యాప్నగరం

ఎనర్జీ డ్రింకులు తాగుతున్నారా.. మీ గుండె జాగ్రత్త

ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.

Samayam Telugu 31 May 2019, 3:41 pm
ఈ మధ్య కాలంలో ఎనర్జీ డ్రింక్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. తక్షణ శక్తి పొందేందుకు యువతతో పాటు మధ్య వయస్కులు కూడా వీటికి అలవాటు పడుతున్నారు. అయితే ఈ డ్రింక్స్‌ను అప్పుడప్పుడు తాగితే ఫర్వాలేదు గానీ.. రోజూ తాగితే మాత్రం హాస్పిటల్ బెడ్ ఎక్కాల్సిందేనని చెబుతున్నారు పరిశోధకులు.
Samayam Telugu drinjls


ఎనర్జీ డ్రింక్స్ అతిగా తాగితే శరీరంలో రక్తపోటు స్థాయి విపరీతంగా పెరిగిపోయి హృదయ స్పందనల్లో తీవ్ర మార్పులు చోటుచేసుకునే అవకాశం ఉందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. దీనిపై అమెరికాలోని యూనివర్శిటీ ఆఫ్ పసిఫిక్ సైంటిస్టులు పరిశోధన చేపట్టారు. 18-40 ఏళ్ల వయస్సు గల 34 మందిని ఎంపిక చేసుకుని వారితో మూడు వ్యవధిలో 304-320 గ్రాముల కెఫైన్ కలిసిన 32 ఔన్స్‌ల ఎనర్జీ డ్రింక్‌ను తాగించారు. ఆ డ్రింక్ తాగిన వారిలో హృదయ స్పందనలు 6 మిల్లీ సెకన్ల నుంచి 7.7 మిల్లీ సెకన్లకు పెరిగినట్లు గుర్తించారు.

హృదయ స్పందనలో హెచ్చుతగ్గులు జరిగితే అది ప్రాణాలకే ముప్పు తెస్తుందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. తక్షణ శక్తిని ఇస్తాయని అతిగా ఎనర్జీ డ్రింకులు తాగేస్తే గుండె జబ్బులతో త్వరగా పైకి పోవడం ఖాయమని పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి సూపర్‌మార్కెట్లలో డిస్కౌంట్‌పై వస్తున్నాయని ఎనర్జీ డ్రింకులు ఎక్కువగా తెచ్చుకుని తాగేయకండి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.