యాప్నగరం

Broad beans Health Benefits: చిక్కుళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వదిలిపెట్టరు..!

Broad beans Health Benefits: శీతాకాలం వచ్చిందంటే.. చిక్కుళ్లు సందడి చేస్తాయి. చిక్కుళ్లు.. టేస్ట్‌లో మాత్రమే కాదు, వీటిలో పోషకాలు అద్భుతంగా ఉంటాయి. చిక్కుళ్లలో థయామిన్‌, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్‌ ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 13 Jan 2023, 6:40 pm
Broad beans Health Benefits: శీతాకాలం వచ్చిందంటే.. చిక్కుళ్లు సందడి చేస్తాయి. చిక్కుళ్లతో పొడికూర, వేపుడు, కూర, నిల్వ పచ్చడి, ఫ్రైడ్‌రైస్‌లో వేసుకుని చేసుకున్నా.. రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. చిక్కుళ్లు.. టేస్ట్‌లో మాత్రమే కాదు, వీటిలో పోషకాలు అద్భుతంగా ఉంటాయి. చిక్కుళ్లలో థయామిన్‌, విటమిన్ K, B6, కాపర్, సెలీనియం, ఐరన్, నియాసిన్, రిబోఫ్లావిన్, విటమిన్ సి, విటమిన్ A, కోలిన్, సోడియం, సెలీనియం, జింక్, పొటాషియం, మెగ్నీషియం, లీన్‌ ప్రోటీన్‌ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చిక్కుళ్లను మన డైట్‌లో చేర్చుకుంటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదివేయండి.
Samayam Telugu broad beans health benefits for heart patients and diabetes
Broad beans Health Benefits: చిక్కుళ్లతో ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే.. వదిలిపెట్టరు..!


పార్కిన్సన్స్ పేషెంట్స్‌కు మంచిది..

పార్కిన్సన్స్‌ వ్యాధి కారణంగా.. మెదడులో డోపమైన్‌ రసాయనాన్ని ఉత్పత్తి చేసే నాడీకణాలు సక్రమంగా పనిచేయకపోవటం, చనిపోవటం. సున్నితమైన, ఉద్దేశపూర్వకంగా చేసే కదలికలకు డోపమైన్‌ అత్యవసరం. ఇది లోపిస్తే కదలికలు అస్తవ్యవస్తమవుతాయి. చిక్కుళ్లలోని చిక్కుళ్లలో ఉండే ఎల్‌- డోపా అనే రసాయనం .. న్యూరోట్రాన్స్‌మిటర్‌గా పనిచేస్తుంది. పెద్దవారిలో పార్కిన్సన్స్‌ లక్షణాల నుంచి ఉపశమనం ఇస్తుంది. పార్కిన్సన్స్ వ్యాధి ఉన్నవారిలో ఫోలేట్స్ లోపం ఉన్నట్లు తేలింది. చిక్కుళ్లలో ఫోలెట్స్‌ ఎక్కువగా ఉంటాయి.

పుట్టుకలో లోపాలను నివారిస్తుంది..

చిక్కుళ్లోలో ఉండే.. బోలేట్‌ చిన్నపిల్లల్లో పుట్టుకతో వచ్చే లోపాలను నివారిస్తుంది. . కాబట్టి గర్భిణీ స్త్రీలు దీనిని తీసుకోవడం చాలా ముఖ్యం. చిక్కుడు గింజల్లో ఫొలేట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భస్థ శిశువు.. అవయవాలు, మెదడు అభివృద్ధి చెందడానికి తోడ్పడుతుంది. గర్భం ధరించిన తొలినాళ్లలో చిక్కుడు కాయలు తినడం వల్ల.. శిశువుకి న్యూరల్‌ ట్యూబ్‌ డిఫెక్ట్స్‌ రాకుండా ఉంటాయి. ప్రెగ్నెన్సీ సమయంలో చిక్కుళ్లు తింటే.. గర్భస్రావం, నెలలు నిండకుండానే పిల్లలు పుట్టడం, తక్కువ బరువుతో పుట్టుడాన్ని నివారిస్తుంది.

గుండెకు మంచిది..

చిక్కుళ్లలో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. మెగ్నీషియం రక్తపోటును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని కరిగే ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె జబ్బులను నివారిస్తుంది. చిక్కుళ్లు చెడు కొలెస్ట్రాల్‌ స్థాయిని తగ్గిస్తాయి, మంచి కొలెస్ట్రాల్‌ స్థాయిని పెంచుతాయి. ఇది గుండె గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

శక్తినిస్తుంది..

మన శరీరానికి శక్తిని ఇవ్వాడానికి విటమిన్‌ బి చాలా అవసరం. చిక్కుళ్లలో ఐరన్‌ పుష్కలంగా ఉంటుంది, ఇది ఎర్ర రక్త కణాలు ఉత్పత్తికి, శక్తి ఇవ్వడానికి సహాయపడుతుంది. రక్తహీనతను దూరం చేస్తుంది. ఎప్పుడు నీరసంగా, నిస్సత్తువుగా ఉండే వారు.. వారి డైట్‌లో చిక్కుళ్లు చేర్చుకుంటే మంచిది. (image source - pixabay)

ఆస్టియోపోరసిస్‌ నివారిస్తుంది..

చిక్కుళ్లలో ఉండే మాంగనీస్‌ ఎముకల సాంద్రతను పెంచుతుంది. ఇది ఎముకలను ధృఢంగా ఉంచుతుంది. ఆస్టియోపోరోసిస్‌ వంటి ఎముకల వ్యాధులను నివారించడానికి చిక్కుళ్లు సహాయపడతాయి. కాల్షియం లోపాన్ని దూరం చేసి ఎముకలను బలోపేతం చేస్తాయి.

ఇమ్యూనిటీ పెరుగుతుంది..

చిక్కుళ్లలో ఉండే రాగి ఆరోగ్యకరమైన తెల్ల రక్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది మన రోగనిరోధక శక్తిని పెంచుతుంది వ్యాధులతో పోరాడటానికి సహాయపడుతుంది. ఫ్రీ రాడికల్స్ వంటి ఆక్సీకరణ ఒత్తిడి నుంచి కణాలను రక్షిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారం ఇది. మనలో రోగ నిరోధకశక్తిని పెంచుతుంది.(image source- pixabay)

షుగర్‌ కంట్రోల్‌లో ఉంటుంది..

షుగర్‌ పేషెంట్స్‌ చిక్కుళ్లని ఆహారంలో చేర్చుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. వీటిల్లో ఐరన్‌, కాల్షియం అధికంగా ఉంటాయి.

జీర్ణసమస్యలకు చెక్‌..

వీటిల్లో పీచు అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ సమస్యలను తగ్గించి.. గ్యాస్‌, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలు రాకుండా చూస్తుంది. దాంతో అధిక బరువు తగ్గుతుంది.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.