బ్రకోలి, మొలకలు, క్యాబేజీ వంటి కూరగాయలను తింటే రక్తనాళాల సమస్యని నివారించవచ్చు.
Samayam Telugu best heart friendly foods to eat know here list
ఇలా చేస్తే గుండె నొప్పులు వస్తాయట.. జాగ్రత్త..



​రక్త నాళాల వ్యాధి

రక్తనాళ వ్యాధి అనేది మన రక్త నాళాలను ప్రభావితం చేసే సమస్య. శరీరం చుట్టూ ప్రసరించే రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. మన రక్తనాళాల లోపలి గోడలపై కొవ్వు, కాల్షియం నిల్వలు పేరుకుపోవడం వల్ల రక్త ప్రవాహంలో ఈ తగ్గుదల ఏర్పడుతుంది. కొవ్వు, కాల్షియం పేరుకుపోవడం గుండెపోటు, స్ట్రోక్‌కి ప్రధాన కారణం.

​గుండెనొప్పులు ఎందుకంటే..

శరీరంలో గుండె అతి ముఖ్యమైన భాగం. ఇది మనిషి శరీరంలో ఎడమవైపున ఛాతీ భాగంలో ఉంటుంది. దీనిలో నాలుగు గదులు ఉంటాయి. పైన ఉన్న రెండు గదులను ఆరికల్స్ లేదా ఆట్రియా (auricles or atria) అంటారు. క్రింది భాగంలో ఉన్న గదులను వెంట్రికల్స్ (ventircles)అంటారు. గుండె లోపల ఎడమ మరియు కుడి ఆరికల్స్ మరియు వెంట్రికల్స్‌ను కండరాలు కలిగిన గోడ విభజిస్తుంది. ఆరికల్స్ యొక్క గోడలు వెంట్రికల్స్ యొక్క గోడల కంటే మందంగా ఉంటాయి. ఈ గోడలలో మూడు పొరలు ఉంటాయి. గుండె వెలుపల వైపున ఉండే పొరను పెరికార్డియం (peri cardium) అంటారు. గుండె లోపలి వైపున ఉండే పొరను ఎండోకార్డియం (endo cardium) అంటారు.

Also Read : తను చెప్పిందని ఉద్యోగం వదిలేశా.. చివరికీ..

ఈ రెంటికి మధ్యలో ఉండే పొరను మయోదార్డియం అంటారు. ఈ పొర కండరాలతో తయారుచేయబడి ఉంటుంది. ఈ కండరాలు ఇతర శరీర కండరాలలా కాకుండా ఏ విధమైన నాడీ సంబంధమైన ప్రేరేపణ లేకుండా సంకోచ వ్యాకోచాలు జరుపుతాయి. రక్తం ఎప్పుడూ గుండెలో ఆరికల్స్ నుండి వెంట్రికల్స్‌కు ప్రవహిస్తూ ఉంటుంది. ఈ విధంగా రక్తం ఒకే దిశలో ప్రవహించడానికి వీలుగా ఆరికల్స్ మరియు వెంట్రికల్స్ మధ్య కవాటాలు ఉంటాయి. ఒక క్రమపద్దతిలో సంకోచ వ్యాకోచాలు జరపడం వల్ల రక్తం అన్ని అవయవాలకు సరఫరా అవుతుంది. ఒకవేళ గుండె కాని రక్తనాళాలు గాని సరిగ్గా పనిచేయనప్పుడు గుండె జబ్బులు వస్తాయి.

​ఏ వయసులో..

ఈ వ్యాధులు ఏ వయస్సులో అయినా రావచ్చు. కాని ఇవి ఎక్కువగా మధ్య వయస్సులో వస్తాయి. గుండె జబ్బుల వల్ల గుండెలో పెరీకార్డియం, మయోకార్డియం లేదా ఎండోకార్డియం దెబ్బతినవచ్చు. అంతేకాక గుండెలోపలి రక్తనాళాలు లేదా గుండె కవాటాలు దెబ్బ తినడం వల్ల కూడా ఈ జబ్బులు రావచ్చు. కానీ హార్ట్ ఎటాక్ అన్నిసార్లు ప్రాణాంతకం కాదు. కొన్నిసార్లు ఇవి పూర్తిగా తగ్గిపోవచ్చు. కొన్నిసార్లు అవే చాలా తీవ్రస్థాయిని పొందవచ్చు. చాలాసార్లు ఈ జబ్బులు ఆర్టరీల గోడలు గట్టిపడి వాటి ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల వస్తాయి.

​అధ్యయనాల ద్వారా..

1998లో జరిగిన పరిశోధన ప్రకారం కూరగాయలు తిననివారిలో సమస్య ఎక్కువగా ఉంటుంది. కూరగాయలతో బెనిఫిట్స్ ఉంటాయని తేలింది. మా ముందు అధ్యయనాలలో, ఈ కూరగాయలను ఎక్కువగా తీసుకునే వారికి గుండెపోటు, స్ట్రోక్ వంటి కార్డియోవాస్కులర్ సమస్యలు వచ్చే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు. ప్రతిరోజుకూరగాయలను ఎక్కువ మొత్తంలో తినే వృద్ధ మహిళలు ఆరోగ్యంగా ఉన్నట్లు ఈ పరిశోధనలో తేలింది. కూరగాయలలో పుష్కలంగా కనిపించే ఒక ప్రత్యేక భాగం విటమిన్ K, ఇది కాల్సిఫికేషన్ ప్రక్రియను నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ అధ్యయనంలో ప్రతిరోజూ 45 గ్రాముల కంటే ఎక్కువ కూరగాయలను తినే స్త్రీలు తక్కువగా తినే వారితో పోల్చితే కాల్షియం విస్తృతంగా పేరుకుపోయే అవకాశం 46 శాతం తక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.

Also Read : ఈ రత్నాన్ని ధరిస్తే ఆస్తులు ఎక్కువగా సంపాదిస్తారట..

బ్రొకోలీ, క్యాబేజీ మరియు బ్రస్సెల్స్ మొలకలు మాత్రమే మనం తినవలసిన కూరగాయలు అని చెప్పలేం. మొత్తం మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు కోసం మనం ప్రతిరోజూ అనేక రకాల కూరగాయలను తినాలి.

​చివరగా..

"ఈ అధ్యయనం ద్వారా మన ధమనుల ఆరోగ్యానికి మరియు అంతిమంగా మన గుండెకు ఎలా దోహదపడుతుందనే దానిపై తెలుస్తుంది. ఆస్ట్రేలియాలో గుండె జబ్బులు మరణానికి ఏకైక ప్రధాన కారణం మరియు గుండె భారం యొక్క అత్యధిక నిష్పత్తికి ఆహారపు అలవాట్లు. వ్యాధి, గుండె జబ్బుల మొత్తం భారంలో 65.5 శాతంగా ఉంది. ఆస్ట్రేలియన్లు తమ రోజువారీ ఆహారంలో పండ్లు, సీఫుడ్, లీన్ మీట్‌లు, డైరీ,గింజలు మరియు గింజలలో ఉండే ఆరోగ్యకరమైన నూనెలతో పాటు కనీసం ఐదు రకాల కూరగాయలను చేర్చుకోవాలని హార్ట్ ఫౌండేషన్ సిఫార్సు చేస్తోంది.

Also Read : పెళ్ళైన్నా తను ముట్టుకోవడం లేదు.. ఏం చేయను..

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.