యాప్నగరం

బీకేర్ ఫుల్.. ఆ నూనెతో జ్ఞాపకశక్తి లోపం!

వంటల్లో ఎక్కువగా ఆ నూనెను ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గడం, బరువు పెరగడం, నేర్చుకునే సామర్థ్యం తగ్గడం లాంటి సమస్యలు..

TNN 8 Dec 2017, 6:40 pm
తరచుగా ఆవ నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని ఓ అధ్యయనంలో వెల్లడైంది. ఆవ నూనెను ఎక్కువగా వాడటం వల్ల నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపకశక్తి తగ్గుతుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఎలుకలపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాలు వెల్లడయ్యాయి. మెదడుకు హాని వాటిల్లడంతోపాటు, బరువు పెరగడానికి కూడా ఆవ నూనె కారణం అవుతోందని పరిశోధకులు చెబుతున్నారు.
Samayam Telugu canola oil may worsen your memory study finds
బీకేర్ ఫుల్.. ఆ నూనెతో జ్ఞాపకశక్తి లోపం!


ఆవ నూనెలో యూరిక్ యాసిడ్ తక్కువ మోతాదులో ఉంటుంది. ఇతర నూనెలతో పోలిస్తే ఖరీదు ఎక్కువగా ఉండే ఈ నూనె ఆరోగ్యకరమైందనే భావన ఉంది. మనవాళ్లు పచ్చళ్లు పెట్టడానికి కూడా దీన్ని వాడుతుంటారు. కానీ పరిశోధకులు మాత్రం ఇందుకు విరుద్ధంగా చెబుతుండటం గమనార్హం.

ఆవ నూనె మెదడులో అమీలాయిడ్ ఫలకాలు ఏర్పడటానికి, అల్జీమర్ వ్యాధికి కారణం అవుతోందని పరిశోధకులు గుర్తించారు. ఫలితంగా న్యూరాన్ల పనితీరు దెబ్బతిని, జ్ఞాపకశక్తి తగ్గుతుందని తెలిపారు. ఆలివ్ ఆయిల్‌తో ఎలుకల మెదడులో అమీలాయిడ్ ఫలకాల స్థాయి తగ్గుతున్నట్లు గుర్తించారు. ఆవ నూనెతో జ్ఞాపకశక్తి తగ్గుతుండగా, ఆలివ్ ఆయిల్‌తో మాత్రం అందుకు విరుద్ధంగా జ్ఞాపకశక్తి పెరుగుతున్నట్లు తేలింది.

ఏడాదిపాటు ఎలుకలకు రోజుకు రెండు టేబుల్ స్పూన్లకు సమాన మోతాదులో ఆవ నూనె ఇవ్వగా.. అవి బరువు పెరగడాన్ని గుర్తించారు. మామూలు ఆహారం తీసుకున్న ఎలుకల కంటే ఆవ నూనె తీసుకున్నవి ఎక్కువ బరువు పెరిగాయి. జ్ఞాపకశక్తి, నేర్చుకునే సామర్థ్యం కూడా కొరవడినట్లు తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.