యాప్నగరం

Diabetes on Vision : షుగర్ వ్యాధి ఉంటే కళ్ళు సరిగ్గా కనపడవా..

Diabetes on Vision : ఇండియాలో కళ్ళు కనపడకపోవడానికి కారణాలలో మధుమేహం కూడా ఒకటిగా మారుతోంది. ఎందుకంటే డయాబెటిస్ ఉన్న వ్యక్తి కళ్ళు, మూత్రపిండాలు, నాడీ వ్యవస్థ వంటి వివిధ శరీర అవయవాలకు సంబంధించిన డయాబెటిక్ సమస్యలకు గురయ్యే అవకాశం ఉంది. డయాబెటిస్ అనేది సంక్లిష్టమైన జీవక్రియ వ్యాధిని సూచిస్తుంది. ఇది ఇన్సులిన్‌ని ఉత్పత్తి చేసే ప్యాంక్రియాస్ శక్తిని తగ్గిస్తుంది. ఫలితంగా రక్తంలో చక్కెర అధిక స్థాయిలో ఉంటుంది. మీ కళ్ళ వెనుక ఉన్న చిన్న రక్తనాళాలు అధిక రక్తంలో చక్కెర స్థాయిల వల్ల కాలక్రమేణా దెబ్బతింటాయి. నాళాల ద్రవం లీకేజ్ వాపు, హై ప్రెజర్ ఇతర సమస్యలకు దారి తీస్తుంది.

Produced byరావుల అమల | Samayam Telugu 14 Oct 2022, 2:08 pm
డయాబెటిక్ రెటినోపతి అనేది షుగర్ వ్యాధి వల్ల వచ్చే అధిక రక్తపోటు రెటినాస్‌పై ప్రభావం చూపి దానిని దెబ్బతీసినప్పుడు వస్తుంది. దెబ్బ తిన్న రక్త నాళాలు ఉబ్బి, లీక్ అయ్యే అవకాశం ఉంది. ఇది షుగర్ ఉన్నవారికి దృష్ఠి సరిగ్గా కనపడకుండా చేస్తుంది. రక్త ప్రవాహం ఆగిపోతుంది. కొన్ని సార్లు, ఇతర రక్తనాళాలు పెరుగుతాయి. కానీ, అవి సాధారణమైనవి కావు. రెండు కళ్ళలో మరింత దృష్ఠి సమస్యలకి కారణమవుతుందని సెంటర్ ఫర్ సైట్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ మహిపాల్ సింగ్ సచ్‌దేవ్ చెబుతున్నారు. షుగర్ ఉన్న వ్యక్తికి వచ్చే కంటి సమస్యలు ఇక్కడ ఉన్నాయి.
Samayam Telugu can diabetes affect your vision know here all details
Diabetes on Vision : షుగర్ వ్యాధి ఉంటే కళ్ళు సరిగ్గా కనపడవా..


​కాటరాక్ట్..

ఎవరికైనా కంటి శుక్లం సమస్యలు ఉన్నప్పటికీ, షుగర్ ఉన్న వ్యక్తికి ముందుగానే వస్తుంటాయి. వేగంగా పెరుగుతాయి. డయాబెటిస్ మెల్లిటస్ ప్రాబల్యం పెరగడం వల్ల కంటి శుక్లం సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఈ సమస్య గురించి ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలి. వీటి గురించి పూర్తి వివరాలు ముందుగానే వైద్యుడిని అడిగి తెలుసుకోవడం మంచిది.

Also Read : Cancer : ఈ తప్పులు చేయడం వల్లే క్యాన్సర్స్ వస్తున్నాయి.. జాగ్రత్త..

​గ్లకోమా..

దెబ్బతిన్న నరాలు, రక్త నాళాలు దృష్టి సమస్యలకి కారణమవుతాయి. కంటి ఒత్తిడి పెరగడానికి కారణమవతుంది. దీని వల్ల ద్రవం తప్పనిసరిగా తగ్గదు. గ్లకోమా అత్యంత సాధారణ రక్తాన్ని మందులు నయం చేయగలవు. ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు అసలు ఎందుకు వచ్చిందనే విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి. ఆ తర్వాత దానికి తగ్గట్లుగా జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.

Also Read : Vegetables : కూరగాయల్ని ఇలా వండితే విటమిన్స్ అలానే ఉంటాయట..

డయాబెటిక్ రెటినోపతి..

టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉంటే దృష్ఠి సమస్యలు వస్తుంటాయి. కంటి చూపులోని కీలకమైన రెటీనా దెబ్బతినడం వల్ల ఇది వస్తుంది. అందుకే మీకు ఏ డయాబెటిస్ ఉందో ముందుగా కనుక్కోవాలి. ఆ తర్వాత ఆ సమస్యని తగ్గించే జాగ్రత్తలు తీసుకోవాలి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే అడిగి తెలుసుకోవడం కూడా చక్కని పరిష్కారం.

Also Read : Heart Problems : ఇలా చేస్తే గుండెని ఆరోగ్యంగా ఉంచొచ్చట..

​మక్యులర్ ఎడెమా..

ఇది సాధారణంగా డయాబెటిక్ రెటినోపతితో కలిసి వస్తుంది. నాళాల గోడలలో చిన్న చిన్న వాపు కారణంగా కంటిలో ద్రవం, రక్తం కారడం వల్ల శాశ్వతంగా చూపు పోతుంది. కాబట్టి ముందు నుంచే ఎప్పటికప్పుడు ఈ సమస్య గురించి తెలుసుకోవడం మంచిదని చెబుతున్నారు నిపుణులు.

​సరిగ్గా కనిపించకపోవడం..

షుగర్ కూడా సరిగ్గా కిపించకపోవడానికి కారణమవుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలలో మార్పులు కంటి లెన్స్ ఆకారాన్ని ప్రభావితం చేస్తాయి. దీని వల్ల చూపు సరిగ్గా కనిపించదు.

గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.


రచయిత గురించి
రావుల అమల
ఆర్. అమల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకి జర్నలిజంలో 10 ఏళ్ళకు పైగా అనుభవం ఉంది. తను ఇప్పటివరకూ పలు మీడియా సంస్థల్లో న్యూస్, పొలిటికల్ సెటైర్, లైఫ్‌స్టైల్, సినిమా రివ్యూ కంటెంట్‌ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.