యాప్నగరం

women health day:ఇవి తింటే.. 15 రోజుల్లో రక్తహీనత తగ్గుతుంది తెలుసా..!

సాధారణంగా మహిళలు ఎదుర్కొనే ప్రధాన సమస్య రక్తహీనత. భారత్‌లో 52 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారట. రక్తహీనత మూలంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. మహిళలు.. రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి.. ప్రముఖ డైటీషియన్‌, పోషకాహార నిపుణురాలు, ఫ్యాట్‌ టూ స్లిమ్‌ డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ శర్మ కొన్ని సూచనలు చేశారు అవేంటో చూసేయండి.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 28 May 2022, 4:07 pm
ఓ సర్వే ప్రకారం భారత్‌లో 52 శాతం మంది స్త్రీలు రక్తహీనతతో బాధపడుతున్నారట. అంటే ప్రతి ఇద్దరిలో ఒకరు ఈ సమస్య ఉన్నవారే. రక్తహీనత మూలంగా మహిళల్లో ఎన్నో రకాల అనారోగ్యాలు తలెత్తుతాయి. అలసట, నీరసం.. వంటి సాధారణ ఆరోగ్య సమస్యలతో పాటు.. నెలసరి సమయంలో బ్లీడింగ్‌లో హెచ్చుతగ్గులు, గర్భం ధరించలేకపోవడం, ఒకవేళ గర్భం వచ్చినా అది నిలవకపోవడం, ప్రసూతి మరణాలు/మాతృ మరణాలు పెరిగిపోవడం.. వంటి సమస్యలూ తప్పవంటున్నారు నిపుణులు.
Samayam Telugu anemia

ఈ రోజు అంతర్జాతీయ మహిళా ఆరోగ్య దినోత్సవం. ప్రతి సంవత్సవం మే 28న మహిళా ఆరోగ్య దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య ఉద్దేశం.. మహిళలు ఎదుర్కొనే వ్యాధులు, వాటి నివారణ గురించి అగాహన కల్పించడం దీని ముఖ్య ఉద్దేశం. మహిళలు.. రక్తహీనత సమస్య నుంచి బయటపడటానికి.. ప్రముఖ డైటీషియన్‌, పోషకాహార నిపుణురాలు, ఫ్యాట్‌ టూ స్లిమ్‌ డైరెక్టర్‌ శిఖా అగర్వాల్‌ శర్మ కొన్ని సూచనలు చేశారు అవేంటో చూసేయండి.
పండ్లు, దాల్చిన చెక్క..

మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పండ్లు తినాలి. దానిమ్మ, కివీ, జామ, పైనాపిల్ వంటి పండ్లను తీసుకుంటే చాలా మంచిది. మీరు పండ్లు సలాడ్‌లా చేసుకుని ఎంజాయ్‌ చేయవచ్చు. సలాడ్‌‌లో దాల్చిన చెక్కపొడి, నల్ల ఉప్పు, నల్ల మిరియాల పొడి వేస్తే.. దానిలో పోషక విలువుల ఇంకా మెరుగుపడతాయి. ఇది రక్తహీనత సమస్యను నివారిస్తుంది.
తాజా కూరగాయలు..

మీరు రోజూ టమోటాలు వంటి కూరగాయల సలాడ్‌లా చేసుకుని తినాలి. తాజా కూరగాయల సూప్ కూడా తీసుకోవచ్చు. కూరగాయలను ఏదైనా రూపంలో తినే ముందు దాల్చిన చెక్క పొడిని అందులో వేసుకుంటే మంచిది. మీ ఆహారంలో పాలకూర తీసుకుంటే చాలా మంచిది. కప్పు పాలకూర ద్వారా రోజు అందాల్సిన ఐరన్‌లో 15 శాతం లభిస్తుందట. దీంతో పాటు విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు కూడా శరీరానికి అందుతాయి. కప్పు ఉడికించిన కాయ ధాన్యాల నుంచి సుమారు 37 శాతం ఐరన్‌ని పొందచ్చని నిపుణులు వెల్లడించారు. అందుకే పప్పులు, రాజ్మా, చిక్కుళ్లు, శెనగలు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం ఉత్తమం.
కిస్‌మిస్‌..

రక్తహీనత సమస్య నుంచి బయటపడాలంటే.. ఐరన్‌ అధికంగా ఉండే పదార్థాల్ని మెనూలో చేర్చుకుంటే మంచిది. ఇనుము లోపం ఉన్న వారికి కిస్‌మిస్‌ దివ్యౌషధం అంటున్నారు నిపుణులు. వంద గ్రాముల కిస్‌మిస్‌లో 1.9 మిల్లీగ్రాముల ఐరన్ లభిస్తుంది. ఇది రోజూ కావాల్సిన దానిలో పదిశాతం.. రుచికరంగా ఉండడం మాత్రమే కాదు.. ఐరన్‌తో పాటు మరెన్నో పోషకాలను మిళితం చేసుకున్న కిస్‌మిస్‌లతో తీపి తినాలన్న కోరికను కూడా అదుపు చేసుకోవచ్చు. వీటిని ఉదయాన్నే ఓట్‌మీల్‌, సలాడ్స్‌, పెరుగు.. వంటి వాటిలో కలిపి తీసుకోవచ్చు. లేదంటే స్నాక్స్‌ సమయంలోనూ తినచ్చు.
గుమ్మడికాయ గింజలలో వివిధ రకాల యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రక్తహీనత, ఋతు సమస్యలు, హార్మోన్లను సమతుల్యం చేస్తాయి.
పప్పులు..

కప్పు ఉడికించిన కాయ ధాన్యాల నుంచి సుమారు 37 శాతం ఐరన్‌ని పొందచ్చంటున్నారు నిపుణులు. అందుకే పప్పులు, రాజ్మా, చిక్కుళ్లు, శెనగలు.. వంటివి రోజువారీ ఆహారంలో భాగం చేసుకుంటే.. రక్తహీనత సమస్య నుంచి బయటపడతారు.
పైన పేర్కొన్న ఆహారం తీసుకుంటే.. కేవలం 15 రోజ్లుల్లో ప్రభావం మీకు కనిపిస్తుందని డా. శిఖా అగర్వాల్‌ అన్నారు. వీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల అలసట, బలహీనత, ఒత్తిడి వంటి సమస్యలను ఎదుర్కోవడంలో మీకు సహాయపడుతుంది.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.