యాప్నగరం

Solar Eclipse 2019: సూర్య గ్రహణ సమయంలో ఆహారం, నీరు తీసుకోవచ్చా..

చాలా ప్రాంతాల్లో గ్రహణ సమయాల్లో ఆహారం తీసుకోరు. పెద్దవారు దీనికి కొన్ని నియమాలు చెబుతారు. గరిక వంటి పదార్థాలు ఆహారంలో వేస్తుంటారు. నీటిలో కూడా వేస్తుంటారు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటది. వీటిని కొన్నింటిని తప్పని కొట్టిపారేస్తారు. కానీ, వీటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ చాలానే ఉన్నాయని చెబుతారు. అవేంటంటే..

Samayam Telugu 26 Dec 2019, 12:36 am
గ్రహణం అనగానే చాలా మంది కొన్ని నియమాలు పాటిస్తారు. ఆ సమయంలో ఆహారం తీసుకోరు. నీటిని తీసుకోరు. చాలా ప్రాంతాల్లో ఈ సమయాల్లో ఆహారం తీసుకోరు. పెద్దవారు దీనికి కొన్ని నియమాలు చెబుతారు. గరిక వంటి పదార్థాలు ఆహారంలో వేస్తుంటారు. నీటిలో కూడా వేస్తుంటారు. వీటి గురించి చాలా మందికి తెలిసే ఉంటది. వీటిని కొన్నింటిని తప్పని కొట్టిపారేస్తారు. కానీ, వీటి వెనుక సైంటిఫిక్ రీజన్స్ చాలానే ఉన్నాయని చెబుతారు. అవేంటంటే..
Samayam Telugu solar Eclipse 2


గ్రహణ సమయంలో ఆహారంపై వేసే ఈ పదార్థాలను దర్భలు అంటుంటారు. అయితే, వీటిని మూఢనమ్మకాలు అని అంటుంటారు. అయితే దీని వెనుక సైంటిఫిక్ రీజన్స్ కూడా ఉన్నాయి. అవేంటంటే.. గ్రహణ సమయంలో సూర్యుడి నుంచి కిరణాల వల్ల నీరు కలుషితమవుతుందని కొన్ని పరిశోధనల్లో తేలింది. ఇలా కలుషితమైన నీటిని శుద్ధి చేసే గుణం దర్భలకు ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నట్లు గుర్తించారు. గ్రహణ సమయంలో వెలువడే అతినీల లోహిత కిరణాలు తీవ్రతను తగ్గిస్తాయి. సాధారణంగా తులసి ఆకుల్లో ఎన్నో అద్భుత గుణాలు ఉంటాయి. వీటికంటే ఎక్కువగా దర్భల్లో ఉంటాయని చెబుతున్నారు నిపుణులు.

గ్రహణ సమయంలో సూర్య కిరణాలలోని మార్పులు అనూహ్యంగా చోటు చేసుకుంటాయి. దీని ప్రభావం కారణంగా జీర్ణ సమస్యలు తలెత్తుతాయి. గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారం స్వీకరించకపోవడమే మంచిదని పెద్దలు చెబుతారు. ఆ క్షణంలో మార్పు కనిపించకపోయినా దాని ప్రభావం తప్పకుండా ఉంటుంది. అదే విధంగా గ్రహణాన్ని నేరుగా చూడకూడదని చెబుతుంటారు. దీనికి కారణం ఆ కిరణాలు పడడం వల్ల సున్నితమైన పొరలు దెబ్బతిని అంధత్వం వస్తుంది. ఎలాంటి ఉకరణాలు లేకుండా నేరుగా గ్రహణాన్ని చూడడం వల్ల ఏర్పడే దోషాలను చికిత్సతో నయం చేయడం కష్టమని కంటి వైద్య నిపుణులు అంటుంటారు. ముఖ్యంగా పిల్లలు ఇలాంటి పనులు చేయకుండా పెద్దలు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.