యాప్నగరం

షుగర్ పేషంట్లు కొబ్బరినీళ్లు తాగొచ్చా?

షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడానికి భయపడుతుంటారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని కొబ్బరి నీళ్లు తాగకుండా దూరం పెడతారు. అయితే అలాంటివన్ని కేవలం అపోహలే అంటున్నారు పరిశోధకులు.

Samayam Telugu 23 Jul 2018, 5:59 pm
షుగర్ వ్యాధితో బాధపడేవారు కొబ్బరి నీళ్లు తీసుకోవడానికి భయపడుతుంటారు. షుగర్ లెవల్స్ పెరుగుతాయని కొబ్బరి నీళ్లు తాగకుండా దూరం పెడతారు. అయితే అలాంటివన్ని కేవలం అపోహలే అంటున్నారు పరిశోధకులు. కొబ్బరి నీళ్లు తాగేవారిలో షుగర్ లెవల్స్ పెరగడానికి బదులుగా.. తగ్గుతాయని వారు స్పష్టం చేస్తున్నారు. కొబ్బరినీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయని ఈ మేరకు వారు నిరూపించారు కూడా.
Samayam Telugu coconut


కొబ్బరి నీళ్లలో ఉండే కేవలం మూడు గ్రాముల పీచు పదార్థం, సులువుగా జీర్ణమయ్యే ఆరు గ్రాముల పిండి పదార్థం వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని.. మధుమేహ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా కొబ్బరినీళ్లు తీసుకోవచ్చని పరిశోధకులు సలహా ఇస్తున్నారు.

ఇన్సులిన్‌కి స్పందించే గుణాన్ని మెరుగుపరచి రక్తంలో చక్కెరను తగ్గించే మెగ్నీషియం విరివిగా ఉన్నందువల్ల టైప్-2 డయాబెటీస్, ప్రీ-డయాబెటిక్స్ ఉన్నవారు కొబ్బరినీళ్లు తీసుకుంటే మంచిదని వారంటున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.