యాప్నగరం

కిడ్నీ రోగులకు.. కాఫీ మందు!

దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులు కాఫీ తాగడం వల్ల మరింత కాలం జీవించవచ్చని ఓ అధ్యాయనంలో తేలింది.

PTI 4 Nov 2017, 7:05 pm
లండన్: దీర్ఘకాలికంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న రోగులు కాఫీ తాగడం వల్ల మరింత కాలం జీవించవచ్చని ఓ అధ్యాయనంలో తేలింది. పోర్చ్‌గల్‌కు చెందిన సెంట్రో హాస్పిటలర్ లిస్బోవా నోర్టేకు చెందిన పరిశోధకులు దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు (CKD) కలిగిన 2328 రోగులపై ఈ పరీక్షలు నిర్వహించారు. కెఫిన్ ఎక్కువగా తీసుకునేవారికి, తక్కువగా తీసుకునేవారికి మధ్య వ్యత్యాసం, ప్రాణహాని ముప్పు ఏ మేరకు తగ్గుతుందో పరిశీలించారు.
Samayam Telugu drinking coffee may cut death risk in kidney disease patients
కిడ్నీ రోగులకు.. కాఫీ మందు!


తక్కువగా కాఫీ తాగేవారిలో 12 శాతం, మోస్తారుగా తాగేవారిలో 22 శాతం, ఎక్కువగా తాగేవారిలో 24 శాతం ప్రాణహాని ముప్పు తగ్గినట్లు గమనించారు. సెంట్రో హాస్పిటలర్ లిస్బోవా నోర్టేకు చెందిన పరిశోధకుడు మిగ్యూల్ బిగొటె వైరా మాట్లాడుతూ.. ‘‘కెఫిన్ వల్ల కిడ్నీ రోగుల్లో ప్రాణహాని ముప్పు తగ్గుతుందని ఈ ప్రయోగంలో తేలింది. ఇది మున్ముందు ఈ రోగ చికిత్సకు మరింత ఉపయుక్తంగా మారే అవకాశం ఉంది’’ అని తెలిపినట్లు పీటీఐ వార్తా సంస్థ వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.