యాప్నగరం

ఎర్ర చందనం విత్తనాలు బ్రెస్ట్ క్యాన్సర్ తగ్గిస్తాయా?

మహిళలను వేధించే బ్రెస్ట్ క్యాన్సర్‌ కణాలను తొలగించే లక్షణాలు ఎర్ర చందనం విత్తనాల్లో ఉన్నాయని బీహార్‌కు చెందిన పరిశోధకుడు పేర్కొన్నారు.

Samayam Telugu 10 Sep 2020, 10:23 pm
హిళలను వేధించే సమస్య బ్రెస్ట్ క్యాన్సర్ లేదా రొమ్ము క్యాన్సర్. ప్రస్తుతం టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఈ క్యాన్సర్‌ను ముందుగానే గుర్తించి.. వైద్యులు మహిళల ప్రాణాలు కాపాడుతున్నారు. అయితే, మహిళల్లో ఈ సమస్యను ఆదిలోనే అంతం చేసుందుకు అవసరమైన ఔషదాలు అందుబాటు లేవు. ఆదిలోనే దీన్ని గుర్తించి అంతం చేయడం ఒక్కటే మార్గం. ఈ నేపథ్యంలో బీహార్‌కు చెందిన ఓ యువ పరిశోధకుడు చేపట్టిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు తెలిశాయి.
Samayam Telugu Breast Cancer


ఎర్ర చందనం విత్తనాల్లో యాంటీ-బ్రెస్ట్ క్యాన్సర్‌ను ఎదుర్కొనే లక్షణాలు ఉన్నాయని గుర్తించారు. ఈ స్టడీకి సంబంధించిన వివరాలను అమెరికాకు చెందిన SAGE అనే యూఎస్ జర్నల్‌లో ప్రచురించారు. బీహార్లోని గయాలో గల మగద్ యూనివర్శిటీకి చెందిన 29 ఏళ్ల వివేక్ అకౌరీ ఈ పరిశోధన చేపట్టారు. బయోటెక్నాలజీ మాస్టర్స్ పూర్తి చేసిన వివేక్.. ‘బ్రెస్ట్ క్యాన్సర్: బేసిక్ అండ్ క్లినిక్ రీసెర్చ్’లో తన స్టడీకి సంబంధించి కీలక విషయాలనే పేర్కొన్నారు.

ప్టేరోకార్పస్ శాంటిలినస్ విత్తనాలు.. ఎలుకల్లోని డీఎంబీఏ ప్రేరేపిత రొమ్ము క్యాన్సర్‌పై వ్యతిరేకంగా పనిచేసినట్లు గురించామని తెలిపారు. ఈ నేపథ్యంలో మనుషుల్లో ఏర్పడే రొమ్ము క్యాన్సర్‌పై కూడా ఇవి సమర్థవంతంగా పనిచేయవచ్చని అభిప్రాయపడ్డారు. గతంలో నిర్వహించిన కొన్ని పరిశోధనల్లో చందనం చెట్ల ‘హార్ట్ ఉడ్’.. అంటే కాండం మధ్యలో ఉండే భాగంలో యాంటీ-క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు వెల్లడించారు. అయితే వివేక్ విత్తనాల్లోనే ఆ లక్షణాలు ఉన్నయని తెలుపుతున్నారు. విత్తనాలను ఉపయోగించడం వల్ల చెట్లను నరకాల్సిన అవసరం ఉండదన్నారు.

Read Also: బీర్ తాగితే.. శృంగారంలో రెచ్చిపోతారా? ఎంత మోతాదులో తీసుకోవాలి?

ఎలుకల్లో దీన్ని క్యాన్సర్ కణాలను ప్రవేశిపెట్టిన తర్వాత.. చందనం విత్తనాలను ప్రవేశ పెట్టగా.. 49.5 శాతం వరకు సత్ఫలితాలు చూపిందని వివేక్ తెలిపారు. ప్రస్తుతం ఇది ఇంకా ప్రయోగదశలోనే ఉందని, దీని వల్ల ఇంకా ఏమైనా సైడ్ ఎఫెక్ట్ ఏర్పడతాయో లేదో తెలుసుకోవల్సి ఉందని, వీటిని ఔషదంగా తయారు చేయడానికి ముందు కొన్ని క్లీనికల్ టెస్టులు కూడా నిర్వహించాల్సి ఉందన్నారు.

Read Also: శీఘ్ర స్కలనానికి కారణాలేమిటీ? ఈ టెక్నిక్స్ పాటిస్తే.. ‘ఫుల్’ ఎంజాయ్!

గమనిక: ఈ స్టడీ ఇంకా పరిశోధన దశలోనే ఉంది. ఇంకా దీన్ని మనుషులపై ప్రయోగించలేదు. కాబట్టి.. వైద్యుల సలహాలు, సూచనలు లేనిదే వీటిని ఉపయోగించరాదు. క్యాన్సర్‌ సందేహాలు ఉన్నట్లయితే.. వైద్యులను సంప్రదించి పరీక్షలు జరిపిన తర్వాత.. వారు సూచించిన ఔషదాలను మాత్రమే ఉపయోగించాలి. పైన పేర్కొన్న స్టడీ వివరాలు కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరని మనవి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.