యాప్నగరం

Root vegetables For Diabetic Patients: షుగర్‌ పేషెంట్స్‌ దుంప కూరలు తినొచ్చా..?


Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 21 Jan 2023, 7:56 pm
Root vegetables For Diabetic Patients: ఈ ఆధునిక జీవనశైలిలో మార్పులు, పని ఒత్తిడి, చెడు ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది డయాబెటిస్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనాల ప్రకారం ప్రపంచంలో దాదాపు 422 మిలియన్ల మంది డయాబెటిస్ బారిన పడ్డారు. షుగర్ కారణంగా..ప్రతి సంవత్సరం 1.5 మిలియన్ల మంది మరణిస్తున్నారు. డయాబెటిస్ కారణంగా మనిషి సగటు ఆయుర్దాయం తగ్గిపోతుంది. డయాబెటిస్ను నియంత్రణలో ఉంచుకోకపోతే.. కిడ్నీ, గుండె, ఊపిరితుత్తులు, కంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. డయాబెటిక్ పేషెంట్స్ మెరుగైన జీవితం గడపడానికి.. మధుమేహాన్ని నియంత్రణలో ఉంచుకోవాలని నిపుణులు సిఫార్సు చేస్తున్నారు. డయాబెటిక్ పేషెంట్స్ ఆహారం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ పేషెంట్స్కు దుంపలు ఆహారంగా తీసుకోవచ్చా లేదా అనే అనుమానం ఉంటుంది. అసలు వాళ్లు దుంప కూరగాయలు తీసుకోవచ్చో లేదో ఈ స్టోరీలో చూసేద్దాం.
Samayam Telugu can diabetic patients eat root vegetables
Root vegetables For Diabetic Patients: షుగర్‌ పేషెంట్స్‌ దుంప కూరలు తినొచ్చా..?

దుంప కూరలు అంటే మొక్క అడుగుభాగంలో భూగర్భంలో పెరిగేవి. ఉల్లిపాయలు, సెలెరీ రూట్, అల్లం, పసుపు, బీట్రూట్, క్యారెట్లు, పార్స్లీ, చిలగడదుంపలు, బంగాళదుంపలు ఈ లిస్ట్లోకి వస్తాయి. ఇవి మిగిలిన మొక్కకు ఆహారం ఇవ్వడానికి.. నీరు, పోషకాలు గ్రహిస్తాయి. ఈ దుంప కూరలు మనం తీసుకున్నప్పుడు.. ఆ పోషకాలు మన శరీరం గ్రహిస్తుంది.


బీట్‌రూట్‌ తినొచ్చా..?

బీట్రూట్లో ఆల్ఫా లిపోయిక్ యాసిడ్ ఉంటుంది, ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను తగ్గిస్తుంది, ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది. ముఖ్యంగా, ఈ కూరగాయలలో సహజ చక్కెర కంటెంట్తో పాటు, ఫైబర్ అధిక మొత్తంలో ఉంటుంది. వీటన్నింటితో పాటు బీట్రూట్లో ఉండే పొటాషియం, ఫోలేట్ రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి. షుగర్ పేషెంట్స్ డౌట్ లేకుండా బీట్రూట్ తినొచ్చని నిపుణులు చెబుతున్నారు. (image source - pixabay)

క్యారెట్‌..

క్యారెట్లో ఎ, కె, బి6 విటమిన్లు, బయోటిన్, మినరల్స్, బీటా కెరొటిన్ గుణాలెక్కువ. దీన్ని రోజూ ఆహారంలో భాగం చేసుకుంటే డయాబెటిస్ ప్రమాదం ఉండదు. ఇది షుగర్ పేషెంట్స్ తిన్నా రక్తంలో చక్కెర స్థాయిలు కంట్రోల్లో ఉంటాయి. దీనిలో గ్రైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కు మేలు చేస్తుంది. (image source - pixabay)

ఉల్లిపాయ..

ఉల్లిపాయలో.. కేలరీలు తక్కువాగా ఉంటాయి. దీనిలో విటమిన్లు, మినరల్స్, ఫైబర్ మెండుగు ఉంటాయి. ఇందులో పోటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్త ప్రవాహంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల అయ్యేలా చేస్తుంది. అధిక రక్తంలో చక్కెర గ్లూకోజ్ని ఆక్సీకరణం చేసి ఫ్రీ రాడికల్స్ను ఏర్పరుస్తుంది. ఉల్లిపాయలలోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ను తగ్గించడంలో సహాయపడతాయి. ఇన్ఫ్లమేషన్ను తగ్గిస్తుంది. (image source - pixabay)

టర్నిప్‌..

టర్నిప్లో ఫైబర్, నీరు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది, పేగు పనితీరును మెరుగుపరుస్తుంది, కొలెస్ట్రాల్ను కంట్రోల్ చేస్తుంది. (image source - pixabay)
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.

రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.