యాప్నగరం

'క్రాఫ్ట్ బీరు' తాగితే మంచిదట

బీరు అంటే తెలియని వారుండరు. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, పొట్ట బెలూన్ లాగా బాగా పెరిగిపోయి పేలడానికి సిద్ధంగా ఉన్నా.. పీపాలకు పీపాలు తాగేస్తూ ఉంటారు బీరు ప్రియులు...

TNN 7 Aug 2016, 7:04 pm
బీరు అంటే తెలియని వారుండరు. ఆరోగ్యానికి హానికరం అని తెలిసినా, పొట్ట బెలూన్ లాగా బాగా పెరిగిపోయి పేలడానికి సిద్ధంగా ఉన్నా.. పీపాలకు పీపాలు తాగేస్తూ ఉంటారు బీరు ప్రియులు. ఈ బీరు ప్రియుల బాధని, అవసరాలను అర్థం చేసుకున్న ముంబై, పుణెల్లోని కొన్ని చిన్న బీరు పరిశ్రమలు 'క్రాఫ్ట్ బీరు' పేరుతో కొత్త రకం బీరును తయారు చేశారు. ఈ క్రాఫ్ట్ బీరులో కూడా మామూలు బీరులో వాడే మాల్ట్, హాప్స్, ఈస్ట్, నీరు ఇతర ఇంగ్రీడియంట్లను కలిపి ఎలాంటి ప్రిజర్వేటివ్స్, కృత్రిమ రంగులు లేకుండా హజమైన పద్ధతిలో తయారు చేస్తున్నారు. ఈ రకంగా తయారైన ఈ క్రాఫ్ట్ బీరును తాగటం వల్ల అనారోగ్యంతో ఉన్నవారికి కూడా వారి ఆరోగ్యం బాగుపడుతుందని చెప్తున్నారు. ఈ బీరుపై ప్రచారం కల్పించేందుకు ప్రతీ శని, ఆది వారాల్లో 'క్రాఫ్ట్ బీర్ వీకెండర్' పేరుతో పార్టీలనూ నిర్వహిస్తున్నారు. అయితే మామూలు బీర్ తో పోల్చితే ఈ క్రాఫ్ట్ బీర్ ధర ఎక్కువ.
Samayam Telugu craft beers enetering into markets saying its healthy
'క్రాఫ్ట్ బీరు' తాగితే మంచిదట


మూత్రంతో బీర్ తయారీ చదవండి క్రింది లింక్ లో

http://telugu.samayam.com/lifestyle/beer-made-from-urine-is-ready-to-serve-chilled/articleshow/53453531.cms



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.