యాప్నగరం

గ్రీన్ టీతో అధికబరువే కాదు.....

అధిక బరువును తగ్గించుకోడానికి చాలా మంది రోజూ గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గడమే కాదు, గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుందట.

TNN 7 Feb 2017, 3:43 pm
అధిక బరువును తగ్గించుకోడానికి చాలా మంది రోజూ గ్రీన్ టీ తాగుతారు. గ్రీన్ టీ తీసుకుంటే బరువు తగ్గడమే కాదు, గుండె జబ్బుల ముప్పు కూడా తగ్గుతుందట. దీంతోపాటు చక్కెర స్థాయిలు కూడా అదుపులో ఉంటాయట. అలాగే ఎముకల మజ్జకు సంబంధించిన సమస్యలతో బాధపడేవారు గ్రీన్ టీ తాగితే దాన్ని ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చని అమెరికాకు చెందిన ఓ అధ్యయనం వెల్లడించింది. ఎపిగాల్లోకాటెచిన్-3-గాల్లెట్ (ఈజీసీజీ) అనే ఫాలిఫినాల్‌ను గ్రీన్ టీ ఆకుల్లో గుర్తించారు.
Samayam Telugu good news green tea may benefit people with bone marrow disorders
గ్రీన్ టీతో అధికబరువే కాదు.....


బోన్ మ్యారో, మైలోమా, అమైలాయిడోసిస్ లాంటి సమస్యలతో బాధపడుతున్న రోగులకు గ్రీన్ టీ ఎంతగానో తోడ్పడుతుందని అమెరికా, జర్మనీ శాస్త్రవేత్తల సంయుక్త అధ్యయనంలో వెల్లడైంది. బోన్ మ్యారో వ్యాధిగ్రస్తుల శరీరంలోని యాంటీ బాడీలు గుండె, కిడ్నీలు తదితర అవయవాల్లో పేరుకుపోతాయి. దీన్నే లైట్ చైన్ ఫ్యాటల్ కండీషన్ అంటారు. ఈ సమస్యను గ్రీన్ టీ తొలగిస్తుంది.

గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. రోజూ కనీసం రెండు, మూడు సార్లు సేవిస్తే ఆరోగ్యంతోపాటు అందం కూడా సొంతమవుతుంది.
జీర్ణక్రియ, గుండె పనితీరు మెరుగవుతాయి. బీపీ, షుగర్ స్థాయులు అదుపులో ఉంటాయి. గ్రీన్ టీలోని థినైన్ అనే పదార్థం మెదడును చురుకుగా ఉంచుతుంది.

క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా ఎదుర్కొనే శక్తి కూడా దీనిలో ఉంది. రొమ్ము క్యాన్సర్‌తో బాధపడే స్త్రీలు రోజుకు నాలుగు నుంచి ఐదు కప్పుల గ్రీన్ టీ తాగితే మంచి ఫలితముంటుందని పరిశోధనలో తేలింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.