యాప్నగరం

క్యాన్సర్ కణాలను చంపేస్తున్న.. ఉల్క లోహం!

ఒకప్పుడు భూమిపై డైనోసార్ల అంతానికి కారణమైన భారీ ఉల్క ఇప్పుడు.. మానవళిని పీడిస్తున్న క్యాన్సర్‌కు ఔషదంగా మారునుందా?

TNN 6 Nov 2017, 12:35 pm
కప్పుడు భూమిపై డైనోసార్ల అంతానికి కారణమైన భారీ ఉల్క ఇప్పుడు.. మానవళిని పీడిస్తున్న క్యాన్సర్‌కు ఔషదంగా మారునుందా? దీనిపై శాస్త్రవేత్తలు ఔననే సమాధానం ఇస్తున్నారు. 66 మిలియన్ ఏళ్ల కిందట చీక్సులాబ్ అనే భారీ ఉల్క భూమిని ఢీకొనడం వల్ల డైనోసార్లు అంతమైన సంగతి తెలిసిందే. ఆ ఉల్కలో ఉన్న ఇరీడియం అనే లోహానికి క్యాన్సర్ కణాలను చంపే గుణం ఉన్నట్లు తాజా పరిశోధనలో తేలింది.
Samayam Telugu cancer cells destroyed with dinosaur extinction metal
క్యాన్సర్ కణాలను చంపేస్తున్న.. ఉల్క లోహం!


బ్రిటన్‌లోని యూనివర్శిటీ ఆఫ్ వార్విక్‌కు చెందిన పరిశోధకుడు పీటర్ శాడ్లర్ మాట్లాడుతూ.. ‘‘ఉల్క ద్వారా భూమికి చేరిన ఇరీడియం లోహాన్ని 1803లో కనుగొన్నారు. ఈ లోహంతో తయారు చేసిన కాంపౌండ్‌ను క్యాన్సర్ రోగి శరీరంలోకి పంపితే.. అది నేరుగా క్యాన్సర్ కణాలపై దాడి చేసి చంపేస్తుంది. క్యాన్సర్ కణాలను టార్గెట్ చేసేందుకు వినియోగించే లేజర్ లైట్ చికిత్స.. ‘ఫొటోకెమోథెరఫీ’ ద్వారా ఈ కాంపౌండ్‌ను పంపవచ్చు’’ అని తెలిపారు.

పరిశోధకులు ల్యాబోరేటరీలో రూపొందించిన ఊపిరితీత్తుల ట్యామర్‌పై దీన్ని ప్రయోగించారు. ఈ సందర్భంగా క్యాన్సర్ కణాలు క్రమేణా శక్తిని కోల్పొవడాన్ని గుర్తించారు. శరీరంలో ఉండే ఆరోగ్యకరమైన కణాలకు ఎలాంటి నష్టం చేయకుండా అది కేవలం క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుందని పరిశోధకులు తెలిపినట్లు ‘వార్విక్’ తమ వెబ్‌సైట్ ద్వారా వెల్లడించింది. మరిన్ని పరిశోధనలు చేపట్టి, త్వరలోనే ఔషదంగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిపింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.