యాప్నగరం

Thyroid: హైపోథైరాయిడ్‌ పేషెంట్స్‌ బరువు తగ్గాలంటే.. ఈ సూప్‌ తాగండి..!

Thyroid: థైరాయిడ్ మన శరీరంలో అనేక విధులకు సహాయపడే హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాక్సిన్‌ తక్కువగా విడుదల అయితే హైపోథైరాయిడ్‌‌కు దారి తీస్తుంది. దీని కారణంగా బరువు పెరగడం, అలసట, నెలసరి క్రమం తప్పడం వంటి లక్షణాలు ఎదురవుతుయి. వీటిని నయం చేయండి, బరువును కంట్రోల్‌లో ఉంచే ఎఫెక్టివ్‌ సూప్‌ను ప్రముఖ డైటీషియన్‌ మన్‌ప్రీత్ మనతో పంచుకున్నారు.

Authored byరాజీవ్ శరణ్య | Samayam Telugu 4 May 2023, 10:31 am
Thyroid: థైరాయిడ్ అనేది గొంతులో ఉండే ఒక గ్రంథి. ఇది శరీరంలో అనేక విధులకు అవసరమైన కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్‌ గ్రంథి టి3, టి4 అనే రెండు హార్మోన్లను విడుదల చేస్తుంది. శ్వాసవ్యవస్థ, గుండె, నాడీ, జీర్ణవ్యవస్థ, సంతానోత్పత్తి వ్యవస్థ.. ఇలా చాలా వాటిపై థైరాయిడ్‌ హార్మన్‌ ఎఫెక్ట్‌ ఉంటుంది. థైరాయిడ్‌ సమస్య.. హైపోథైరాయిడ్‌, హైపర్‌ థైరాయిడ్‌గా ఉంటుంది. థైరాక్సిన్‌ తక్కువగా విడుదల అయితే.. హైపో థైరాయిడ్‌గా, థైరాక్సిన్‌ అధికంగా ఉంటే హైపర్‌ థైరాయిడ్‌ అని పిలుస్తాం. ఈ మార్పుల కారణంగా.. జీవక్రియ పనితీరు నెమ్మదిగా ఉంటుంది.. దీని కారణంగా బరువు పెరుగుతారు. శరీర ఉష్ణోగ్రత, కేలరీలను బర్న్‌‌ చేసే రేటును ప్రభావితం అవుతుంది. దీంతో హైపోథైరాయిడిజం పేషెంట్స్ త్వరగా అలసిపోతూ ఉంటారు, సులభంగా బరువు పెరుగుతారు. వీటితో పాటు.. మలబద్ధకం, పొడి చర్మం, విపరీతమైన ఒళ్లు నొప్పులు, నెలసరి క్రమం తప్పడం, జుట్టు రాలడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. హైపోథారాయిడిజంను కంట్రోల్‌లో ఉంచడానికి, ఈ లక్షణాలు తగ్గించే మ్యాజికల్‌ సూప్‌ రెసిపీని ప్రముఖ డైటీషియన్‌ మన్‌ప్రీత్ మనతో పంచుకున్నారు. ఈ సూప్‌లో ఉండే.. 5 సూక్ష్మపోషకాలు.. థైరాయిడ్‌ లక్షణాలను తగ్గిస్తాయని అన్నారు.
Samayam Telugu Thyroid

View this post on Instagram A post shared by Hormone Balance and Gut health Dietitian (@dietitian_manpreet)

సూప్‌ ఇలా రెడీ చేసుకోండి..

(image source - pixabay)



కుక్కర్‌లో 1 చెంచా నెయ్యి వేసి, ఒక క్యారెట్‌ చిన్న ముక్కలుగా కోసి దానిలో వేసి వేయించండి. ద
ఇప్పుడు 2 చెంచాల నానబెట్టిన ఎర్ర పప్పు వేయండి. ఆ తర్వత రుచికి తగ్గట్టు ఉప్పు, నల్ల మిరియాల పొడి వేసి తిప్పండి.
తర్వాత కొంచెం నీళ్లు పోసి మరిగించండి, దాన్ని మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించండి.
ఇప్పుడు స్టౌ ఆఫ్‌ చేసి, సూప్‌ను ఒక బైల్‌లోకి తీసుకోండి, దీనిలో కొన్ని గుమ్మడి గింజలు, పొద్దుతిరుగుడు గింజలు వేసుకుని తాగండి.

WHO ప్రకారం, విటమిన్లు, మినరల్స్‌ మన శరీరానికి తక్కువ మొత్తంలో అవసరమైన సూక్ష్మపోషకాలు. ఈ పోషకాలు థైరాయిడ్ హార్మోన్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. ఈ సూప్‌లో విటమిన్ ఎ, అయోడిన్, ఐరన్, జింక్, సెలీనియం వెంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయని డైటీషియన్‌ మన్‌ప్రీత్ అన్నారు. ఇవి హైపోథైరాయిడిజమ్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి.
విటమిన్ ఎ, అయోడిన్ & ఐరన్..

(image source - pexels)


విటమిన్ ఎ, అయోడిన్, ఐరన్ లోపం కారణంగా.. థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. హైపోథైరాయిడిజంలో ఈ సూక్ష్మపోషకాల అధికంగా తీసుకోవడం వల్ల.. థైరాయిడ్‌ హార్మోన్‌ ఉత్పత్తి మెరుగుపడుతుందని అనేక పరిశోధనలు స్పష్టం చేశాయి.
జింక్‌, సెలీనియం..
గుమ్మడి గింజలలో జింక్, పొద్దుతిరుగుడు విత్తనాలలో సెలీనియం మెండుగా ఉంటాయి. ఈ రెండు మినరల్స్‌.. థైరాయిడ్‌ గ్రంధిని యాక్టివ్‌ చేస్తాయి. థైరాయిడ్‌ హార్మోన్ల ఉత్పత్తిని మెరుగుపరచి.. బరువు తగ్గించడంలో ప్రయోజనకరంగా ఉంటాయి.
గమనిక: ఆరోగ్య నిపుణులు, అధ్యయనాల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన ఏ చిన్న సమస్య ఉన్నా వైద్యులను సంప్రదించడమే ఉత్తమ మార్గం. గమనించగలరు.
రచయిత గురించి
రాజీవ్ శరణ్య
రాజీవ్‌ శరణ్య సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ లైఫ్‌స్టైల్‌కి సంబంధించిన సరికొత్త విషయాలను, స్పెషల్ కంటెంట్‌ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, రాజకీయ, లైఫ్‌స్టైల్ స్టోరీస్ అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.