యాప్నగరం

ఆ చిన్నారి గుండె ఛాతి నుంచి బయటకొస్తోంది!

ఓ చిన్నారిలో గుండె ఛాతి నుంచి బయటకు వచ్చి కొట్టుకుంటోంది. అరుదైన వ్యాధి కారణంగా ఇలా అవుతోందని డాక్టర్లు తెలిపారు.

TNN 20 Sep 2017, 2:43 pm
మనం సంతోషంగా ఉండటానికి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపడానికి నవ్వడం ఎంతో ముఖ్యం. నవ్వు ఒక యోగం. చిరునవ్వుతో ఎదుటి వ్యక్తి కోపాన్ని దూరం చేయొచ్చు. కానీ ఓ చిన్నారికి మాత్రం చిరునవ్వే శాపంగా మారింది. తన నవ్వుకు గుండె ప్రతిస్పందిస్తోందా.. అన్నట్టుగా ఛాతి నుంచి పైకొచ్చి కొట్టుకుంటోంది. చర్మం పొర కప్పేసే ఉన్నప్పటికీ.. గుండె పైకి రావడం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది.
Samayam Telugu girls heart pushes out of chest beats outside the body
ఆ చిన్నారి గుండె ఛాతి నుంచి బయటకొస్తోంది!


ఫ్లోరిడాకు చెందిన విర్సావియా అనే అమ్మాయి నవ్వినప్పుడు గుండె ఛాతి నుంచి బయటకు వచ్చి కొట్టుకుంటోంది. అరుదైన వ్యాధి కారణంగా ఇలా జరుగుతోంది. ఇలాంటి స్థితిని పెంటాలజీ ఆఫ్ క్యాంట్రెల్ అంటారు. 55 లక్షల మందిలో ఒకరికి మాత్రమే ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది.

తను అందరిలా ఎక్కువ కాలం బతకడం సాధ్యం కాదని పుట్టినప్పుడే డాక్టర్లు చెప్పేశారు. ఆ చిన్నారి జన్మించినప్పుడు.. పేగులు కూడా బయటకొచ్చాయి. కానీ ఏడేళ్ల విర్సావియా మాత్రం ఇప్పటికైతే బాగానే ఉంది. ఆమెకు చికిత్స అందించడానికి ఓ డాక్టర్ ముందుకొచ్చారు. కానీ హై బీపీ కారణంగా తనకు సర్జరీ చేయడం సాధ్యపడలేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.