యాప్నగరం

గోధుమ గడ్డి రసం ఎన్నో రోగాలకు పరిష్కారం!

గోధుమ గడ్డి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఆయుర్వేదం ప్రకారం గోధుమ గడ్డి రసం

Samayam Telugu 26 Jun 2017, 3:22 pm
గోధుమ గడ్డి అనేక రకాల ఆరోగ్య సమస్యలకు పరిష్కారం. ఆయుర్వేదం ప్రకారం గోధుమ గడ్డి రసం (జ్యూస్) రోజూ ఉదయం పరగడుపునే 30 ఎం.ఎల్ మోతాదులో తీసుకుంటే ఎన్నో లాభాలున్నాయి. పొడిగా, టాబ్లెట్ల రూపంలో లభిస్తున్న గోధుమ గడ్డిని.. రసం చేసుకొని తాగితేనే మంచింది.
Samayam Telugu drink juice of wheat grass be healthy
గోధుమ గడ్డి రసం ఎన్నో రోగాలకు పరిష్కారం!


పుష్కలంగా ఫైబర్ ఉండే గోధమ గడ్డిని క్రమం తప్పకుండా తీసుంటే అర్షమొలలకు చక్కని ఔషదంగా పనిచేస్తుంది. అజీర్ణం, గ్యాసం, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు దరిచేరవు. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు అధికంగా ఉండే ఇందులో.. శరీరంలోని వాపులను తగ్గిస్తాయి. అలర్జీలు రాకుండా, అస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులను అరికట్టేలా చేస్తుంది.

ప్రేగుల్లోని చెత్తాచెదారాన్ని గోధుమగడ్డి క్లీన్ చేస్తుంది. అల్సర్ వంటి సమస్యను జయించేలా చేస్తుంది. క్లోరోఫిల్ సమృద్ధిగా ఉండటంతో రక్తం శుద్ధి కావడమేగాకుండా... రక్తం పెరుగుదలకు తోడ్పడుతుంది.

యాంటీ యాక్సిడెంట్లు గోధుమ గడ్డిలో ఉండటం వల్ల ఒత్తిడి, ఆందోళనలను తగ్గిస్తుంది. శరీర చురుకుదనాన్ని కల్గిస్తుంది. అంతేకాదు క్యాన్సర్ కణాలను సైతం నాశనం చేసే శక్తి దీనికుందని ఇటీవలి అధ్యయానల్లో తేలింది.
ఇన్ని ప్రయోజనాలున్నా గోధుమ గడ్డిని.. ఇంట్లోని పూలకుండీల్లోనూ పెంచుకోవచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.